చర్మం మన శరీరానికి మొదటి రక్షణ కవచం. అతినీలలోహిత కాంతి కిరణాల నుంచి రేడియేషన్ నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది. మన రోగ నిరోధక శక్తి విషయంలో చర్మం చాలా కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా చర్మం విటమిన్లను, మంచినీటిని, ఆక్సిజన్‌ని శోషణ చేసుకుంది. అదేవిధంగా శరీరంలో ఉన్నటువంటి వ్యర్థపదార్థాలను కూడా బయటికి విడుదల చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరిస్తుంది. వేడి, చల్లదనం, నొప్పి, ఆనందం, సంతోషం లాంటివి మన శరీరానికి తెలిసేవిధంగా చేస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ డీ ని తయారు చేస్తుంది. శారీరకంగా మానసికంగా, ఎమోషనల్‌గా ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డీ చాలా అవసరం.
Advertisement
విటమిన్ ‘C’ :
విటమిన్ సీ జలుబు, జ్వరం వంటి వాటిని తగ్గించకపోవచ్చు. కానీ అవి రాకుండా మాత్రం అడ్డుకోగలదు. విటమిన్ సీ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే ఎలాంటి రోగాలు దరిచేరవు. తాజా పండ్లు, కాయగూరల్లో విటమిన్ సి ఉంటుంది. ముఖ్యంగా నిమ్మజాతికి చెందిన పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.
విటమిన్ ‘A’ :
విటమిన్ స అనేది శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్. ఈ విటమిన్ శరీరానికి, పిల్లల పెరుగుదల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. చర్మం, కణజాలం, శ్లేష్మపొర ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి : టీమిండియా దుబాయ్‌లో బస చేసే హోటల్‌లో రోజుకు ఎంతో తెలుసా..?
విటమిన్ ‘B’ :
విటమిన్ ‘B” అనేది కొవ్వులో కరిగే గుణం కలిగి ఉంటుంది. ఇది 8 విటమిన్ల సమూహం. చర్మం కాంతివంతంగా ఉండేందుకు ఈ విటమిన్లు ఎంతో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా చేపలు, మాసం, గుడ్లు, పాల ఉత్పత్తుల వంటి ప్రోటీన్ల నుంచి ‘B విటమిన్‌ని పొందవచ్చు. అదేవిధంగా ఆకుకూరలు, బీన్స్, బఠానీలలో బీ విటమిన్లను జోడించాయి.
Advertisement
ఇది కూడా చదవండి : హీరోలు 1,2 తో సరిపెట్టుకుంటారు.. కానీ హీరోయిన్లు మాత్రం 5,6 ఒకేసారి కావాలంటారు.. వారు అడిగిన చేయనంటున్న రాజారవీంద్ర..!!
విటమిన్ K :
విటమిన్ K రక్తం గడ్డకట్టడంలో, అధిక రక్తస్రావం జరుగకుండా ఈ విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇతర విటమిన్ల వలే కాకుండా.. విటమిన్ కే సాధారణంగా ఆహార పదార్థంగా ఉపయోగించబడదు. చర్మానికి కూడా విటమిన్ K అవసరమే. వాస్తవానికి విటమిన్ K సమ్మేళనాల సమూహం. ఈ సమ్మేళనాలలో ముఖ్యమైనవి విటమిన్ K1, విటమిన్ K2. విటమిన్ K1 ఆకుకూరలు కొన్ని ఇతర కూరగాయల నుంచి లభిస్తుంది. విటమిన్ K2 అనేది మాంసాలు, చీజ్‌లు, గుడ్ల నుంచి ఎక్కువగా పొందిన సమ్మేళనాల సమూహం బ్యాక్టీరియా ద్వారా సంశ్లేషణ చేయబడుతుంది.
విటమిన్ E :
విటమిన్ E అనేది యాంటీ ఆక్సిడెంట్ అని పిలువబడుతుంది. సిగరేట్, పొగ, కాలుష్యం, సూర్యరశ్మి వంటి వాటి వల్ల కలిగే నష్టం గురించి మీ కణాలను రక్షిస్తుంది. చర్మం మృదువుగా కావడానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. విటమిన్ E తీసుకోవడం ద్వారా యవ్వనంగా కనిపిస్తుంటారు. ప్రధానంగా పొద్దు తిరుగుడు గింజలు, బాదం, నట్స్, వేరు శనగ వంటి గింజలు, కూరగాయలు, ఆకుకూరల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి : గణపతి పూజా సమయంలో పాలవెల్లి కట్టడానికి గల కారణం ఏంటో తెలుసా..?
జింక్ :
జింక్ అనేది ఓ ముఖ్యమైన పోషకంగా పరిగణించబడుతుంది. మీ శరీరం దాని ఉత్పత్తి చేయదు. అదేవిధంగా నిలువ కూడా చేయదు. మీ శరీరంలో జరిగే పలు ప్రక్రియలకు జింక్ చాలా అవసరం. జింక్ సహజంగా మొక్కల, జంతువుల ఆహారంలో లభిస్తుంది. కేవలం ఇవే కాకుండా పలు రకాల విటమిన్లు, మినరల్స్ శరీరానికి చాలానే ఉపయోగపడుతాయి.
Advertisement
ఇది కూడా చదవండి : మీరు నరాల వీక్‌నెస్‌తో బాధపడుతున్నారా..? అయితే ఈ ఫుడ్ తప్పకుండా తీసుకోండి..!