సామాజిక న్యాయం కోసమే...: మోదీ

Hope Rajya Sabha Respects Public Opinion, Clears Quota Bill: PM Modi

ముంబై : సామాజిక న్యాయం కోసమే అగ్రవర్ణాల్లోని పేదవారికి పది శాతం రిజర్వేషన్లు ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆయన బుధవారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడం అనేది సామాజిక న్యాయం వైపు వేసిన పెద్ద అడుగు అని అభివర్ణించారు. ఈబీసీ బిల్లు రాజ్యసభలో పాసవుతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాని సభ గౌరవిస్తుందని ప్రధాని నమ్మకం వ్యక్తం చేశారు.

కాగా రాజ్యసభలో ఇవాళ ఈబీసీ బిల్లుపై చర్చ జరుగుతోంది.  రాజ్యాంగ సవరణ ద్వారా బిల్లు ఆమోదం పొందడానికి రాష్ట్రాల అవసరం లేదని బీజేపీ పేర్కొంది. అంతకు ముందు బిల్లుపై చర్చ సందర్భంగా విపక్షాల నిరసనలు, ఆందోళనలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సమావేశాలు మధ్యాహ్నం రెండు గంటల వరకూ వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం సభలో ఈబీసీ బిల్లుపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు అగ్రకులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన(ఈబీసీ) వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్‌సభ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు