ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

Updated By ManamSat, 07/21/2018 - 02:30
image

తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి,
విద్యుత్ కాంట్రాక్టు (ఆర్టిజాన్) కార్మికుల సమ్మె గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ కార్మికులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ప్రక్రియ కూడా మీకు తెలుసు. ఈ కార్మికులను ద్దేశించి మింట్ కాంపౌండ్లో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతూనే వాళ్ళందరి సర్వీసును క్రమబద్ధీకరిస్తామన్న సభలో నేను కూడా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడి నాలుగు సంవత్సరాలు దాటింది. ఇక ఎన్నికలకు పదినెలలు మాత్రమే మిగిలాయి. ఈ మధ్యకాలంలో గతంలో వీళ్ళు చేసిన రెండు సమ్మెల ఫలితంగా వీళ్ళని ఔట్‌సోర్సింగ్ నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుస్తూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా హర్షించాం. అదే క్రమంలో 24 గంటల విద్యుత్ సరఫరా ప్రభుత్వం సాధించగలిగింది.

 ఈ సాధనలో 23వేల మంది కాంట్రాక్టు కార్మికుల పాత్ర ఏమిటో మీకు తెలుసు. అది గుర్తించే వీళ్ళందరిని పర్మనెంట్ చేయాలనే ఒక నిర్ణయం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీరు తీసు కున్న మంచి నిర్ణయాలలో ఒక కీలకమైన నిర్ణయం. విద్యుత్ బోర్డుకు సారధ్యం వహిస్తున్న ప్రభాకర్ రావు నేతృత్వంలోని ఈ నిర్ణయపు సాధక బాధకా లను పరిశీలించి చట్టపర అడ్డంకుల గురించి పరిశీ లించాలే. ఈ 23వేల మందిని నాలుగు కేటగిరీల కింద విభజించి చాలా శాస్త్రీయంగానే వీళ్ళను క్రమ బకరిస్తూ ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. దానిని సవాలు చేస్తూ కాంట్రాక్టర్ల ప్రోద్బలంతో ఎవరో ఒక అనామకుడు కోర్టులో ప్రజావ్యాజ్యం కింద కేసు వేశాడు. కోర్టు దీనిమీద స్టే ఇచ్చిన విష యం మీకు తెలుసు. అయితే కోర్టు డైరెక్టు పేమెం టును సమర్ధించింది. అంటే కాంట్రాక్టర్ల వ్యవస్థను తిరస్కరించింది. మీరు ఇంత ప్రతిష్టగా తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో కౌంటర్ వేసి సమర్ధవంతమైన అడ్వకేటును లేదా అప్పటి అడ్వకేటు జనరల్ ద్వా రా వాదనలు వినిపించి స్టేను ఎత్తివేసే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన చేయవలసింది. ఇదంత కష్టమైన పనేం కాదు. పక్క రాష్ట్రమైన తమిళనాడు లో 30వేల మంది కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించారు. 

కోర్టు స్టే తర్వాత కౌంటర్ వేయడంలో కాని, ఈ ఉద్యోగుల క్షేమ సమాచారాలను కాని ప్రభుత్వం పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదని మేం భావిస్తున్నాం. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ సందర్భంలో మీరు ఒక ఇంక్రిమెంట్ ప్రకటించి నప్పుడు ఆ ఇంక్రిమెంటు ఈ 23వేల మందికి ఇవ్వ లేదు. ఈ 23వేల మంది పాత్ర లేకుండానే 24 గంటల విద్యుత్ సాధ్యమయ్యిందా. పర్మనెంట్ చే యాలని నిర్ణయించినప్పుడు ఇంక్రిమెంట్ ఇవ్వడా నికి ఎందుకు అంత వెనకంజో అర్థంచేసుకోవడం కొంచెం కష్టమే. ఇంక్రిమెంట్ కాని లేదా వాళ్ళకు అంగీకరించిన టైం స్కేళ్ళు ఇవ్వడానికి కోర్టుకు ఏం అభ్యంతరం ఉంటుంది.. అభ్యంతరమల్లా క్రమబద్ధీకరణమీదే. 

విద్యుత్ ఉద్యోగులు సమ్మె నోటీసు దాదాపు 40 రోజుల కిందే ఇచ్చారు. ప్రభుత్వం ఏదో సహాయం చేద్దామంటే సమ్మెకు నోటీస్ ఇవ్వడమే మిటో అని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఆ నిర్ణయాలను కోర్టులో సకాలంలో సమర్ధించుకోలేకపోతే, ఆ దిశగా ఏం చర్యలు తీసుకోకపోతే కార్మికులు ఏం చేయాలి. తెలంగాణ ప్రకటించి జాప్యం చేస్తే మనం ఉద్యమాలు చేయలేదా. ఉద్యమాలు చట ్టబద్ధం కాదు, సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటాం అని అంటే, వేరే మార్గాలేమిటో ప్రభుత్వం సూచిం చాలి. సంబంధిత అధికారులకు అర్జీలు పెట్టు కున్నారు. ఒకటి రెండు సందర్భాలలో ఎలక్ట్రిసిటీ బోర్డు అధికారిని కార్మికులు కలిసినపుడు నేను కూడా వెళ్ళాను. ఇవ్వన్నీ పాత డిమాండ్సే కదా అన్నీ పరిశీలనలో ఉన్నాయని మాత్రం సమాధానం చెప్పారు. రెండు, మూడు రోజుల క్రితం లేబర్ కమిషనర్ చర్చలకు పిలిచి ప్రతి డిమాండ్‌కు యాంత్రికంగా స్పందించారే తప్ప, పరిష్కారాలను సూచించలేదు. సమ్మె హక్కు రాజ్యాంగంలోనే ఉంది. కొన్ని రాజ్యాంగాలు ఉదాహరణకు బ్రిటన్ లో సమ్మె హక్కులేదు. కాని సంప్రదింపుల యంత్రాంగం చాలా పటిష్టంగా ఉంది. 

ఈ సమ్మెను మీరు సరియైన స్ఫూర్తితో అవగాహన చేసుకొని సంప్రదింపులు జరిపి తగు నిర్ణయాలు తీసుకోండి. వాళ్ళ డిమాండ్స్‌లలో క్రమబద్ధీకరణ అంశం కోర్టు ముందు ఉంది కాబట్టి దాని విషయంలో తక్షణమే కౌంటర్ వేసి సమర్ధుడైన లాయరును అవసరమైతే సుప్రీం కోర్టు లాయరుకు అప్పచెప్పండి. మీరే అంగీకరించి జీవో ఇచ్చిన జీతభత్యాలను, అంటే నాలుగు స్కేళ్ళను అమలు చేయండి. కోర్టు అభ్యంతరం చెపితే ప్రభుత్వ దృక్పథాన్ని, వాదనని కోర్టుకు చెప్పి ఒప్పించేలా ప్రయత్నం చేయండి. రాజకీయాలంటే సమస్యలను పరిష్కరించడం. సమ్మెను శాంతి భద్ర తల సమస్యలా చూడకండి. తక్షణమే స్పందించి, మీరు తీసుకున్న నిర్ణయాలనే మీరు అమలు చేయండి అని చేసే డిమాండ్లను సుముఖంగా పరిష్కరించండి.

- ప్రొఫెసర్ జి.హరగోపాల్
విద్యుత్ కార్మికుల అడ్వైజర్

English Title
Appeal to the Chief Minister
Related News