పాక్ జైలు నుంచి హమీద్ అన్సారీ విడుదల

Hamid Ansari

న్యూఢిల్లీ : గూఢచర్యానికి పాల్పడ్డారనే అభియోగంతో పాకిస్తాన్‌లో నిర్బంధానికి గురైన ముంబైకి చెందిన హమీద్ నేహాల్ అన్సారీ సోమవారం కొహట్‌ సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యాడు. సరైన పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించాడంటూ అతడిని పాక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 2012లో పాక్‌కు చెందిన ఓ యువతితో అతడికి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. వారి మధ్య స్నేహం పెరిగడంతో..ఆమెను కలిసేందుకు పాక్ వీసా కోసం ప్రయత్నించాడు. 

అయితే వీసా రాకపోవడంతో హమిద్ భారత్ నుంచి అఫ్గానిస్థాన్ వెళ్లి అక్కడ నుంచి పాక్‌కు చేరుకున్నాడు. అయితే సరైన పత్రాలు లేకపోవడంతో గూఢచర్య అభియోగంతో 2016లో హమిద్ అన్సారీకి మిలటరీ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.  కాగా భారత్, పాక్‌ల మధ్య గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మూడేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా వారి దేశాలకు అప్పగించాలి. ఈ నేపథ్యంలో హమీద్ అన్సారీని రేపు పాక్ అధికారులు విడుదల చేసినట్లు విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు