'జై సింహా' ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

Updated By ManamSat, 01/13/2018 - 14:55
jai

jai simhaబాల‌కృష్ణ, న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం 'జై సింహా'. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా నిన్న (శుక్ర‌వారం) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..  తొలి రోజు మంచి క‌లెక్ష‌న్స్‌నే రాబ‌ట్టుకుంది.  తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రూ.6.75 కోట్ల షేర్ రాగా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.7.8 కోట్ల షేర్ వ‌చ్చింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ రూ.27 కోట్లు. కాబ‌ట్టి.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. మ‌రి.. సంక్రాంతి సీజ‌న్‌ని 'జై సింహా' ఎంత‌వ‌ర‌కు వ‌సూళ్ళ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటుందో చూడాలి.

English Title
'jai simha' first day collections
Related News