క్షీణించిన వాజ్‌పేయి ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు మోదీ..

Updated By ManamWed, 08/15/2018 - 19:44
Atal Bihari Vajpayee, health is in crticle, PM, Narendra modi, AIMS
  • రేపు ఏపీలో జరగాల్సిన బీజేపీ కార్యాలయ శంకుస్థాపన రద్దు

  • కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్న బీజేపీ అగ్రనేతలు

Atal Bihari Vajpayee, health is in crticle, PM, Narendra modi, AIMSన్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు సమాచారం. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజలుగా ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వాజ్‌పేయి హెల్త్‌ బులెటిన్‌ను కూడా ఎయిమ్స్‌ వైద్యులు విడుదల చేసే అవకాశం ఉంది. వాజ్‌పేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉండటంతో బీజేపీ తన అధికారి కార్యక్రమాలు అన్నింటినీ వాయిదా వేసుకుంది. రేపు (గురువారం) జరగాల్సిన విజయవాడ బీజేపీ కార్యాలయ శంకుస్థాపన కూడా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం వాజ్‌పేయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎయిమ్స్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని పరామర్శించారు.

ఎయిమ్స్‌కు మోదీ..
వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆయన చికిత్స అందిస్తున్న వైద్యులను ఆరా తీశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వాజ్‌పేయిని పరామర్శించిన మోదీ.. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కాగా, మూత్ర సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాజ్‌పేయి తీవ్ర అనారోగ్యంతో జూన్‌ 12న ఎయిమ్స్‌లో చేరారు. ప్రస్తుతం వాజ్‌పేయి కిడ్నీ ఒక్కటి మాత్రమే పనిచేస్తోండగా.. డయాబెటిస్‌తోపాటు డిమెన్షియా సమస్యతో బాధపడుతున్నారు. గతకొంతకాలంగా వాజ్‌పేయి ఆరోగ్యంపై పుకార్లు వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. 

English Title
Atal Bihari Vajpayee health is in crticle, PM Narendra modi arrives to AIMS
Related News