ఉత్తరాంధ్ర విద్యార్థుల  గుండె చప్పుడు

Updated By ManamMon, 10/08/2018 - 00:01
malleswari

malleswariనాలుగైదు దశాబ్దాల కిందట తెలుగునాట గోడపత్రికలు చేసిన సాహిత్యకృషి చాలా గొప్పది. అనేక ఉద్యమాలు గోడల మీద నినాదాలుగా ఊపిరిపోసుకున్న కాలం మన కళ్ళముందు నుంచి ఇంకా చెరిగిపోలేదు. కుడ్యపత్రికలకి వ్యాపార దృక్పథం ఉండదు. అనేక ప్రయోగాలతో సాహిత్యపు రూపురేఖలను ఆధునికం చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. అంతర్జాలపు మాజిక్‌ని స్వీకరిస్తూనే చేతిరాతతో పత్రికలను ప్రచురించడం, నలుగురు చదివే వేదికగా నిర్దేశించుకున్న గోడలపై అతికించడం వంటివి, పాత ప్రయోగమే అయినా కొత్త సందర్భంలో ‘గోస్తనీ’గా మొదలయింది. పోటీపరీక్షలు, తరగతి చదువులే ముఖ్యమైన విద్యావ్యవస్థలో ఏయు తెలుగుశాఖ విద్యార్థులు ప్రారంభించిన గోస్తనీ గోడపత్రిక తొలి ఏడాదిని దాటింది. ఈ సందర్భంగా సాహితీవేత్తలు, విద్యార్థులు, పరిశోధకుల అభిప్రాయాలు, ‘మనం’ పాఠకుల కోసం...
 కె. ఎన్. మల్లీశ్వరి 

వెలుగు ప్రసరించగల అద్భుత దీపం 
vimala‘గోస్తని’ సాహిత్య కుడ్యపత్రికను తీసుకు వ స్తున్న విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాప కులకు అభినందనలు. అ లా గోడలపై అలంకరించి న మీ పత్రికను చూస్తుం టే, నాకు నా కాలేజీ రోజులు గుర్తుకు వచ్చాయి. విద్యార్థినులు రాసిన చిన్నచిన్న కథలు, కవిత్వం తో పాటు, ప్రముఖ రచయితల సాహిత్యాన్ని కూ డా మా పత్రిక ద్వారా పరిచయం చేసేవాళ్లం ఆ రోజులలో. రచయితలను మా కాలేజికి ఆహ్వా నించి, వారు రాసిన సాహిత్యం గురించి తెలుసు కునే వాళ్లం. అప్పుడు అంతగా అర్థం కాలేదు కా నీ, మేము మాకు తెలీకుండానే మా జీవితాల్లోకి వెలుగు ప్రసరిం చగల ఒక అద్భుతదీపాన్ని అప్పు డు వెలిగించామన్న సంగతి, మేము పెద్దవాళ్లం అవుతున్న కొద్దీ ఆ విషయం మరింత బాగా స్ప ష్టమైంది. వేయి ఆలోచనలు సంఘర్షిస్తే ఒక వా క్యం పుడుతుంది. మనం పోగేసుకున్న అక్షరాలన్నీ చివరికి ఒక రూపం తీసుకొని ఒక కవితగానో, కథగానో, పాటలానో తయారయ్యాక, రాసేప్పు డు  మనం పడిన వేదనో, కష్టమో దూరమై, మనసు దూదిపింజంలా తేలిపోతుంది, అలాంటి అనుభవం మీకెన్నడైనా కలిగిందా? అయితే రా యడంలో ఉన్న ఆనందం, బాధా మీకు అర్థమై నట్లే. రాయడం కష్టమన్న మాటని నమ్మకండెన్న డూ. రాయడం రచయితలుగా పేరు తెచ్చుకు నేందుకో, ఇతరులు చదవడం కోసమో మాత్రమే కాదు. మన కోసం కూడా మనం రాసుకోవచ్చు. మన అంతరంగాన్ని, దాని గందరగోళాన్ని అర్థం చేసుకోవడానికన్నమాట. మంచి పుస్తకాలు చదవ డం, రాసేందుకు ప్రయత్నించడం, మిత్రులతో చర్చించడం మన జీవన ప్రయాణాన్ని సుగమం చేస్తాయి. అంచేత ఈ పనుల్ని ఆపకండి. మీ పత్రిక, మీ సాహిత్య అభిరుచి అవిచ్ఛిన్నంగా కొ నసాగాలని కోరుకుంటున్నాను.
- విమల
సాహితీవేత్త, ఉద్యమకారిణి 
 

సమాజంలో సాహిత్యం బతికుందా?
ఏ సమాజానికైనా మార్పు అనివార్యం. మారనని ముడుచుకు కూర్చుంటే వె నక బడిపోతాం. మారుతూ పోతుంటే ముందుకు వెళ్ళి పోతామా? అనేది ఈ రోజుల్లో మిలినియర్ ప్రశ్న. ప్రపంచీకరణ గొడుగు కిం ద అందరూ ఆదమరచి నిద్రపోతున్నారు. ఆ గొడుగుకున్న చిల్లులు గుర్తిం చే ఏకైక పరికరం ఆధునిక సాహిత్యం. ఫేస్ బుక్కు, వాట్సప్, ట్వీట్టర్, మాధ్యమం ఏదైనా కావొచ్చు, కథ, కవిత్వం, నవల ప్రక్రియ ఏదైనా కావొచ్చు, మానసిక సంచలనాలను, సామాజిక రుగ్మతలను, అక్షరబద్ధం చేసేవారిలో యువ సాహిత్యకారులు, పరిశోధకులు కూడా ఉన్నారు. అలాంటి ఆలోచనలకి  ‘గోస్తని గోడపత్రిక’ వేదిక కావడం ఆనందం. విద్యార్థుల్లో సృజనాత్మక ఆలో చనలు రేకెత్తడానికి, సాహిత్యాభిలాష పెరగడానికి యూనివర్సిటీ స్థాయిలో ఇలాంటి పత్రికలు చాలా అవసరం. ఇలాంటి ఆలోచన చేసిన ఎవ్వరైనా ప్రశంసనీయులే. కె.ఎన్.మల్లీశ్వరి తొలిగా ఈ ఆ లోచన నాతో పంచుకున్నప్పుడు చాలా సంతో షించాను. వెంటనే ఆమె సలహా మీద ‘యాపిల్ తినేవాడు కాదు కావల్సింది’ అంటూ సాహిత్య వస్తు వైవిధ్యాన్ని తెలియజేస్తూ వ్యాసం రాసి చ్చా ను. అలాగే మరో గోస్తని సంచికలో ‘ఆచార్య జయదేవ్‌తో జగడం’ అనే వ్యాసం ఆయన రాసి న పుస్తకాన్ని విశ్లేషిస్తూ రాశాను. అలా కొన్ని కవి తలు కూడా గోస్తనీలో ప్రచురించబడ్డాయి. దీని వల్ల మాకు ఆచార్యుల నుంచి అనేక సలహాలు సూచనలు వచ్చేవి. ఇలాంటి ఆరోగ్యకరమైన వా తావరణంలో రాయడం మొదలుపెట్టిన విద్యార్థు లు గవర్నమెంట్ కొలువు కోసం చూడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో జర్నలిస్టులుగా, కవులుగా, సినీ రచయితలుగా, వాళ్ళ జీవితాల్ని బహు ముఖ కోణాల్లో ఆవిష్కరించుకుంటానికి అవకా శాలు యూనివర్సిటీ దశలోనే పడడం అనేది చా లా మంచి పరిణామం. యువతలో సాహిత్యా భిలాష తగ్గుముఖం పడుతున్న దశలో ఇలాంటి గోడ పత్రికలు వాళ్ళల్లో తిరిగి పుస్తక పఠనం వైపునకు, సృజనాత్మకత వైపునకు ఆసక్తి కలిగేలా పెరిగేలా సహాయపడతాయి. ఇలాంటి పత్రికల వల్ల సమాజంలో పఠనాసక్తి పెరిగి సాహిత్యం సమాజంలో బతికే ఉంటుంది.
- ప్రవీణ్ యజ్జల. 
పరిశోధక విద్యార్థి, ఏయు
 

ఆశావహ కరదీపికలు 
నేడు చదువులంటే గైడులు, క్వశ్చన్ బాంకుల చదువులే. చదివిందే చదవడం, బట్టీపట్టడం, ముక్కు న పట్టి, పరీక్షల్లో వదిలేయ డం. సొంతంగా ఊహించ డం, భావనామయ ప్రపం చంలో రెక్కలు కట్టుకుని విహరించడం నేటి విద్యా ర్థుల్లో అరుదు. ఇలాంటి సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగుశాఖ విద్యార్థులు, కథలై, కవితలై గోస్తనీ గోడపత్రికని ఏడాది పాటు అవిచ్ఛిన్నంగా నిర్వహించడం చాలా సంతోషం. ఈ సృజనాత్మకత ఇలాగే వేయి విధాల విరబూ యాలని కోరుతున్నాను. ఆధునిక సాహిత్యానికి వీరు ఆశావహ కరదీపికలుగా వెలుగొందాలని ఆశిస్తున్నాను. అభినందనలు.
- మందరపు హైమవతి 
కవయిత్రి 

కొత్తతరానికి అవకాశం
ramavathiపెద్ద పెద్ద కవులకి రచయితలకి తమ రచనల ప్రచురణకి అనేక పత్రికలు అవకాశం ఇస్తాయి. ఇప్పు డిప్పుడే రాయడం మొద లు పెట్టిన మాలాంటి వారికి గోస్తనీ పత్రిక చా లా ఉపయోగంగా ఉంది. ముఖ్యంగా ఈ పత్రికని విశ్వవిద్యాలయ సంబంధిత వ్యక్తులు చదువుతారు. అందులోనూ ఉత్తరాంధ్ర గిరిజన సమూ హాల నుంచి వచ్చినవారు కూడా రాస్తున్నారు, చదువు తున్నారు. ఒకరిని చూసి మరొకరు ప్రభావితమవుతున్నారు. అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలల భాషా సాహిత్యశాఖల్లో ఇటువంటి పత్రికలు సులువుగా నడుపుకోవచ్చు. 
- వి. రమావతి
ఏయు విద్యార్థి.
  

జూనియర్ విద్యార్థిగా తరగతిలోకి అడుగుపెట్టిన పుడు గోస్తనీ గురించి తెలి సింది. అందరి ఉత్సాహం చూసి నేనూ చదవడం రా యడం మొదలు పెట్టాలను కున్నాను. ఎనిమిదవ సంచి కలో నా తొలికవిత ప్రచు రించుకున్నాను. నిర్వహణ బాధ్యతలు కూడా తీసుకున్నాను. చాలా మంచి విషయాలు తెలుసుకోగలను అని ఆశ కలుగుతోంది. 
- ఎం. వినుత 
ఏయు తెలుగు విద్యార్థి  

Tags
English Title
The heart of the northern students
Related News