యంగ్‌ హీరోతో దర్శకేంద్రుడి చిత్రం..?

Updated By ManamTue, 11/06/2018 - 12:45
Raghavendra Rao

Raghavendra Rao‘ఓం నమో వేంకటేశాయ’  తరువాత దాదాపు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ విశ్వక్‌సేన్ నాయుడు హీరోగా రాఘవేంద్రరావు ఓ చిత్రానికి ప్లాన్ చేసినట్లుగా సమాచారం. అంతేకాదు ఇందులో నబా నటేశ్, ఈషా రెబ్బాలను హీరోయిన్లుగా ఫిక్స్ చేసినట్లు కూడా టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English Title
Raghavendra Rao movie with Young Hero..?
Related News