'భయ్యూజీ మృతిపై సీబీఐ దర్యాప్తు జరపాలి'

Updated By ManamTue, 06/12/2018 - 20:10
Congress, MP government for Bhaiyyuji Maharaj's death, demands CBI probe

Congress, MP government for Bhaiyyuji Maharaj's death, demands CBI probeభోపాల్: ఆధ్యాత్మిక గురువు భయ్యూజీ మహారాజ్ మంగళవారం అనుమానాస్పద స్థితిలో తన నివాసంలో తుపాకీతో కాల్చుకొని మృతిచెందారు. ఈ నేపథ్యంలో ఆయన మృతిపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మహారాజ్ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన కారణాలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. భయ్యూజీ ఆత్మహత్య చేసుకున్న స్థలం వద్ద ఓ సూసైట్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఐజీ హరినారాయణ మిశ్రా వెల్లడించారు. ఆ సూసైట్ నోట్‌లో తాను మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు మహరాజ్  పేర్కొన్నారని, అయితే ఆ మానసిక ఒత్తిడికి కారణం ఏమిటో తెలియాల్సి ఉందని, విచారణ జరుపుతున్నామన్నారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ, మహరాజ్‌పై మధ్యప్రదేశ్ ప్రభుత్వమే ఒత్తిడి తీసుకువచ్చినట్టు ఆరోపించింది. 'మేమిచ్చింది నువ్వు తీసుకుని ప్రభుత్వానికి మద్దతిమ్మని ఆయనపై ప్రభుత్వం ఒత్తిడి చేసింది. అందుకు మహరాజ్ నిరాకరించారు' అని కాంగ్రెస్ మానక్ అగర్వాల్ ఆరోపించారు. కాగా, భయ్యూజీ మహారాజ్ తన నివాసంలో తుపాకీతో కుడివైపు తలపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే ఆయన్ను బాంబే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మహారాజ్ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. 

English Title
Congress blames MP government for Bhaiyyuji Maharaj's death, demands CBI probe
Related News