అర్జున్‌రెడ్డితో నటించాలనుకుంటున్నారా..?

Updated By ManamThu, 06/14/2018 - 08:32
vijay

dear టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో నటించాలని ఉందా..? అయితే ఈ అవకాశం మీ కోసం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విజయ్ దేవరకొండ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వం వహించే ఈ చిత్రానికి డియర్ కామ్రేట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా త్వరలో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుండగా ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది.

అందులో భాగంగా ఆడిషన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17 తేదీలలో కాకినాడలో ఆడిషన్స్‌ జరగనున్నాయి. ఈ సందర్భంగా అన్ని వయసుల వారికి ఆహ్వానం పలుకుతూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. మున్సిపల్ ఆఫీస్ వెనుక ఉన్న గాంధీ భవన్‌లో ఈ ఆడిషన్స్ ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనున్నట్లు అందులో తెలిపారు. అయితే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వారికే ఆ అవకాశం ఉన్నట్లు తెలిపింది.

English Title
Audition call for Vijay Devarakonda
Related News