నా మాజీ భర్త చాలా మంచోడు: నికోల్

Updated By ManamWed, 10/17/2018 - 15:06
Tom Cruise

Tom Cruiseతన మాజీ భర్త టామ్ క్రూజ్ చాలా మంచోడంటూ అతడిపై ప్రశంసలు కురిపించింది హాలీవుడ్ నికోల్. అతడు తనకు ఎంతో రక్షణ కల్పించారని ఆమె తెలిపారు. 22ఏళ్ల వయసులో టామ్ క్రూజ్‌, నికోల్ వివాహం చేసుకోగా.. 11ఏళ్ల తరువాత ఆ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. టామ్‌తో విడిపోయిన తరువాత అతడి గురించి కానీ, అతడితో తనకు కలిగిన సంతానం గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నికోల్, టామ్‌పై సానుకూలంగా స్పందించింది. ‘‘చిన్న వయసులోనే వివాహం చేసుకున్నా. ఆ వివాహం నాకు రక్షణ కల్పించింది. నా స్నేహితుల్లో చాలా మంది గృహహింస బాధితులు ఉన్నారు. కానీ టామ్ నన్ను చాలా బాగా చూసుకునేవాడు. అతడితో వివాహం నాకొక రక్షణ కవచంలా నిలిచిందని చెప్పగలను అంటూ తెలిపింది. ఇప్పుడు నాకు మరొకరితో వివాహమైంది కాబట్టి, నా మాజీ బర్త గురించి ఇంతకంటే ఏమీ చెప్పలేను’’ అంటూ నికోల్ తెలిపింది.

English Title
Marriage to Tom Crusie protected me: Nicole Kidman
Related News