టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. కానీ చిన్న వయసులోనే జీవితంలో జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఉదయ్ కిరణ్ ఆ*** త్య చేసుకున్నాడు.
Advertisement
కాగా తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి ఉదయ్ కిరణ్ ప్రేమ పెళ్లి జీవితం గురించి ఆసక్తికర విషయాను వెల్లడించారు. శ్రీదేవి మాట్లాడుతూ…. మనసంతా సినిమా తరవాత ఉదయ్ కిరణ్ జర్నలిస్ట్ తో ప్రేమలో పడ్డారు. ఎంతో గాడంగా ప్రేమించినప్పటికీ చిన్న గొడవ జరగటంతో ఆ అమ్మాయితో బ్రేకప్ అయినట్టు తెలిపారు. ఆ తరవాత కొంతకాలం పాటూ ఉదయ్ కిరణ్ డిప్రెషన్ లోకి వెళ్లారని శ్రీదివ్య తెలిపారు.
Also Read: ఉదయ్ కిరణ్‌తో చిరంజీవి తన కూతురు పెళ్లి ఎందుకు రద్దు చేసుకున్నాడో తెలుసా..?
udaykiran
ఆ సమయంలో చిరంజీవి ఉదయ్ కిరణ్ కు ఎంతో సపోర్ట్ చేశారని శ్రీవిద్య తెలిపారు. చిరంజీవి ఉదయ్ కిరణ్ కు ఓ గాడ్ ఫాదర్ లా ఉండేవారని చెప్పారు. అమ్మాయితో జరిగిన బ్రేకప్ గురించి కూడా చిరంజీవికి తెలుసని ఆయనే ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. ఆ తరావత చిరంజీవి తన కూతురుతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని అదే ఉదయ్ కిరణ్ కు చెప్పడంతో అతడు మళ్లీ డిప్రెషన్ లో నుండి బయటకు వచ్చాడని చెప్పారు.
Advertisement
ఆ తరవాత తమ కుటుంబం చిరంజీవి ఇంటికి వెళ్లి ఉదయ్ కిరణ్ తో సంబంధం కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఎంగేజ్మెంట్ జరిగిన తరవాత ఇద్దరూ మాట్లాడుకోగా అభిరుచులు భిన్నంగా ఉన్నాయని…ఉదయ్ మిడిల్ క్లాస్ అబ్బాయి అతడివి మిడిల్ క్లాస్ ఆలోచనలని శ్రీవిద్య చెప్పారు. ఇద్దరి మధ్య అభిరుచులు భిన్నంగా ఉండటంతో చర్చించుకునే ఇద్దరూ విడిపోయారని తెలిపారు. భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలనే ఉదయ్ కిరణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
ఉదయ్ కిరణ్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చనిపోలేదని తెలిపారు. ఉదయ్ కిరణ్ కు శంషాబాద్ మియాపూర్ లో భూములు ఉన్నాయని అంతే కాకుండా తమ తల్లి బంగారం కూడా ఉదయ్ కిరణ్ వద్దే ఉండేదని తెలిపింది. ఫైనాన్షియల్ కారణాలు ఉదయ్ కిరణ్ మరణానికి కారణం కాదని చెప్పారు.
Also Read: Uday Kiran: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉదయ్ కిరణ్ చివరి లెటర్ అందులో ఏముందంటే ?
uday kiran sister
అంతే కాకుండా చనిపోయిన రోజు కూడా ఉదయ్ కిరణ్ తనకు ఫోన్ చేసి ఎంతో కూల్ గా పాజిటివ్ గా మాట్లాడరని చెప్పారు.
Advertisement