కాంగ్రెస్‌కు షాక్.. జనసేనలోకి మాజీ మంత్రి

Updated By ManamFri, 11/09/2018 - 19:24
Pasupulati Balaraju, Congress, Rahul Gandhi, Ys Rajashekar Reddy, Roshaiah, Resign letter

Pasupulati Balaraju, Congress, Rahul Gandhi, Ys Rajashekar Reddy, Roshaiah, Resign letterవిశాఖ: కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పంపారు. ప్రస్తుతం బాలరాజు.. విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మూడున్నర దశాబ్దాల పాటు సేవలందించే అవకాశం కల్పించిన పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ గాంధీకి తన రాజీనామా లేఖ పంపారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాలరాజు పనిచేశారు. మండల స్థాయి నేతగా తన 25వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేసి పార్టీ తరపున ఎన్నో సేవలు చేశారు. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన బాలరాజు...జనసేన పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, బాలరాజు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో కారణాలు తెలియలేదు. 

English Title
Pasupulati Balaraju resigns to Congress party
Related News