తిరుపతిలో నిపా కలకలం

Updated By ManamSun, 06/03/2018 - 12:26
Nipah Rage In Tirupathi
  • వైద్యురాలికి నిపా లక్షణాలు.. భయం అవసరం లేదన్న జిల్లా కలెక్టర్

Nipah Rage In Tirupathiతిరుపతి: దేశాన్ని వణికిస్తున్న నిపా వైరస్ ఆంధ్రప్రదేశ్‌కూ పాకినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు తిరుపతిలో నిపా వైరస్ కలకలం సృష్టి్స్తోంది. మదనపల్లెకు చెందిన ఓ వైద్యురాలికి నిపా వైరస్ లక్షణాలు వెలుగులోకి వచ్చింది. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలిని అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఆదివారం ఆ వైద్యురాలిని చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పరామర్శించారు. ఆ వైద్యురాలు కేరళ నుంచి వచ్చారని, ఆమెను ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉంచారని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఒక్క నిపా కేసు కూడా నమోదు కాలేదని ఆయన హామీ ఇచ్చారు. నిపా వైరస్ వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వైద్యురాలికి రుయా ఆస్పత్రి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆమె రక్తనమూనాలను పుణె వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపించారు. 

English Title
Nipah Rage In Tirupathi
Related News