మనసులో మాట బయటపెట్టిన సౌమ్యారెడ్డి

Updated By ManamThu, 06/14/2018 - 12:14
సౌమ్యారెడ్డి
  • మంత్రి పదవి ఇచ్చినా తీసుకోను..నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యం

బెంగళూరు: భారతీయ జనతా పార్టీకి షాక్ ఇచ్చి జయనగర ఎన్నికలో గెలుపొందిన ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి ...మంత్రి పదవిపై తన మనసులోని మాటను బయటపెట్టారు. నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమన్న ఆమె మంత్రి పదవి ఇచ్చినా తీసుకునేది లేదని స్పష్టం చేశారు. సమాజ సేవ చేయడం వల్లే తన గెలుపు సాధ్యమైందని సౌమ్యారెడ్డి తెలిపారు. జయనగర నియోజకవర్గ ప్రజలు తన వారి బిడ్డగా అక్కున చేర్చుకున్నారంటూ కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర ఉత్కంఠభరితంగా సాగిన జయనగర ఎన్నికలో సౌమ్యారెడ్డి తన సమీప బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్ బాబు పై 2,889 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందిన విషయం తెలిసిందే.

బీజేపీ కంచుకోటగా ఉన్న బెంగళూరు జయనగర అసెంబ్లీ ఎన్నికలో విజయం సాధించిన సౌమ్యారెడ్డి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. కర్ణాటక మాజీ హోంమంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్య. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించి బెంగళూరు వచ్చిన ఆమె అనంతరం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సామాజిక సేవ చేపట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ నగర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు.

English Title
Congress MLA Sowmya Reddy to focus on Development of Constituency
Related News