పార్టీ పెట్టింది ప్రజల కోసం, కేసీఆర్ కోసం కాదు

Updated By ManamFri, 08/10/2018 - 15:31
Kodandaram

Kodandaramహైదరాబాద్: తాను జనం కోసం పార్టీ పెట్టాను కానీ కేసీఆర్ కోసం కాదని తెలంగాణ జన సమితి పార్టీ అధినేత, జేఏసీ నేత కోదండరామ్ అన్నారు. తక్షణ రాజకీయ అవసరాల కోసమే టీఆర్‌ఎస్ పనిచేస్తోందని కోదండరామ్ పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేసేలా ఉద్యమం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలు కోరుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కోదండరామ్ వెల్లడించారు.

English Title
I Kept party for people not for KCR
Related News