చంద్రబాబు ‘యూటర్న్’పై ఢిల్లీలో చర్చ!

Updated By ManamWed, 06/13/2018 - 19:39
Kanna lakshmi narayana comments on chandrababu naidu over u turn

Kanna lakshmi narayana comments on chandrababu naidu over u turn

న్యూ ఢిల్లీ: ఎన్టీఏ నుంచి టీడీపీ వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ బీజేపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అంతేకాదు ఈ ఇరుపార్టీల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పందించారే తప్ప.. ప్రధాని మోదీ మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే తాజాగా.. ప్రధానితో.. ఏపీ బీజేపీ జాతీయాధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించడం జరిగింది. రెండ్రోజులుగా పాటు ఢిల్లీలో తిష్టవేసిన కన్నా.. వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ భేటీలకు సంబంధించి అన్ని విషయాలు చెప్పుకొచ్చారు. 

" ఏపీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉన్నామని ప్రధాని మోదీ నాకు చెప్పారు. మమ్మల్ని ఎందుకు దోషిగా చూపిస్తున్నారు..? చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? అని ప్రధాని నన్ను అడిగారు. అనేక అభివృద్ధి అంశాలు ఈ బేటీలో చర్చకు వచ్చాయి. విభజన హామీల అమలుకు కేంద్రం సర్వాత్రా కృషి చేస్తోంది. కేంద్రం అన్ని విధాలా ఏపీకి సాయం చేస్తున్నా.. ఏమీ చేయడం లేదని పనిగట్టుకుని మరీ దుష్ప్రచారం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తనను నమ్మినవారిని వెన్నుపోటు పొడవటం సహజగుణం. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే చంద్రబాబుకే ఎక్కువగా ప్రాధన్యత ఇచ్చామని కేంద్రం పెద్దలు నాతో చెప్పారు. ఇందుకు బదులుగా నమ్మిన వాళ్లను మోసం చేయడం చంద్రబాబు నైజమని చెప్పాను" అని కన్నా మీడియాకు వివరించారు.

సన్మానాలు చేసింది మీరు కాదా...?
"
రైల్వేజోన్, స్టీల్‌ప్లాంట్ సహా ఏ విషయంలో ఏదీ చేయబోమని కేంద్రం చెప్పలేదు. ఏ రాష్ట్రానికి చేయనన్ని పనులు ఏపీకి చేశాం. 2017-18లో రూ. 1.26 వేల కోట్లు కేటాయించింది. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నా ఏపీకి కేంద్రం సాయం మాత్రం ఆగలేదు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే.. ఏమీ చేయలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని పార్టీలు కేంద్రాన్ని దోషిగా నిలబెడుతున్నాయి. ఏడాదికి వెయ్యి కోట్లకన్నా ఎక్కువ డ్రా చేసుకోలేమని కేంద్రం రాష్ట్రం చెప్పింది. దీంతోనే స్పెషల్ ప్యాకేజీ రూపొందింది. దీని వల్ల 16,500 కోట్లు పొందే అవకాశముంది.

ప్యాకేజీ బాగుందని కేంద్రంపై అప్పుడు పొగడ్తల వర్షం కురిపించిన చంద్రబాబు ఇప్పుడెందుకిలా చేస్తున్నారు..?. ప్యాకేజీకి ఒప్పుకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేయలేదా..? ప్యాకేజీకి సహకరించిన వెంకయ్యకు సన్మానాలు చేయలేదా..? అబద్దాలు ఆడుతోంది మీరా.. మేమా..?. ఏపీకి కేంద్రం చేస్తున్న సాయంపై మా ప్రణాళికను మోదీకి వివరించాం. హోదాపై రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప.. మరొకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రజలను ద్రోహం చేస్తోంది. రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో ఏదీ కేంద్రం కాదనలేదు" అని ఈ సందర్భంగా కన్నా తేల్చి చెప్పారు.

Kanna lakshmi narayana comments on chandrababu naidu over u turn

English Title
Discussion on Chandrababu U turn | PM Modi And Kanna Laxmi narayana Meeting
Related News