హ్యాట్రిక్ డైరెక్ట‌ర్‌తో అఖిల్‌

Updated By ManamWed, 12/27/2017 - 22:59
akhil

akhilఅక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్ న‌టించిన తాజా చిత్రం ‘హలో’. ఫ‌లితం మాటెలా ఉన్నా..ఈ సినిమాతో క్లాస్, ఫ్యామిలీ ప్రేక్షకులకి చేరువ‌య్యాడు అఖిల్. ఇప్పుడు తన మూడవ చిత్రాన్ని లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడీ యంగ్ హీరో. మూడో చిత్రంతో మాస్ ప్రేక్షకులకి చేరువ కావాల‌నుకుంటున్నాడు అఖిల్‌. అఖిల్ మూడో చిత్రం విష‌యంలో.. ఇంత‌కుముందు కొరటాల శివ, బోయపాటి శ్రీను, సుకుమార్ వంటి ప్ర‌ముఖ దర్శకుల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ జాబితాలో మ‌రో దర్శకుని పేరు కూడా చేరిపోయింది. అత‌నే.. త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ.  'రాజా రాణి', 'తెరి', 'మెర్స‌ల్' (అదిరింది) చిత్రాల‌తో త‌మిళ‌నాట హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్నాడు అట్లీ. అఖిల్‌, అట్లీ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 10న వెల్లడ‌య్యే అవ‌కాశ‌ముంది.
 

English Title
akhil with hattrick director
Related News