వామ్మో.. ఎంత బరువో..!

Updated By ManamSat, 06/30/2018 - 20:41
She Kept, Gaining Weight, Didn't Know Why. It Was A 50-Pound Ovarian Cyst

She Kept, Gaining Weight, Didn't Know Why. It Was A 50-Pound Ovarian Cystవాషింగ్టన్: కొన్నినెలలుగా ఓ 30ఏళ్ల మహిళ ఉన్నట్టుండి భారీగా బరువు పెరిగిపోయింది. ఆమె పొట్ట కూడా పుచ్చకాయంతా పరిమాణంలో ఉబ్బిపోతూ వచ్చింది. తగ్గడానికి వీలులేని విధంగా పౌండ్ల కొద్ది బరువు పెరిగిపోతూ వచ్చింది. అది చూసిన వాళ్లంతా ఆమె గర్భవతి అని, మహిళ కడుపులో కవల పిల్లలు ఉన్నారంటూ జోకులు పేల్చేవారు. ఈ క్రమంలో రోజురోజుకీ మహిళ కడుపులో తీవ్ర నొప్పి, పొట్ట ఉబ్బిపోవడం, శ్వాస తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు తార స్థాయికి చేరాయి. దాంతో భరించలేని పరిస్థితిలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి శస్త్రచికిత్స చేయగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. దాన్ని చూసిన వైద్యులే పరేషాన్ అయ్యారు. ఇంతకీ ఆమె కడుపులో ఏముందో తెలుసా? అండాశయ తిత్తి.. దీని బరువు ఎంతో తెలుసా? దాదాపు 50 పౌండ్లు (22 కిలోలకుపైనే). ఈ మేరకు మోంట్గోమేరీ, అలబామా‌లోని జాక్సన్ హాస్పటిల్ అధికారులు అరుదైన ఈ సర్జరీకి సంబంధించి ప్రకటనను విడుదల చేశారు. మహిళ కడుపులో మ్యుసినస్ సిస్టాడెనోమా అనే గడ్డ ఉందని గుర్తించినట్టు తెలిపారు. 

పిండం కాదట.. భారీ కణతి..
She Kept, Gaining Weight, Didn't Know Why. It Was A 50-Pound Ovarian Cystవాషింగ్టన్‌కు చెందిన కల్యా రహ్న్ (30) గతకొన్నినెలల నుంచి ఆమె కడుపు భారీగా పెరిగిపోతూ వచ్చింది. నెలలు నిండుతున్న గర్భవతిలా ఆమె కడుపు పెద్దగా సాగుతూ బానలాగా ఉబ్బిపోయింది. అప్పటినుంచి ఆమె ఏ పనిచేయాలన్నా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. శ్వాస తీసుకోవడానికి కూడా ఎంతో కష్టంగా ఉండేది. ఆఖరికి తాను ధరించే వస్త్రాలు కూడా సరిపోక ఇబ్బంది పడేది. ఆమెను చూసిన చాలామంది గర్భవతిని, బహుషా కవల పిల్లలు ఉన్నారమోనంటూ జోకులు పేల్చేవారు. ఈ క్రమంలో ఓ రోజు ఒక్కసారిగా కల్యా కడుపులో భరించలేనంతగా తీవ్ర నొప్పి వచ్చింది. దాంతో ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. కల్యా కడుపులో ఉన్నది పిండం కాదని, పుచ్చకాయంతా పరిమాణంలో ఉన్న అండాశయ తిత్తిగా(కణతి) వైద్యులు గుర్తించి దాన్ని విజయవంతంగా తొలగించారు. 

సర్జరీ తరువాత 34 కిలోలు తగ్గింది.. 
సర్జరీ అనంతరం రహ్న్ 75 పౌండ్లు (34కిలోల వరకు) బరువు తగ్గింది. మహిళల్లో సాధారణంగా పెరిగే అండాశయ తిత్తులు హానికరమైనవి కాదని మాయో క్లినిక్ వైద్యులు వెల్లడించారు. చాలామంది మహిళలకు వీటిపై అవగాహన ఉండదని, ఎలాంటి నొప్పి, సమస్యలు లేకపోవడంతో వీటిని ఆలస్యంగా గుర్తించాల్సి వస్తుందని చెప్పారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది మహిళల్లో నొప్పి రావడం, అంతర్గత రక్తస్రావం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని మాయో క్లినిక్ పేర్కొంది. 

English Title
She Kept Gaining Weight, Didn't Know Why. It Was A 50-Pound Ovarian Cyst
Related News