మహేశ్‌కు యాక్టింగ్ రాదన్న కమెడియన్.. ఫ్యాన్స్ ఫైర్

Updated By ManamFri, 09/14/2018 - 14:39
Mahesh Babu

Mahesh Babuటాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో తెలుగులోనే కాకుండా మిగిలిన భాషలలో కూడా అభిమానులను సంపాదించుకొని సౌత్ ఇండస్ట్రీలోనే పేరొందిన నటుడిగా చలామణి అవుతున్నాడు. ఎన్నో రికార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. అంతేకాదు అత్యధిక పారితోషికం విషయంలోనూ మహేశ్ బాబు టాప్‌లోనే ఉన్నాడు. మరోవైపు ఆయనతో సినిమా తీసేందుకు ఓ వైపు దర్శకులు, మరోవైపు నిర్మాతలు క్యూలో ఉంటారు. అయితే అలాంటి మహేశ్ బాబుపై ఓ తమిళ కమెడియన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో మహేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ కామెడీ షోలో పాల్గొన్న మనోజ్ ప్రభాకర్ అనే అప్‌కమింగ్ కమెడియన్ మాట్లాడుతూ.. మహేశ్‌కు నటన రాదని, అతడి మొహంలో ఏ హావభావాలు ఉండవని అన్నాడు. అంతటితో ఆగకుండా కత్రినా కైఫ్‌కు మేల్ వెర్షన్‌ మహేశ్ బాబు అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడిపై మహేశ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్‌ లాంటి స్టార్‌పై కామెంట్ చేసే అర్హత అతడికి లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

English Title
Comedian comments on Mahesh Babu acting
Related News