టూర్లకు భార్యలు, గాళ్‌ఫ్రెండ్స్!

Updated By ManamWed, 10/17/2018 - 14:54
BCCI likely to accept Kohli request
  • కోహ్లీ విజ్ఞప్తికి బీసీసీఐ సుముఖత..

  • విదేశీ టూర్లకు భార్యలు, గాళ్‌ఫ్రెండ్స్‌కు అనుమతి!

BCCI likely to accept Kohli request

ముంబై : విదేశీ టూర్లకు వెళ్లే క్రికెట్లరు ఇక నుంచి తమతో పాటు భార్యాలను, గాళ్‌ఫ్రెండ్స్‌ను తీసుకు వెళ్లవచ్చు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విజ్ఞప్తికి బీసీసీఐ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బీసీసీఐ నుంచి అధికారకంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా క్రికెటర్లు విదేశీ టూర్లకు తమ వెంట భార్యలు, గాళ్‌ఫ్రెండ్స్‌ను తీసుకువెళ్లడం పరిపాటే. 

గతంలో  క్రికెటర్ల వెంట భార్యలు, ప్రియురాళ్లు ఉండటంతో వారు ఆటపై దృష్టి పెట్టలేక పోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బీసీసీఐ నిబంధనలు విధించింది. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఆటగాళ్ల వైఫల్యాలకు వారి కుటుంబ సభ్యులే కారణమంటూ విమర్శలు వచ్చాయి. దీంతో విదేశీ పర్యటనల్లో క్రికెటర్ల వెంట భార్యలు, ప్రియురాళ్లు కేవలం రెండు వారాలే ఉండాలని బీసీసీఐ షరతు విధించింది. అయితే ఈ నిబంధన వల్ల తమ కుటుంబాలకు నెలలు తరబడి దూరంగా ఉండాల్సి వస్తుందని, డిప్రెషన్‌కు లోనవుతున్నామని, టూర్ మొత్తం భార్యలను అనుమతించాలంటూ కోహ్లీ ఈ సందర్భంగా బీసీసీఐని కోరాడు. 

ఈ అంశంపై ఇటీవల బోర్డు మీటింగ్‌లో కూడా చర్చ జరిగింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో జట్టు సభ్యులు ఆటతీరుపై సమీక్ష జరిపినట్లు తెలుస్తోంది. టీమిండియా జట్టు వరుస పెట్టి విదేశీ టూర్లకు వెళ్లనున్న నేపథ్యంలో సుమారు 45 రోజుల పాటు ఆటగాళ్లు తమ భార్యలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుత  నిబంధనను మార్చి టూర్‌ పూర్తయ్యేవరకూ ...వారు తమతోపాటే ఉండేలా నిబంధనలు మార్చాలంటూ కోహ్లీ బీసీసీఐను అభ్యర్థించారు. 

English Title
BCCI likely to accept Kohli request
Related News