kaasi

'కాశి' రివ్యూ

Updated By ManamFri, 05/18/2018 - 15:33

kaasiచిత్రం: కాశి

నటీనటులు: విజయ్ ఆంటోనీ, అంజలి, సునయన, అమృత అయ్యర్, శిల్పా మంజునాథ్, నాజర్, జయప్రకాశ్, మ‌ధుసూద‌న‌రావు, వేలా రామ‌మూర్తి, యోగిబాబు తదితరులు

మాటలు, పాటలు: భాస్యశ్రీ

పోరాటాలు: శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్‌

కళ: శక్తి వెంకట్‌రాజ్.ఎం

ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్

కూర్పు: లారెన్స్ కిషోర్

సంగీతం: విజయ్ ఆంటోనీ

నిర్మాణ సంస్థలు: విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, లెజెండ్ సినిమా

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృతిగ‌ ఉదయనిధి

విడుదల తేది: 18 మే 2018

నిడివి: 133 నిమిషాలు

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ‌ క‌థానాయ‌కుడు విజ‌య్ ఆంటోని. ఆ త‌రువాత 'భేతాళుడు', 'య‌మ‌న్‌', 'ఇంద్ర‌సేన' చిత్రాల‌తో ప‌ల‌క‌రించినా.. నిరాశే మిగిలింది. ఈ నేప‌థ్యంలో.. మ‌రోసారి మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఆ చిత్ర‌మే 'కాశి'.  దర్శకురాలు కృతిగ‌ ఉదయనిధి తెరకెక్కించిన ఈ సినిమా శుక్ర‌వారం తెర‌పైకి వ‌చ్చింది. ఈ సినిమాపై 'మ‌నం' అందిస్తున్న స‌మీక్ష మీ కోసం..

కథాంశం
kaasiచిన్న‌ప్ప‌ట్నుంచి త‌ల్లిదండ్రుల‌తో అమెరికాలో ఉంటున్న భ‌రత్ (విజయ్ ఆంటోనీ).. లండ‌న్ మెడిక‌ల్ యూనివ‌ర్శిటీలో వైద్య విద్య పూర్తిచేస్తాడు. న్యూయార్క్‌లోని బెస్ట్ హాస్పిట‌ల్స్‌లో ఒక‌టైన భ‌ర‌త్ మ‌ల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు ఎండీ అయిన భ‌ర‌త్‌.. న్యూయార్క్‌లో స‌క్సెస్‌ఫుల్ కార్డియోథెరాసిస్ స‌ర్జ‌న్‌గా పేరుతెచ్చుకుంటాడు. ఎదుటివాళ్ళు అసూయ‌గా ఫీల‌య్యేంత‌ గొప్ప జీవితాన్ని గ‌డుపుతున్న‌ప్ప‌టికీ.. ఏదో తెలియ‌ని వెలితి అత‌న్ని వెంటాడుతుంటుంది. అంతేగాకుండా.. ప్ర‌తిరోజూ  అత‌న్ని ఓ క‌ల‌ వెంటాడుతుంటుంది. అదేమిటంటే.. ఆ క‌ల‌లో ఒక చిన్న బాబు, పెద్ద పాము, ఒక ఎద్దు కనిపిస్తూ ఉంటాయి. ప్ర‌తీ సారి.. ఆ ఎద్దు పిల్ల‌వాడ్ని పొడవడానికి వస్తున్నట్టుగా కల వస్తూ ఉంటుంది. అదే స‌మ‌యంలో ఆ బాబుని కాపాడ‌బోయిన అమ్మను ఎద్దు పొడిచిన‌ట్లుగా క‌నిపిస్తుంటుంది. ఆ క‌ల త‌న‌కు ప్ర‌తి రోజు ఎందుకు వ‌స్తుందో అర్థం కాని ప‌రిస్థితి భ‌ర‌త్‌ది. ఇదిలా ఉంటే.. అనుకోకుండా ఒక రోజు తన తల్లికి రెండు కిడ్నీలు పాడవడంతో.. తల్లిని కాపాడుకోవడం తన బాధ్యతగా భావించిన భ‌ర‌త్‌ త‌న‌ కిడ్నీనే ఇవ్వడానికి సిద్ధపడతాడు. భరత్ కిడ్నీ అత‌ని తల్లికి సరిపడదని.. అందుకు కారణం భరత్ తమ సొంత బిడ్డ కాదని, ఇండియాలో అత‌న్ని దత్తత తీసుకున్నామ‌ని భరత్ తండ్రి చెబుతాడు. త‌ల్లికి కిడ్నీ ఆప‌రేష‌న్ పూర్త‌య్యాక‌.. తన మూలాలను తెలుసుకునేందుకు భరత్ ఇండియాకి వస్తాడు. ఈ ప్రాసెస్‌లో మొద‌ట అనాథ శ‌ర‌ణాల‌యానికి వ‌స్తాడు. అక్క‌డ అందిన స‌మాచారంతో ముందుకెళ్తే.. త‌న అస‌లు పేరు కాశి అని, త‌ల్లి పేరు పార్వ‌తి అని తెలుస్తుంది. ఆమెను ఒక‌రు మోసం చేశార‌ని.. అలాగే త‌న‌ని కాపాడుకునే స‌మ‌యంలో ఎద్దు పొడ‌వ‌డంతో హాస్పిట‌ల్ పాల‌యింద‌ని తెలుస్తుంది. ఇంత‌కీ ఆమెను మోసం చేసిన వ్య‌క్తి ఎవ‌రు?  పార్వ‌తి ఆచూకీ తెలిసిందా? లేదా? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మే ఈ చిత్రం.

విశ్లేష‌ణ‌
kaasiద‌ర్శ‌కురాలు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా.. ఉప‌క‌థ‌లు ఎక్కువ కావ‌డంతో సినిమా అంత‌గా ఆస‌క్తిని క‌లిగించ‌లేద‌నే చెప్పాలి. అలాగే.. హీరో ఫ్లాష్‌బ్యాక్‌ల‌కు సంబంధించి.. మూడు ఉప‌క‌థ‌లు ఉంటే.. వాటిలో రెండింటికి  ప్ర‌ధాన క‌థ‌తో సంబంధం లేక‌పోవ‌డంతో ప్రేక్ష‌కులకు ప‌క్క‌దారి ప‌ట్టించిన భావ‌న క‌లుగుతుంది. అలాగే ఎమోష‌న్స్‌కు, ఫీల్‌కు స్కోప్ ఉన్నా.. ద‌ర్శ‌కురాలు ఆ వైపు దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో.. సినిమాలో ఎంగేజింగ్ మూమెంట్స్ మిస్ అయిన‌ట్ల‌య్యింది. ప్ర‌ధాన క‌థ‌ల‌తో పాటు.. ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే మూడు ఉప‌క‌థ‌ల్లోనూ వేరేవారి పాత్ర‌ల (మ‌ధుసూద‌న‌రావు, నాజ‌ర్, జ‌య‌ప్ర‌కాశ్‌) యంగ్ లుక్స్ కోసం విజ‌య్‌ను చూపించ‌డం అనే ఆలోచ‌న బాగున్నా.. న‌ట‌న‌లో వేరియేష‌న్స్ లేక‌పోవ‌డంతో తేలిపోయిన‌ట్ల‌య్యింది. అలాగే.. క‌థానాయ‌కుడు ఫీల్‌తో డైలాగ్ చెపుతుంటే.. క‌మెడీయ‌న్ యోగి బాబు వేసే సెటైర్స్ హీరో పాత్ర ఔన్న‌త్యాన్ని దెబ్బ‌తీసిన‌ట్ల‌య్యిందే త‌ప్ప మ‌రొక‌టి కాదు. ఓవ‌రాల్‌గా.. ఉప‌క‌థ‌ల పురాణాన్ని ప‌క్క‌న పెడితే.. విజ‌య్ ఆంటోని గ‌త చిత్రాలు, పాట‌లను మ‌ళ్ళీ చూస్తున్న‌ట్లు, వింటున్న‌ట్లుగానే ఉంటుందే త‌ప్ప‌.. కొత్త సినిమా చూస్తున్న‌ట్లు ఎక్క‌డా తోచ‌దు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే.. మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో మొద‌లై 'ఫాద‌ర్' సెంటిమెంట్‌తో ముగిసే ఈ క‌థ‌.. ప్రేక్ష‌కుల మ‌న‌సులను క‌దిలించ‌డంలో విఫల‌మైంద‌నే చెప్పాలి. 

kaasiన‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ ఆంటోని ఎప్ప‌టిలాగే ప‌రిమిత హావభావాల‌తో స‌రిపెట్టేశారు. మొత్తం నాలుగు పాత్ర‌ల్లో క‌నిపించినా.. న‌ట‌న ప‌రంగా మెప్పించిన సీన్స్ లేవ‌నే చెప్పాలి. ఇక‌ కాశిని ప్రేమించే నాటు వైద్యురాలు శ్రీ‌వ‌ల్లి పాత్ర‌లో అంజ‌లి కొన్ని స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మైంది. న‌ట‌న‌కు స్కోప్ లేని పాత్ర‌లో ఏదో ఉన్నానంటే ఉన్నాననిపించుకుంది. భువ‌నేశ్వ‌రి పాత్ర చేసిన‌ సున‌య‌న త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకుంది. అలాగే నాజ‌ర్ ఫ్లాష్‌బ్యాక్‌లో వ‌చ్చే శిల్పా మంజునాథ్ విష‌యానికి వ‌స్తే సీనియ‌ర్ న‌టి లిజీ ఫీచ‌ర్స్‌తో చ‌క్క‌గా ఉంది. చ‌నిపోయే సీన్‌లో హావ‌భావాల ప‌రంగా మెప్పించింది. అలాగే మ‌ధుసూద‌న్ ఎపిసోడ్స్‌లో వ‌చ్చే అమృత కూడా చ‌క్క‌గా న‌టించింది. నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, మ‌ధుసూద‌న‌రావు పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే అయినా ఉన్నంత‌లో మెప్పించారు. యోగిబాబు కామెడీ అక్క‌డ‌క్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యింది. ముఖ్యంగా మెడిక‌ల్ క్యాంప్ పెట్టిన‌ప్పుడు వ‌చ్చే స‌న్నివేశాల్లో అత‌ని కామెడీ బాగానే ఉంది.

సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే.. విజ‌య్ ఆంటోని సంగీతంలో రూపొందిన పాట‌ల‌న్నీ సంద‌ర్భోచితంగా ఉన్న‌ప్ప‌టికీ.. గుర్తుండిపోయే పాట‌లైతే కాదు. అయితే.. నేప‌థ్య సంగీతం బాగా కుదిరింద‌నే చెప్పాలి. రిచ‌ర్డ్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. ముఖ్యంగా ప‌ల్లెటూరి అందాల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. అలాగే శ‌క్తి శ‌ర‌వ‌ణ‌న్ స్టంట్స్ మాస్‌ని ఎట్రాక్ట్ చేస్తాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ‌విలువ‌లు బాగున్నాయి.  
ప్లస్ పాయింట్స్            

కాన్సెప్ట్

నేప‌థ్య సంగీతం

ద్వితీయార్థం

ఛాయాగ్ర‌హ‌ణం

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్       

సినిమాలో ఫీల్, ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కాలేదు

ఎంగేజింగ్ మూమెంట్స్ త‌క్కువ‌

స్క్రీన్‌ప్లే

డైరెక్షన్

చివ‌ర‌గా.. 'కాశీ' మ‌జిలీ క‌థ‌లు
రేటింగ్‌: 2.25/5'కాశి'.. తొలి 7 నిమిషాల సినిమా ఇదిగో..

Updated By ManamTue, 05/15/2018 - 19:49

kaasi'బిచ్చగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన త‌మిళ క‌థానాయ‌కుడు విజ‌య్ ఆంటోని. ఆ త‌రువాత 'భేతాళుడు', 'య‌మ‌న్‌', 'ఇంద్ర‌సేన' చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన విజ‌య్‌.. అతి త్వ‌ర‌లో 'కాశి'గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. అంజ‌లి, సునైనా, అమృత‌, శిల్పా మంజునాథ్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ త‌మిళ అనువాద‌ చిత్రానికి కృతిగ ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విజ‌య్ ఆంటోని సంగీత‌మందించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో.. స్నీక్ పీక్ పేరుతో ఈ సినిమాకి సంబంధించిన తొలి 7 నిమిషాల ఫుటేజ్‌ను ఈ రోజు (మంగ‌ళ‌వారం) చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేసింది. ఎప్ప‌టిలాగే మ‌రో వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రంతో విజ‌య్ సంద‌డి చేయ‌నున్నార‌ని ఈ వీడియో చూస్తుంటే మ‌రోసారి స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.  విజ‌య్ ఆంటోని 'కాశి' ట్రైల‌ర్‌

Updated By ManamFri, 03/23/2018 - 18:25

kaasiవైవిధ్య‌మైన పాత్ర‌ల‌కు చిరునామాలా నిలిచిన క‌థానాయ‌కుల‌లో విజ‌య్ ఆంటోని ఒక‌రు. 'బిచ్చగాడు' చిత్రంతో తెలుగువారికి చేరువైన ఈ త‌మిళ క‌థానాయ‌కుడు.. ఆ త‌రువాత 'బేతాళుడు', 'య‌మ‌న్‌', 'ఇంద్ర‌సేన' చిత్రాల‌తో ప‌ల‌క‌రించారు. ఇదిలా ఉంటే.. మ‌రో వైవిధ్య‌మైన క‌థాంశంతో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు విజ‌య్. 'కాశి' పేరుతో తెలుగులో అనువాద‌మౌతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో తెర‌పైకి రానుంది. కృతిగా ఉద‌య‌నిధి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అంజ‌లి, సునైనా, శ్రుతి, అమృత క‌థానాయిక‌లుగా న‌టించారు. కాగా, ఈ చిత్రం ట్రైల‌ర్ ఈ రోజు (శుక్ర‌వారం) విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే.. పున‌ర్జ‌న్మ‌ల‌ నేప‌థ్యంలో సాగే సినిమా ఇద‌ని తెలుస్తోంది. 'బిచ్చ‌గాడు' త‌రువాత స‌రైన విజ‌యం లేని విజ‌య్ ఆంటోనికి ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది.  ‘కాశి’.. 'అంద‌మా అంద‌మా' ఫుల్ వీడియో సాంగ్‌

Updated By ManamThu, 01/25/2018 - 19:22

kaasi‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన తమిళ క‌థానాయ‌కుడు విజయ్ ఆంటోనీ. ఆ త‌రువాత వ‌చ్చిన చిత్రాలు ఆశించిన విజ‌యం సాధించ‌లేదు. ఈ నేప‌థ్యంలో త‌న ఆశ‌ల‌న్నీ కొత్త చిత్రంపై పెట్టుకున్నారు విజ‌య్‌. ఆ చిత్ర‌మే ‘కాశి’. త‌మిళంలో ‘కాళి’ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా.. రెండు భాష‌ల్లోనూ మార్చి 30న తెర‌పైకి రానుంది.  గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దర్శకురాలు కృతికా ఉదయనిధి తెరకెక్కించారు. కాగా,  ఈ చిత్రంలోని 'అందమా అందమా' అంటూ సాగే పాట‌కి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ని ఈ రోజు (గురువారం) ప్ర‌ముఖ క‌థానాయిక అక్కినేని స‌మంత త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా విడుద‌ల చేశారు.  

“అందమా అందమా నన్ను ఎత్తుకుపో అందమా.. చంద్రమా, సంద్రమా, నన్ను చుట్టుకుపో సర్పమా.. నీ దేహమే పెను వేసవి.. చెలి తీసెనే నా ఊపిరి.. ప్రాణం వీడెనే కోరికే పెరిగెనే” అంటూ సాగే  ఈ పాట‌ని నివాస్, జానకి అయ్యర్ చక్కగా ఆలపించారు. ఈ పాటకి విజయ్ ఆంటోనీ అందించిన సంగీతం కూడా వీనుల విందుగా ఆకట్టుకునేలా ఉంది. ఈ పాట మ‌ధ్య‌లో వచ్చే “ఇక నిన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను. నువ్వు నా కోసమే పుట్టావ్” అనే మాట‌లు విజయ్ ఆంటోనీ, శిల్పా మంజునాథ్ పాత్ర‌ల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది. ఈ పాటని భాష్య శ్రీ రచించారు.  

అంజలి, సునయన, అమృత, శిల్పా మంజునాథ్‌ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రాన్ని విజ‌య్ ఆంటోని స్వ‌యంగా నిర్మించారు.విజయ్ ఆంటోని 'కాశి' ఫస్ట్‌లుక్

Updated By ManamWed, 01/24/2018 - 13:20

Kaasiనటుడు, సంగీతదర్శకుడు విజయ్ ఆంటోనికి టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే తన సినిమాలను తమిళ్‌లో పాటు తెలుగులోనూ అదే రోజున విడుదల చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో తాజాగా 'కాశి' (తమిళ్‌లో కాళి)అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దీనికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విజయ్ ఆంటోని.. ఇందులోని 'అందమా' అని సాగే మొదటి సింగిల్‌ను గురువారం రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన అంజలి నటిస్తుండగా కిరుతింగ ఉదయనిధి దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది.
 స‌ర్వ పాప‌హ‌ర‌ణం కాశీ సంద‌ర్శ‌నం

Updated By ManamSun, 09/17/2017 - 17:28

భారతదేశపు అత్యంత పవిత్రమైన గంగా నదీ తూర్పు పరివాహక ప్రాంతంలో కొలువుదీరి ప్రపంచంలోనే అతిపురాతనౖమెన నగరంగా పేరొందిన వారణాసి భారతదేశపు సాంస్కృతిక రాజధానిగా భాసిల్లుతోంది. వారణాసి నగరం నడిబొడ్డులో నెలకొన్న కాశీ విశ్వనాథ దేవాలయం శైవ జ్యోతిర్లింగాలలో ఒకటిగా భక్తుల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కాశీ విశ్వేశ్వర దేవాలయం సంప్రాప్తించుకుంది.

కాశీ దేవాలయం 
గంగానదికి సమీపంలో విశ్వనాథ గల్లీగా పిలవబడే చిన్న వీధిలో చిన్న చిన్న దేవాలయాల సమూహంగా దేవాలయ ప్రాంగణం వర్థిల్లుతోంది. ప్రాంగణంలోని విశ్వనాథ దేవాలయం చుట్టు పక్కల అనేక అనుబంధితౖమెన పీఠాలు ఆవరించి ఉన్నాయి. 'జ్ఞాన వాపి' అనగా జ్ఞాన బావిగా పేరొందిన నుయ్యి ఒకటి ప్రధాన దేవాలయానికి ఉత్తర దిశలో నెలకొంది. విశ్వనాథ దేవాలయం మంటపం మరియు గర్భగుడితో అలరారుతోంది. గర్భగుడిలో ప్రధానంగా పూజలందుకునే శివస్వరూపానికి తార్కాణంగా నిలుస్తున్న లింగం 60 సెం.మీ.ల పొడవు మరియు 90 సెం.మీ.ల చుట్టుకొలతతో వెండి తాపడాన్ని కలిగి ఉంటుంది. శివలింగం నల్లరాతితో నిర్మితౖమెంది. దేవాలయ అంతర్భాగం విశాలంగా లేకున్నప్పటికీ ప్రశాంతౖమెన వాతావరణాన్ని కలిగి మహాశివుని పూజించుకునేందుకు భక్తులకు అనువుగా ఉంటోంది. 

కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురౖంపెన పూసిన బంగారు పూత కారణంగా దీనిని బంగారు మందిరం అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్‌ రాణి అహల్యాబాయి హోల్కర్‌ కట్టింపించింది. ఇందులో లింగాకారంగా కొలుౖవె ఉన్న దేవుడు విశ్వేశ్వరుడు, విశ్వనాధుడు పేర్లతో పూజలందు కొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఆలయ సమీపంలో ఉన్న  గ్యాంవాపీ  మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1839 లో పంజాబ్‌ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్‌ సింగ్‌ ఈజీ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పిం చాడు. 1983 జనవరి28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదే శ్‌ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్ప టి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్‌ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.17 మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. 

స్త్రీ పురుషులు, పిల్లలు వృద్ధులు అనే తారతమ్యాలుకు చోటు లేకుండా, కులమతాలకు అతీతంగా ఎవౖరెనా కావచ్చు వారాణాశిని సందర్శించి గంగా నదిలో స్నానం చేసినట్లయితే మోక్షాన్ని పొందుతారని హిందూ పురాణేతిహాసాలు పేర్కొంటు న్నాయి. కనుకనే జీవితకాలంలో ఒక్కసాౖరెనా కాశీని సందర్శించాలనేది హిందువుల జీవితేచ్చ. 

ధార్మిక ప్రాధాన్యత 
భూగోళం అవతరించిన సమయంలో తొలి కాంతి కిరణం కాశీౖపె పడింది. అప్పటి నుంచి జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అంశాల నెలవుగా పుణ్య క్షేత్రౖమెన కాశీ పేరుగాంచింది. పురాణాలను అనుసరించి అనేక సంవత్సారాలు ప్రవాసంలో గడిపిన పరమశివుడు వారాణాసికి విచ్చేసి తన నివాసంగా మార్చుకున్నాడని ప్రతీతి. పది అశ్వాలతో కూడిన రథాన్ని దశాశ్వమేథ ఘాట్కు పంపడం ద్వారా బ్రహ్మదేవుడు బోళాశంకరునికి స్వాగతం పలికాడు.

చరిత్ర 
చరిత్ర పుట్టకముందు కాలం నుంచి దేవాలయం ఉన్నట్లుగా చెప్పబడింది. దేవాలయం ప్రాంగణంలోని భవన సముదాయాన్ని పునరుద్ధరించే నిమిత్తం 1776 సంవత్సరంలో అప్పటి ఇండోర్‌ సంస్థానపు మహారాణి అహల్యాబాయి భారీగా విరాళాలను అందించారు. దేవాలయ ఊర్థ్వభాగంలో 16 మీటర్ల ఎత్తయిన‌ కలశ గోపురాన్ని నిర్మించేందుకు లాహోర్‌ మహారాజు రంజిత్‌ సింగ్‌ 1000 కేజీల స్వర్ణాన్ని విరాళంగా ఇచ్చారని చెప్పబడింది. 1983 సంవత్సరంలో దేవాలయ నిర్వహణ బాధ్యతలను చేపట్టిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బెనారస్‌ పూర్వ పాలకుడు విభూతి సింగ్‌ను దేవాలయ ధర్మకర్తగా నియమించింది. 

పూజకు వేళాయెనే... 
ప్రతి రోజు తెల్లవారుఝామున గం 02.30 ని.లకు దేవాలయాన్ని భక్తుల సందర్శనార్థం తెరుస్తారు. ఉదయం మూడు నుంచి నాలుగు గంటల మధ్యకాలంలో జరిగే మంగళహారతికి టిక్కెట్లు కలిగిన భక్తులను అనుమతిస్తారు. అనంతరం ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు సాధారణ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మధ్యాహ్నం 11.30 నుంచి 12 గంటల మధ్య కాలంలో మధ్యాహ్న భోగ్‌ హారతిని ఇస్తారు. మరల మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు భక్తులు ఉచితంగా దర్శనం చేసుకోవచ్చు.సాయంత్రం ఏడు నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాయంకాలపు సప్త రుషి హారతిని ఇస్తారు. తర్వాత రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులు దర్శనం చేసుకోవచ్చు. వెంటనే శృంగార్‌ లేదా భోగ్‌ హారతి ప్రారంభమవుతుంది. తొమ్మిది గంటల తర్వాత వెలుపలి నుంచి దర్శనం చేసుకునే అవకాశం మాత్రమే భక్తులకు లభిస్తుంది. రాత్రి గం. 10.30 ని.లకు శయన హారతి ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటలకు దేవాలయ ద్వారాలను మూసివేస్తారు. ప్రసాదంలో అత్యధికంగా చోటు చేసుకునే పాలు, వస్త్రాలు మరియు ఇతర నైవేద్యాలు పేదవారికి అందిస్తారు. 

చేరుకునే మార్గం 
విమానం ద్వారా:
దేశంలోని ప్రధాన నగరాలు, పర్యాటక ప్రాంతాలకు వారణాసి చక్కగా అనుసంధానౖమెంది. వారాణాసి నుంచి దేశంలోని అనేక నగరాలకు ప్రతి రోజు దేశీయ విమాన సేవలు లభిస్తున్నాయి. ఢిల్లీ-ఆగ్రా-ఖజ రహో-వారణాసి రోజువారీ విమాన సేవలు పర్యాటకులలో బహుళ ప్రాచుర్యాన్ని సంపాదించుకున్నాయి.     

రైలు ద్వారా : ఉత్తర భారత భూభాగంలోని కీలక ప్రాంతంలో వారణాసి కొలుౖవె ఉండటంతో ఈ నగరం ఢిల్లీ, కోల్కతా, ముౖంబె మరియు దేశంలోని ఇతర ప్రాంతాలతో చక్కగా అనుసంధానౖమెంది. కాశీ జంక్షన్‌, వారాణాసి జంక్షన్‌ (వారణాసి కంటోన్మెంట్‌గా ప్రసిద్ధి) పేరిట రెండు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అంతేకాక ఢిల్లీ లేదా క‌ల‌క‌త్తా నుంచి బయలుదేరే రాజధాని  ఎక్స్‌ప్రెస్ రైలు వారణాసి మీదుగా ప్రయాణిస్తుంటుంది.     

రోడ్డు ద్వారా: సమతలౖమెన గంగా పీఠభూమి ప్రాంతాల్లో నెలకొనడంతో వారాణాసికి మంచి రహదారుల నెట్వర్క్‌ కలదు. ఉత్తర ప్రదేశ్లోని ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడకు తరుచుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ బస్సులు ప్రజలను చేరవేస్తుంటాయి.

Related News