ఘోర రోడ్డు ప్రమాదం.. 17మంది మృతి

Updated By ManamWed, 06/13/2018 - 09:27
road accident

road accident లఖ్‌నౌ: ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. మణిపూర్ జిల్లాలో కైరత్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17మంది మరణించారు. 35మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 5గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకోగా, క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రిలలో చేర్పించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాప్తను చేస్తున్నారు. కాగా బస్సు డ్రైవర్ అతి వేగం వలనే ఈ ప్రమాదం జరిగిందని అందులో ప్రయాణించిన ప్రయాణికులు చెప్పారు. చాలామంది బస్సుపైన కూడా ప్రయాణం చేశారని వారు అన్నారు.

 

English Title
17 dead in Uttarpradesh road Accident
Related News