'జీఎస్టీ-2'కు నేను రెడీ

Updated By ManamWed, 01/31/2018 - 08:43
Ram Gopal Varma

Varmaఎన్నో వివాదాల మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'జీఎస్టీ' నెట్టింట దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమా సీక్వెల్ ఆలోచనలో రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్‌లో నటించేందుకు తాను రెడీ అని స్టేట్‌మెంట్ ఇచ్చింది అలనాటి శృంగార తార షకీల. తనతో వర్మ జీఎస్టీ2 తీస్తానంటే నటించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షకీల.. రామ్ గోపాల్ వర్మ అంతటి దర్శకుడు అడిగితే చెయ్యకుండా ఎలా ఉంటాం! అయితే సినిమా కోసం సన్నబడమని వర్మ చెప్తే అందుకోసం తనకు రెండు సంవత్సరాల సమయం పడుతుందని చెప్పింది. మరి జీఎస్టీ సీక్వెల్‌పై వర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

English Title
I am ready for GST-2
Related News