దేశవ్యాప్తంగా స్తంభించిన రవాణా

strikess
  • ఎక్కడికక్కడే నిలిచిన సరకు, ప్రజా రవాణా

  • కేరళ, బెంగాల్ తీవ్రం.. బస్సులు, రైళ్లు బంద్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా 48 గంటల సమ్మెలో భాగంగా మంగళవారం తొలిరోజు రవాణా సమ్మె విజయవంతమైంది. కొన్ని రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం తీవ్రంగా ఉండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపించింది. కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశాలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నాయని కార్మిక సంఘాలు తెలిపాయి. సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సమ్మెకు కార్మిక, ఉద్యోగ, రైతు సంఘాలు మద్దతు ప్రక టించడంతో దేశవ్యాప్తంగా ర్యాలీ, రాస్తారోకోలు, ధర్నాలు జరిగాయి. చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి. సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు భారీ ఎత్తున నిరసన ర్యాలీలు జరిపాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎఐటియుసి, సిఐటియు, ఐఎఫ్‌టియు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆరీ ్టసీ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించాయి. దేశ రాజధాని ఢిల్లీలో నూ ఆందోళనలు మిన్నంటాయి. కార్మిక సంఘాల ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయి. పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేరళలో కార్మిక సంఘాలు రోడ్డెక్కడంతో ప్రజాజీవనం స్తంభించింది. ఒడిశాలోనూ రవాణా వ్యవస్థ స్తంభించింది.
 

Tags

సంబంధిత వార్తలు