బ్రూచ్ ఫ్యాషన్

Updated By ManamSat, 05/26/2018 - 22:29
image

image

జడ వేసుకోవడం, బుచ్చెడ కట్టుకోవడం, పాపిడి తీసుకోవడం, పూలు పెట్టుకోవడం..ఏమిటిదంతా పాతకాలం పద్ధతులు అనుకుంటున్నారేమో.. అస్సలు కాదండి.. ఇవి నయా ఫ్యాషన్స్.  ఇంటర్నెట్‌లో అమ్మాయిల మనసు దోచుకుంటున్న లేటెస్ట్ ట్రెండ్స్ కూడానూ!  వీటిని బ్రూచ్‌లు అంటారు.. అంతే తేడా. కాకపోతే ఇవి నాచురల్‌వి మాత్రం కావు... వివిధ రకాల డిజైనర్ క్లాత్, పూసలు ఇతరత్రా మెటీరియల్‌తో వీటిని సహజంగా ఉండేలా జీవం ఉట్టిపడేలా కళాత్మకంగా తయారు చేస్తారు.  మీకు నచ్చిన హెయిర్‌స్టైల్‌లో ఈ బ్రూచ్‌లను అందంగా అమర్చడంతో మీరు మరింత స్టైలిష్‌గా కనిపిస్తారు. 

ధర ఎక్కువే
ఇవేవో చవకగా దొరుకుతాయని మాత్రం భావించకండి.. సాధారణంగా వీటిని చేత్తోనే చేస్తారు కనుక వీటి ధరలు చాలా ఎక్కువ, వందల్లో మొదలై.. వేలల్లో కూడా ఉంటున్నాయి.  ఫ్యాన్సీ స్టోర్లలో అందుబాటులో ఉన్నప్పటికీ ఆన్‌లైన్లో మాత్రం పెద్ద ఎత్తున వెరైటీలు లభిస్తున్నాయి. హెయిర్ బ్రూచ్‌ల పేరుతో హాట్ ట్రెండ్‌గా మారిన ఈ హెయిర్ యాక్సెసరీని ఇప్పుడు సెలబ్రిటీలు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.  పార్టీలకు, ఫంక్షన్లకు ఈ ఫ్లోరల్ బ్రూచ్‌లతో వెళితే తళుక్కుమనడం ఖాయం.  వెస్ట్రన్, ఇండియన్ ఫిట్టింగ్స్‌తో పాటు ఫ్యూజన్ వస్త్రాలకు కూడా ఇవి నప్పుతాయి కనకు ఒక్కసారి కొంటే ఇక జీవితకాలం పాటు ఇవి మీతోనే పదిలంగా ఉంటాయి.  గులాబీలు, మల్లెలు, డేరాలు, తీగలతోపాటు ఎన్నో వెరైటీల్లో, రంగుల్లో డిజైనర్లు తయారుచేస్తున్నారు. తీగల్లా ఉన్న బ్రూచ్‌లను కొంటే వీటిని జడలకు, కొప్పులకు కూడా స్టైలిష్‌గా అమర్చేలా పనికొస్తుంది. వీటిని ఎప్పటికప్పుడు సర్ఫ్ నీటిలో ఉతకి పదేపదే పిల్లా, పెద్దా అంతా వాడవచ్చు కనుక వీటికి డిమాండ్ కూడా పెరుగుతోంది.

English Title
bruch fasion
Related News