భారత్‌తో తలపడే ఆసీస్ జట్టిదే

Updated By ManamFri, 11/09/2018 - 02:48
Australia
  • మిచెల్ స్టార్క్ దూరం

  • 21 నుంచి టీ20 సిరీస్

ausisసిడ్నీ: ఈ నెల 21 నుంచి భారత్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆరోన్ పింఛ్ సారథ్యంలో 13మంది సభ్యులతో కూడిన జట్టును గురువారం ప్రకటించింది. భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు, ఈ నెల 17న దక్షిణాఫ్రికాతో జరగనున్న ఏకైక టీ20కి కూడా ఇదే జట్టుని ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది. ఈ జట్టులో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, స్పిన్నర్ నాథన్ లియోన్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, వెటరన్ పేస్ బౌలర్ పీటర్ సిడిల్‌కు చోటు కల్పించలేదు. పొట్టి ఫార్మాట్ అనంతరం భారత్‌తో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలోనే ఆ నలుగురికి టీ20 జట్టులో స్థానం కల్పించలేదని కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. ఆ నలుగురు ఆసీస్ జట్టులో అన్ని రకాల ఫార్మాట్‌లు ఆడేందుకు అర్హులే. కానీ దీని తర్వాత భారత్‌తో కఠిన టెస్టు సిరీస్ ఉన్న నేపథ్యంలో వారి విషయంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన తెలిపాడు. తాజాగా ప్రకటించిన జట్టులో పేస్ బౌలర్ జోసన్ బెహ్రాన్‌డార్ఫ్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. పేస్ బౌలింగ్ విభాగంలో అతనితో పాటు నాథన్ కౌల్టర్-నైల్, బిల్లే స్టాన్‌లేక్, ఆండ్రూ టై బంతిని పంచుకోనున్నారు. భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, కుల్‌దీప్ యాదవ్, చాహల్, వాషింగ్టన్ సుందర్, క్రునాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఖలీల్ అహ్మద్.ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఆలెక్స్ కారే(వైస్ కెప్టెన్), అష్టన్ అగర్, జోసన్ బెహ్రన్‌డార్ఫ్, నాథన్ కౌల్టర్-నైల్, క్రిస్ లియన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ మెక్‌డర్మోట్, డీఆర్చీ షార్ట్, బిల్లే స్టాన్‌లేక్, మార్కస్ స్టోయినిస్, ఆండ్రూ టై, ఆదామ్ జంపా.

Tags
English Title
Aussie match against India
Related News