పుస్సి రియోట్ సభ్యులకు జైలు

Updated By ManamWed, 07/18/2018 - 00:32
image

imageమాస్కో: ఆదివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వైుదానంలోకి ప్రవేశించిన నలుగురు సభ్యులైపెన రష్యాలోని మీడియాజోన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాన్స్- క్రోయేుషియా జట్ల మధ్య ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిబంధనలకు వ్యతిరేకంగా నలుగురు పుస్సి రియోట్ సభ్యులు వైుదానంలోకి ప్రవేశించినందుకుగాను రష్యాలోని మీడియాజోన్  కోర్టు వారికి 15 రోజులపాటు జైలు శిక్ష విధించింది.

అంతేకాకుండా మూడు సంవత్సరాలు పాటు వారిని స్పోర్ట్స్ ఈవెంట్స్‌లకు నిషేధించింది. ‘ ప్రేక్షకుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందు’కు వీరిపై ఇటువంటి శిక్షలను విధించాం అని మీడియాజోన్ వెబ్‌ైసెట్ వ్యవస్థాపకుడు వెరిజిలోవ్ తెలిపారు.  వారిపై విధించిన శిక్షలకు పుస్సి రియోట్ నిరసనలు తెలిపి తక్షణమే వారిని విడుదల చేయాలని పిలుపునిచ్చింది. 2012 ఫిబ్రవరిలో మాస్కో చర్చిలో పుతిన్‌కు వ్యతిరేకంగా పాటను పాడి పుస్సి రియోట్ వెలుగులోకి వచ్చింది.

English Title
పుస్సి రియోట్ సభ్యులకు జైలు
Related News