రేపే ప్రమాణ స్వీకారం

Updated By ManamWed, 05/16/2018 - 11:11
All Set for Yeddyurappa Oath Taking as CM
  • సంఖ్యా బలం ఉంది.. సీఎంగా అవకాశమివ్వండి.. బీజేఎల్పీనేతగా ఎన్నికైన యడ్యూరప్ప

All Set for Yeddyurappa Oath Taking as CMబెంగళూరు: బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప బీజేపీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆయన్ను ఎల్పీనేతగా ఎన్నుకున్నారు. దీంతో మరికొద్దిసేపట్లో ఆయన గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కోరనున్నారు. సంఖ్యా బలం ఉండడంతో రేపే (గురువారం) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ యడ్యూరప్ప అంటున్నారు. అందుకు గురువారం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు బీజేపీ నేతలు. కాగా, ఇప్పటికే అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో యడ్యూరప్ప రహస్య మంతనాలు చేసినట్టు సమాచారం. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యడ్యూరప్పకు టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ఓ హోటల్‌లో జేడీఎస్ చీఫ్ దేవెగౌడ, పార్టీలోని కీలక నేతలు సమావేశమయ్యారు. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలతో సమావేశమైంది. 78 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరఫున గెలిస్తే.. కేవలం 50 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. ఇటు ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఫిరాయిస్తారన్న అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను ముందు జాగ్రత్తగా పంజాబ్ రిసార్ట్‌కు తరలిస్తోంది కాంగ్రెస్ పార్టీ. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని రకాల వ్యూహాలకు పదును పెడుతున్న బీజేపీ.. ఆ చర్యలను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, పీయూష్ గోయల్‌లు ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు.  

English Title
All Set for Yeddyurappa Oath Taking as CM
Related News