మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ లేఖ

Updated By ManamThu, 09/20/2018 - 14:03
narendra modi-imran khan
  • ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పునప్రారంభిద్దామని పిలుపు

Imran Khan letter to Narendra Modi

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్... భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.  భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు తిరిగి పునరుద్దరించాలని ఇమ్రాన్ తన లేఖలో కోరారు. అయితే పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ శాంతి చర్చలు తిరిగి ప్రారంభిద్దామంటూ తొలిసారి లేఖ రాయడం విశేషం. 

ఈ నెలలో న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో రెండు దేశాల విదేశాంగ మంత్రుల భేటీ కోసం ప్రయత్నాలు చేయాలంటూ ఇమ్రాన్ తన లేఖలో ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. 2016లో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడి ఘటన ఇరుదేశాల మధ్య  శాంతి చర్చలు నిలిచిపోయాయి. ఆ తర్వాత నుంచి భారత్-పాక్ మధ్య ఎలాంటి సత్సంబంధాలు లేవు. అయితే ఇప్పటికే ప్రధాని మోదీ పాక్‌తో స్నేహపూరిత బంధాన్ని ఆశిస్తున్నామంటూ ఇమ్రాన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే.

English Title
Pakistan Prime Minister Imran Khan letter to Narendra Modi
Related News