ప్ర‌భుత్వాస్ప‌త్రిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

ప్ర‌భుత్వాస్ప‌త్రిపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

తీవ్ర మనస్తాపంతో ప్రభుత్వాసుపత్రి భవనంపై నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న‌ విషాద ఘటన విజ‌య‌వాడ‌ నగరంలో చోటు చేసుకుంది. ప్రత్యేక కరోనా ప్రభుత్వ ఆసుపత్రి రెండవ అంతస్తు నుండి దూకి కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయ‌త్నంకు పాల్ప‌డింది. మహిళకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రిలోకి తరలించి చికిత్స చేయిస్తుండ‌గా మృతిచెందింది. పాజిటివ్ లక్షణాలు కన్పించడంతో ఈనెల 26వ తేదీన కరోనా ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఆమెకు చికిత్స చేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిందనే మనస్థాపంతో ఆమె ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు స్థానికులు అనుకుంటున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశాయి.