ఫైనల్‌కు చేరుకోవడమే లక్ష్యం

Updated By ManamFri, 08/10/2018 - 00:18
Deepa Carmaker
  • ఆసియా గేమ్స్‌పై మహిళా జిమ్నాస్ట్ దీపా కోచ్ నంది

Dipa-Karmakarకోల్‌కతా: భారత జిమ్నాస్టిక్స్ గోల్డెన్ గర్ల్ దీపా కర్మాకర్‌ను ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది ఓ ఖచ్చితమైన లక్ష్యంతో ఆసియా గేమ్స్‌కు సిద్ధం చేస్తున్నారు. ఈ గేమ్స్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఆమె ఫైనల్‌కు చేరుకోవడమే తమ తొలి లక్ష్యమని అన్నారు. ‘ముందుగానే ఆమె పతకం గురించి ఆలోచించడం నాకు ఇష్టం లేదు. అసలే ఆమె గాయం నుంచి కోలుకుని ఈ గేమ్స్‌లో పాల్గొనబోతోంది. పతకం గెలవడమనేది అంత సులువేమీ కాదు. ఫైనల్స్‌కు చేరుకోవడం గురించి మాత్రమే ఆమెకు నేర్పుతున్నాను. అదే ఆమె తొలి లక్ష్యం. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్ కప్‌లో దీప స్వర్ణం గెలిచిన కారణాన ఇప్పుడు ఆమెపై అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయని నాకు తెలుసు. కానీ అది ఆమెపై అదనపు ఒత్తిడి తెస్తుంది. ఇది కాదనలేని విషయం. ఒత్తిడి నా మీద, ఆమె మీద, అభిమానుల మీద కూడా ఉంటుంది. ఆమె ఏ టోర్నీలో పాల్గొన్నా పతకం గెలవాలని అందరూ ఆశిస్తారు. కానీ ఆసియా గేమ్స్‌లో మరో ఒలింపిక్స్ లాంటిది. ఎందుకంటే ఈ టోర్నీలో చైనా, జపాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఉజ్బెకిస్థాన్‌ల అథ్లెట్లు పాల్గొంటారు. ఈ దేశాల నుంచి ఉత్తమ అథ్లెట్లు పాల్గొంటారు కాబట్టి గట్టి పోటీ ఉంటుంది. కనుక ఆసియా గేమ్స్‌లో ఆమె ఉత్తమ ప్రతిభ కనబరచాలని కోచింగ్ ఇస్తున్నాను. పతకం గెలిచేందుకు లభించే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టము’ అని నంది చెప్పారు.sÁasÁa

English Title
The goal is to reach the final
Related News