సుదీప్‌తో నాగ్ హీరోయిన్‌?

Updated By ManamWed, 05/16/2018 - 17:14
sudeep

aakanksha‘మళ్ళీ రావా’ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యమైన క‌థానాయిక ఆకాంక్ష సింగ్‌. ఆ సినిమాలో అంజలిగా సెటిల్డ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ‌. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ఉత్తరాది భామ.. ఇప్పుడు నాగార్జున, నాని హీరోలుగా శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీలో నాగ్‌కు జంటగా నటిస్తోంది. స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాతో బిజీగా ఉంటూనే.. మరో కన్నడ సినిమాని కూడా ఓకే చేసింది ఈ బాలీవుడ్ భామ.

ఆ వివరాల్లోకి వెళితే.. ‘ఈగ’ సినిమాలో ప‌వ‌ర్‌ఫుల్‌ విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ క‌థానాయ‌కుడిగా ఓ క‌న్న‌డ సినిమా రూపొందుతోంది. ‘పైల్వాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఆకాంక్ష హీరోయిన్‌గా ఎంపికైంద‌ని స‌మాచారం. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించనుంది. కాగా.. రేపటి (మే 17) నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

English Title
nag heroine with sudeep?
Related News