Home » ఎన్టీఆర్ కి మానవరాలిగా నటించి.. మళ్ళీ హీరోయిన్ గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఎన్టీఆర్ కి మానవరాలిగా నటించి.. మళ్ళీ హీరోయిన్ గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా ?

by AJAY
Ad

తెలుగు చిత్రపరిశ్రమ మర్చిపోలేని నటుడు ఎన్టీరామారావు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా రాణించారు. సాంఘీక ,పౌరాణిక, రాజకీయ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి స్టార్ హీరోయిన్ లు అందరి సరసన ఎన్టీఆర్ సినిమాలు చేశారు. సావిత్రి, జానకి, అంజలి, రాజశ్రీ, మంజుల ,లక్ష్మి, జయసుధ, జయప్రద,కృష్ణ కుమారి, శ్రీదేవి లతో ఎన్టీఆర్ సినిమాలు చేసి వినోదాన్ని పంచారు. అయితే ఎన్టీఆర్ పక్కన ఇండస్ట్రీ లో ఓకే ఒక్క హీరోయిన్ మనవరాలిగా మరియు హీరోయిన్ గా నటించింది. ఆమె మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి.

Advertisement

1972వ సంవత్సరంలో ఎన్టీఆర్ బడిపంతులు అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాకు చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీ రామారావు హీరోగా నటించగా అంజలి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో కృష్ణంరాజు, రామకృష్ణ జగ్గయ్య, విజయ లలిత ముఖ్యమైన పాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించి ఆకట్టుకుంది.

Advertisement

అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతో శ్రీదేవికి బాల నటిగా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా తరువాత శ్రీదేవి తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసింది. ఇదిలా ఉండగా శ్రీదేవి టాలీవుడ్ లో అనురాగాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగారక్క అనే సినిమాలో నటించింది.

ఆ వెంటనే పదహారేళ్ళ వయసు సినిమా లో నటించింది. ఇలా వరస సినిమాలు చేస్తున్న శ్రీదేవి 1979లో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన వేటగాడు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఎన్టీ రామారావు హీరోగా నటించగా శ్రీదేవి ఆయన తో జతకట్టింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కానీ ఎన్టీఆర్ మనవరాలి వయసున్న అమ్మాయితో స్టెప్పులు వేయడం ఏంటి అంటూ విమర్శలు కూడా వచ్చాయి.

 

Also read : చిరంజీవి నాజ‌ర్ ను ఎందుకు చంపేస్తాన‌ని బెదిరించాడు..? అలా ఎందుకు చెప్పాడు..!

Visitors Are Also Reading