షెల్టర్ హోం నుంచి 26 మంది అదృశ్యం

Updated By ManamFri, 08/10/2018 - 00:59
image

ప్రతాప్‌గఢ్: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ప్రతాప్‌గఢ్‌లోని రెండు వసతిగృహాల నుంచి 26 మంది మహిళలు తప్పిపోయిన ట్టు తేలింది. జిల్లా అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ సంగతి బయటపడటం విశేషం. బీజేపీ మహిళామోర్చా జిల్లా మాజీ అధ్యక్షురాలు రమా మిశ్రా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థలో మొత్తం 15 మంది మహిళలు ఉన్నట్టు నమోదై ఉండగా, కేవలం ఒక్క మహిళ మాత్రమే ఉండగా మిగతా వారు పనికెళ్లినట్టు సంస్థ వెల్లడించినట్టు అధికారులు తెలిపారు.

image


మరో వసతి గృహంలో 15 మంది మహిళలున్నట్టు రికార్డుల్లో ఉండగా 12 మంది జాడ తెలియడం లేదని జిల్లా యంత్రాంగం తెలిపింది. బిహార్, యుపీల్లోని వసతి గృహాల్లో ఆశ్రయం పొందుతున్న మహిళలు పెద్ద ఎత్తున అదృశ్యమవుతుండడంతో మొత్తం వ్యవహారంపై విచారణ సాగుతోంది.

English Title
26 women missing from shelter homes in Pratapgarh
Related News