Shah Rukh Khan

అంబానీ ఫంక్షన్‌లో షారూక్ లైవ్ డాన్స్!

Updated By ManamThu, 06/21/2018 - 18:22

Shah Rukh Khan, Host Perform,  Akash Ambani, Shloka Mehta's Engagement Partyబాలీవుడ్‌ స్టార్ హీరోలు సాధారణంగా పెద్ద వేడుకల్లో లైవ్‌ పెర్‌ఫార్‌మెన్స్‌లు ఇస్తుంటారు. ఇలాంటి లైవ్‌ పెర్‌ఫార్‌మెన్స్‌ ఇచ్చినందుకుగానూ.. భారీ మొత్తంలో పారితోషికాన్ని అందుకుంటూనే ఉంటారు. అయితే, ‘బాలీవుడ్‌ బాద్‌షా’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే షారూక్‌ఖాన్‌.. ఆకాశ్‌ అంబానీ నిశ్చితార్థ వేడుకలో హోస్ట్‌గా వ్యవహరిస్తూ లైవ్‌ డాన్స్‌ చేయబోతున్నారు. ముఖేశ్‌ అంబానీతో షారూక్‌కు ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అంబానీ కుటుంబాలకు సంబంధించి జరిగిన పలు ఫంక్షన్లలో షారుక్ చిందేసి సందడి చేశారు. ఈ నెల 30న జరుగనున్న ఆకాశ్‌ అంబానీ, శ్లోకా మెహతా ఎంగేజ్‌మెంట్‌ ఫంక్షన్‌లో కూడా షారూక్‌ చిందేయనున్నారట. ఈ వేడుకకు బాలీవుడ్‌ తారలు సహా ప్రముఖ రాజకీయ నాయకులందరూ హాజరవుతారు. షారూక్ ‘జీరో’ టీజర్‌.. సందడి చేసిన సల్మాన్

Updated By ManamThu, 06/14/2018 - 12:59
Shah Rukh

ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్ నటిస్తున్న చిత్రం ‘జీరో’. కత్రినా కైఫ్, అనుష్క శర్మలు కథానాయికలు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. రంజాన్‌ను పురస్కరించుకొని స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో మరుగుజ్జు పాత్రలో షారూక్, అతిథి పాత్రలో సల్మాన్ ఇద్దరు కలిసి సందడి చేస్తూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలను చెప్పారు. కాగా సల్మాన్ తన షర్ట్‌పై కత్రినా కైఫ్ ఫొటో వేసుకొని రావడం విశేషం. ఇక ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న విడుదల కానుంది.

 షారూక్ ముద్దాడుతున్న ఆ నటి ఎవరబ్బా..?

Updated By ManamWed, 06/13/2018 - 10:57

shah rukh బాలీవుడ్ నటులు షారూక్, గుల్షన్ గ్రోవర్‌లు ఓ నటిని ముద్దాడేందుకు పోటీ పడుతున్న ఫొటో ఒకటి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ ఫొటోలో ఉన్న నటి ఎవరంటూ నెటిజన్లు ఆరా తీశారు. వారిలో కొందరు సమాధానాన్ని చెప్పగా, మరొకొందరు దాని వెనుక కథను కూడా చెప్పేస్తున్నారు. ఇంతకు ఆ కహాని ఏమిటి, ఆ నటి ఎవరు అంటే..

అక్కడున్నది మరెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ ఫర్‌పెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. 1995లో అశుతోశ్ గోవారికర్ తీసిన బాజీ చిత్రంలో ఓ సన్నివేశం కోసం ఆమిర్ అమ్మాయి వేషం వేసుకున్నాడు. ఆ వేషంలోనే ఉన్న ఆమిర్‌ను షూటింగ్ తరువాత షారూక్, గుల్షన్‌లు ముద్దాడుతూ ఓ ఫొటో తీసుకున్నారు. ఇదే ఫొటో తాజాగా వైరల్‌ అయ్యింది.యువ క్రికెటర్ ప్రేమలో కింగ్‌ఖాన్ తనయ..?

Updated By ManamSat, 06/02/2018 - 09:31

Suhana  సినీ తారలు, క్రికెట్‌ ఆటగాళ్ల మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి చెప్పాలంటే బాలీవుడ్ భామలతో డేటింగ్ చేసిన క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. ఇదంతా పక్కనపెడితే తాజాగా బాలీవుడ్ కింగ్‌ఖాన్ తనయ సుహానా ఖాన్ ఓ క్రికెటర్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

టీమిండియా ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఒకడైన శుబ్‌మాన్ గిల్‌తో సుహానా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. తాజాగా ఐపీఎల్‌ మ్యాచ్‌ల అనంతరం ఈ ఇద్దరు ముచ్చటించడం అందరి ఆకర్షించింది. అంతేకాదు వీరిద్దరు బయట డిన్నర్లు, పార్టీలకంటూ తిరుగుతున్నారని సోషల్‌ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

 భర్త సినిమా ఫ్లాప్ అవ్వాలనుకుందట

Updated By ManamThu, 03/01/2018 - 15:01

Shah Rukh Khan భార్య ఎప్పుడూ భర్త విజయాన్నే కోరుకుంటుంది. అయితే బాలీవుడ్ కింగ్‌ ఖాన్ షారూక్ ఖాన్ భార్య గౌరీ మాత్రం తన భర్త ఫ్లాప్ అవ్వాలని కోరుకుందట. ఈ విషయాన్ని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బాలీవుడ్‌లో హీరోగా షారూక్‌కు వచ్చిన మొదటి ఆఫర్ 'దీవానా'. ఈ సినిమా ఒప్పుకోక కొద్ది రోజుల ముందు షారూక్‌ను వివాహం చేసుకుంది గౌరీ. ఇక ఈ ఆఫర్ రావడంతో ఢిల్లీ నుంచి ముంబైకి తన మకాంను మార్చాడట షారూక్. అయితే అక్కడకు రావడం అస్సలు ఇష్టం లేని గౌరీ ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకుందట.

ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోవచ్చని ఆమె ప్లాన్ వేసుకుందట. అయితే ఆ సినిమా హిట్ అవ్వడం.. ఆ తరువాత షారూక్‌కు వరుస అవకాశాలు రావడం జరిగిపోయాయి. ఈ విషయాన్ని గౌరీ ఖాన్‌ కూడా ఒకానొక సందర్భంలో చెప్పారు. మొదట్లో సినిమాలంటే తనకు ఇష్టం ఉండేవి కాదని.. తరువాత షారూక్‌ తన జీవితంలోకి వచ్చాక వాటిపై ఆసక్తిని పెంచుకున్నానని తెలిపారు గౌరీ ఖాన్.రోబో ప్రేమకు స్పందించిన షారూక్

Updated By ManamThu, 02/22/2018 - 14:53

Shah Rukh Khan, Sophiaఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ ఐటీ కాన్ఫిరెన్స్‌లో ప్రపంచ మొట్టమొదటి హ్యుమరాయిడ్ రోబో సోఫియా తన ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా మానవత్వం, మహిళలపై ఆమె చెప్పిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. ఇక ఈ ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన బాలీవుడ్ నటుడెవరంటూ సోఫియాను ప్రశ్నించాడు హోస్ట్. ఈ సందర్భంగా ఆమె షారూక్ అంటూ చెప్పింది. దీనిపై బాలీవుడ్ కింగ్‌ఖాన్ స్పందించారు.

"నా దేశానికి వచ్చిన మహిళకు ప్రేమను వ్యక్తం చేస్తున్నాను. నీ అణువణువుగా నన్ను అనుకరించావు సోఫియా" అంటూ షారూక్ తన ప్రేమను తెలిపారు. అయితే హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సంస్థ సోఫియాను తయారు చేయగా.. 2015 ఏప్రిల్ 19న దీనిని యాక్టివేట్ చేశారు. ఈ రోబో దాదపు 62కు పైగా హావభావాలను పలికించగలదు. ఇక గతేడాది దుబాయ్ ప్రభుత్వం సోఫియాకు పౌరసత్వాన్ని కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.కెనడా ప్రధానిని కలిసిన కింగ్‌ఖాన్

Updated By ManamWed, 02/21/2018 - 10:30

Shah Rukh Khanవారం రోజుల భారత పర్యటనకు వచ్చిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పర్యటనలో భాగంగా పలువురిని కలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ప్రముఖులను కూడా కలుసుకున్నారు ట్రూడో. సినీ, వాణిజ్య ప్రముఖులు పాల్గొన్న ఓ కార్యక్రమానికి హాజరైన ట్రూడోను షారూక్ ఖాన్, ఫర్హాన్ అక్తర్, అనుపమ్ ఖేర్ తదితరులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో తీసుకున్న ఫొటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాను షారూక్ ఖాన్‌తో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రూడో.. భారత్, కెనడా చిత్ర పరిశ్రమలు కలిసి పనిచేస్తాయని పేర్కొన్నారు.కింగ్‌ఖాన్‌కు శిక్ష తప్పదా..?

Updated By ManamSat, 02/03/2018 - 10:58

Shah Rukh Khanబాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ను ఇటీవల టాక్స్ అధికారులు అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఆలీబాగ్‌లో ఉన్న20,000గజాల స్థలాన్ని వ్యవసాయం చేస్తానని కొన్న షారూక్.. అక్కడ విలాసవంతమైన బిల్డింగ్‌ను కట్టుకున్నారు. దీంతో బినామీ వ్యతిరేక చట్టం కింద అధికారులు ఆ బిల్డింగ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా.. షారూక్ ఆ స్థలాన్ని నకిలీ పత్రాలతో కొనుగోలు చేశాడట.

ఈ విషయాన్ని షారూక్ సన్నిహితుడు, ఆయనకు ఛార్టెడ్ అకౌంటెడ్‌గా ఉన్న మోరేశ్వర్ అజ్గాంకరే తెలిపారు. షారూక్ సూచనలతోనే ఆ స్థలాన్ని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసినట్లు ఆయన పన్ను శాఖ అధికారుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఒకవేళ ఈ కేసులో ఆరోపణలు నిజమైతే షారూక్‌కు ఆరు నెలల నుంచి
ఏడేళ్ల దాకా శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంటుంది.ట్విట్టర్ నుంచి అమితాబ్ క్విట్!

Updated By ManamThu, 02/01/2018 - 11:12

Amitabh Bachchan Threatens To Leave Twitter As Shah Rukh Khan Scores 32.9 Mn Followersసోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరవ్వడానికి నిత్యం సినీ నటులు చాలా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌‌ల ద్వారా అభిమానులను అలరిస్తుంటారు. సినిమాకు సంబంధించిన వివరాలతో పలు విషయాలను అభిమానులతో పంచుకుని వారిని ఖుషీ చేయడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. హీరోలను కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఫాలో అవుతుంటారు. అంతేకాదు ఒక వేళ ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్ లేకున్నా కొత్తగా క్రియేట్ చేసుకుని మరీ అభిమానులకు దగ్గరవ్వడానికి మరికొందరు నటులు ప్రయత్నిస్తుంటారు.

అయితే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మాత్రం ‘నాకు ట్విట్టర్ వద్దు.. నేను తప్పుకుంటున్నా’ అంటున్నారు.. ఎందుకిలా అంటున్నారు? ఏమైందనే విషయంపై నవ్వుతూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీ అమితాబే అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఫాలోవర్స్‌ను ఒక్కసారిగా తగ్గించేసింది ట్విట్టర్.

ట్వీట్ సందేశం..
ట్విట్టర్‌..నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది చాలా జోక్‌గా అనిపిస్తోంది. నిన్ను వదిలించుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఫాలోవర్స్‌ను తగ్గించడమే కాకుండా నేను క్విట్ అవగాడానికి పలు కారణాయాలున్నాయి.. థాంక్యూ అంటూ అమితాబ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఒక రకంగా చెప్పాలనుకుంటే ట్విట్టర్‌‌‌ మీద అమితాబ్ చాలా కోపంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అందుకే ఇలా వ్యంగ్యంగా ట్విట్టర్‌‌కే కౌంటరిచ్చారని స్పష్టంగా అర్థమవుతోంది.

ట్విటర్‌లో అమితాబ్‌ ఫాలోవర్ల సంఖ్య: 32,902,353. బాలీవుడ్ బాద్ షా షారుక్‌ ప్రస్తుతం ఫాలోవర్ల సంఖ్య 32,944,338. బాద్‌షా ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఏకంగా అత్యధిక ఫాలోవర్లు ఉన్న అమితాబ్‌‌‌నే దాటేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమితాబ్‌ ట్వీట్‌ను బట్టి చూస్తే ఆయన ఫాలోవర్లలో కొంత మందిని ట్విట్టరే తగ్గించినట్లుందని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు ‘హమ్‌’ చిత్రంలో తను విలన్‌ గొంతు పట్టుకున్న స్టిల్‌ను పోస్ట్‌ చేసి తన ఆగ్రహాన్ని ఆయన వ్యక్తపరిచారు.

 షారూక్‌కు ఐటీ అధికారుల షాక్

Updated By ManamWed, 01/31/2018 - 09:56

Shah Rukh Khanబాలీవుడ్ కింగ్‌ఖాన్ షారూక్ ఖాన్‌కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. అలీబాగ్‌లో అతడికి సంబంధించిన ఫామ్ హౌస్‌ను బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద అటాచ్ చేశారు ఐటీ అధికారులు. దీనికి సంబంధించి గత నెలలోనే అతడికి నోటీసులు పంపినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా.. వ్యవసాయం చేస్తానంటూ అలీబాగ్‌లో భూమిని కొనుగోలు చేసిన షారూక్ ఖాన్ అక్కడ ఫామ్ హౌజ్ కట్టుకొని సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడు. అయితే మహారాష్ట్ర కౌలు మరియు వ్యవసాయ భూముల చట్టం ప్రకారం ఇలా అనుమతులు లేకుండా వ్యవసాయ భూమిని స్వప్రయోజనాల కోసం వాడుకోవడం నేరం. ఈ క్రమంలోనే షారూక్‌ ఫామ్ హౌస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు అధికారులు.
 

Related News