అదే స్టార్ జీవితమంటే

Shah Rukh Khan

ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదని.. అదే స్టార్ జీవితమని బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ అన్నారు. ఇటీవల పోర్బ్ విడుదల చేసిన టాప్ రిచెస్ట్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో షారూక్ ఖాన్ 13వ నంబర్‌కు పడిపోయారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న షారూక్.. ఒక్క ఏడాదిలో 11స్థానాలు కిందికి దిగడంపై ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ట్విట్టర్లో చాలామందికి ఇష్టంగా(డియరర్) ఉన్నా.. ఫోర్బ్ సర్వేలో తక్కువగా(పూరర్) ఉన్నా.. జీరో చిత్రంతో మీ అందరికీ దగ్గరగా(నియరర్‌) ఉంటానని భావిస్తున్నా. డియరర్, పూరర్, నియరర్ ఇవన్నీ ఒక్క రోజులోనే జరగొచ్చు. అదే స్టార్ జీవితం అంటే’’ అంటూ షారూక్ చెప్పుకొచ్చాడు. 

కాగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో షారూక్ ‘జీరో’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో షారూక్ ఖాన్ మరుగుజ్జు పాత్రలో నటించగా.. కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా కనిపించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వార్తలు