లైట్స్.. కెమెరా.. ఈస్ట్రోజన్

Updated By ManamTue, 10/09/2018 - 06:15
manam kutumbam

 imageభలే గమ్మతుగా ఉందీ టైటిల్ కదూ..ఇది బాలీవుడ్ గురించి అంటే.. ఏదో కొత్త సినిమా పేరనుకుని పొరబడతారు.  లైట్స్, కెమెరా, ఈస్ట్రోజన్ అనేది సినిమా కాదు కానీ.. సినిమా తెరవెనుక కథ.  అందుకే విడుదల కాకముందే దీనిపై మంచి క్రేజ్ పుట్టింది. 

ఇది స్టోరీ..
ఓ స్టైలిస్ట్, ఓ స్టంట్ వుమన్, ఓ సినిమాటోగ్రఫర్..ఇదండీ స్టోరీ.. ఇక్కడే గొప్ప మలుపుంది.. బాలీవుడ్‌లో మహిళల ప్రస్థానాన్ని కళ్లకు కట్టినట్టు వివరించే తొలి పుస్తకంగా ‘చేంజ్ మేకర్స్’ అనే పుస్తకంగా సంచలనం సృష్టించడం ఖాయంగా మారింది. అనితా ష్రాఫ్ అనే బాలీవుడ్ స్టైలిస్ట్, గీతా టాండన్ అనే బాలీవుడ్ స్టంట్‌వుమెన్, ప్రియా సేథ్ అనే సినిమాటోగ్రఫర్‌లు హిందీ సినీ ప్రపంచంలో తమ ప్రస్థానం, ఎదుర్కొన్న ఆటుపోట్లను పుస్తకంగా తీసుకొచ్చి, ప్రస్తుతం ఉన్న ‘మీ టూ’ ఉద్యమానికి మరో రూపు ఇచ్చే ప్రయత్నం చేశారు.

ముందు మాట సూపర్
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ దీనికి రాసిన ముందుమాట చాలు ఈ పుస్తకం ఎంత ఆసక్తిగా ఉందో తెలుసుకోవడానికి. ‘‘1992లో జో జీతా వోహీ సికందర్ సినిమాకు నేను పనిచేసేప్పుడు సుమారు 75 మందికిపైగా పురుష ఉద్యోగులుండగా సెట్లో నేనొక్కతే అమ్మాయిగా కెరీర్ మొదలు పెట్టా.. నేను డైరెక్టర్‌గా 2007లో ఓం శాంతి ఓం సినిమా తీసే క్రమంలో 50శాతం మంది అమ్మాయిలను వివిధ రంగాల్లో నియమించుకున్నా..ఇందుకు కారణం వారు మహిళలు కాబట్టి వారికి ఉద్యోగం ఇవ్వాలని కాదు..వారు అత్యుత్తమ నిపుణులు కనుకనే వారికి నా సినిమాలో అవకాశం ఇచ్చా’’ అంటూ ముందుమటాలో రాసుకొచ్చిన క్రమం ఆసక్తిగా ఉంది.

image


ఢిల్లీకి చెందిన చారు ఖురానా అనే మేకప్ వుమెన్ తన పోరాటాన్ని తొలి అధ్యాయాల్లో వివరించారు. మహిళా మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్‌లను నియమించుకునేందుకు బాలీవుడ్ ఇండస్ట్రీ నిరాకరించడంపై సుప్రీంకోర్టులో పోరాటం చేసి, విజయం సాధించడం వంటి ఘట్టాలు చేంజ్ మేకర్స్‌లో ఆసక్తికర అధ్యాయాలుగా నిలుస్తున్నాయి. గతంలోనూ బాలీవుడ్‌పై ఎన్నో పుస్తకాలు వచ్చినా ఇవన్నీ ఆథరైజ్డ్ కాకపోగా ఈ పుస్తకం మాత్రం దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులు రచించడంతో దీనికున్న ప్రామాణికత ఎక్కువ అనే అభిప్రాయం సినీ పరిశ్రమలో వ్యక్తం అవుతోంది. మొత్తానికి బాలీవుడ్ కథా కమామీషు తెలుసుకోవాలంటే ఈ తాజా పుస్తకాన్ని చదవాల్సిందే.

English Title
Lights .. camera .. estrogen
Related News