‘రైతు బంధు’తెచ్చిన తంట.. కత్తితో దాడి!

Updated By ManamWed, 06/13/2018 - 15:51
Brothers fight Over Rythu Bandhu In Mancherial

‘రైతు బంధు’తెచ్చిన తంట.. కత్తితో దాడి!

మంచిర్యాల: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంచిర్యాలలో దారుణ ఘటన చోటుచేసుకోవడంతో ప్రజలంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు. గత కొద్దిరోజులుగా లక్ష్మణ్ రెడ్డి(తమ్ముడు), బాబురెడ్డి(అన్న) అన్నదమ్ముల మధ్య భూమి విషయంలో తగాదాలు జరుగుతున్నాయి. మధ్య భూ తగాదాలు భగ్గుమన్నాయి. అన్నదమ్ములిద్దరూ భూ తగాదా విషయమై తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరగడంతో అదికాస్త గొడవకు దారితీసింది. ఇద్దరూ ఒకరిపై కారం పొడి చల్లుకొని కలబడ్డారు.

దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన అన్న... కొబ్బరి బోండాలు నరికే కత్తి తీసుకుని తమ్ముడిపై అందరూ చూస్తుండగానే దాడికి తెగబడ్డాడు. దీంతో ఆఫీసులో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొన్నది. ఆఫీసు సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీశారు. ఈ ఘటనలో గాయపడ్డ తమ్ముడిని అత్యవసర చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. 

కాగా.. దాడులు జరిగే అవకాశముందని ముందే గ్రహించిన అన్న తన బ్యాగులో కత్తి తెచ్చుకున్నాడు. ముందుగా కారంపొడి చల్లుకున్న అన్నదమ్ములు.. అనంతరం కత్తితో తమ్ముడిపై దాడికి దిగాడు. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావమైంది. తమ్ముడు లక్ష్మారెడ్డి పేరుతో 30 ఎకరాల భూమి ఉంది.. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు బంధు’ విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. గతంలో లక్ష్మారెడ్డి పేరిట తండ్రి ఈ 30 ఎకరాల భూమి రాసిచ్చినట్లుగా రికార్డుల్లో ఉంది. ఈ విషయమై అన్నదమ్ములిద్దరూ తహసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. బాబురెడ్డి గత కొద్ది లక్ష్మారెడ్డి లెక్చరర్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరు కరీంనగర్‌లో, మరొకరు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

English Title
Brothers fight Over Rythu Bandhu In Mancherial
Related News