tennis

ఫైనల్లో తలపడనున్న జొకోవిచ్, పోట్రో

Updated By ManamSat, 09/08/2018 - 22:32
  • మోకాలి గాయంతో తప్పుకున్న నాదల్

  • యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్  

imageన్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో నోవక్ జొకోవిచ్, జువాన్ మార్టిన్ డెల్ పోట్రో ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్ మోకాలి గాయం కారణంగా పోటీ మధ్యలో తప్పుకున్నాడు. 2009 చాంపియన్, మూడో సీడ్ డెల్ పొట్రో 7-6 (7/3), 6-2తో ఆధిక్యంతో ఉన్నప్పుడు నాదల్ రిటైర్ అయ్యాడు. దీంతో 2011, 2015 చాంపియన్ జొకోవిచ్‌తో తుది పోరుకు డెల్ పొట్రో సిద్ధమయ్యాడు. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో నోవక్ జొకోవిచ్ 6-3, 6-4, 6-2తో జపాన్‌కు చెందిన కీ నిషికోరిపై వరుస సెట్లలో గెలిచాడు. 10 ఏళ్ల ముఖా ముఖీ పోరులో డెల్ పొట్రోతో జొకోవిచ్‌కు 14-4 రికార్డు ఉంది. 2007, 2012 యూఎస్ ఓపెన్‌లలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా పొట్రోపై జొకోవిచ్ గెలిచాడు. ‘ఇప్పటి వరకు ఒక్క గ్రాండ్ శ్లామ్ ఫైనల్లోనూ మేము తలపడలేదు. పొట్రో అంటే ప్లేయర్‌గా, వ్యక్తిగా నాకు చాలా గౌరవం ఉంది. అతను చాలా మంచి వాడు. గతంలో అతను గాయాలతో సతమతమయ్యాడు’ అని గాయం కారణంగా 2017 టోర్నీకి దూరమైన జొకోవిచ్ అన్నాడు. మరోవైపు గాయం కారణంగా సెమీఫైనల్ పోరు నుంచి తప్పుకోవడంతో నాదల్ క్రుంగిపోయాడు. ‘నాకు నచ్చని పదం రిటైర్’ అని కెరీర్ ఆద్యంతం వరుస మోకాలి గాయాలతో సతమతమైన నాదల్ అన్నాడు.

 జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ సిలిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఐదో సెట్‌లో నాదల్image రిటైర్ అయ్యాడు. ‘టెన్నిస్‌లో ఒకే వ్యక్తి ఉండడు. కోర్టు అవతలి వైపు మరో వ్యక్తి ఆడతాడు’ అని నాదల్ అన్నాడు. నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను, 18వ మేజర్ టైటిల్‌ను గెలుచుకోవాలని నాదల్ భావించాడు. సెమీఫైనల్‌కు చేరుకునేందుకు 16 గంటలు ఆడాడు. క్వార్టర్ ఫైనల్లో డామ్నిక్ థీమ్‌తో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో దాదాపు ఐదు గంటలు నాదల్ పోరాడాడు. కానీ అతని శ్రమ ఫలించలేదు. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండో సెట్‌లో రిటైర్ నిర్ణయం తీసుకోకముందు రెండుసార్లు కుడి మోకాలికి బ్యాండేజ్ కట్టుకున్నాడు. ‘మ్యాచ్ ఇలా గెలవడం సరైంది కాదు. రాఫాతో ఆడటమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే టెన్నిస్‌లో అతను బిగ్ ఫైటర్. అతను బాధపడుతుంటే చూడటం నాకు ఇష్టం లేదు’ అని 29 ఏళ్ల డెల్ పొట్రో అని అన్నాడు. పొట్రోకు ఇది రెండో గ్రాండ్ శ్లామ్ ఫైనల్

నిజంగా రాఫా దురదృష్టం
‘నిజంగా రాఫా దురదృష్టకరం. కానీ అతనిపై ఉత్తుత్తమ ప్రతిభ కనబరిచినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తొలి సెట్‌లో పోరాడి గెలిచిన పొట్రో అన్నాడు. తొలి సెట్‌లో నాలుగు గేమ్‌ల తర్వాత నాదల్‌కు గాయం సమస్య మొదలైంది. ఏడో గేమ్ తర్వాత అతను తన కుడి మోకాలికి పట్టీ వేయించుకున్నాడు. తర్వాత 10వ గేమ్‌లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి డెల్ పొట్రో సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేశాడు. కానీ తొలి సెట్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లిన ఆర్జెంటీనా ఆటగాడు ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌లో మూడు గేమ్‌ల తర్వాత బ్యాండెజ్‌ను మార్చేందుకు నాదల్ మెడికల్ టైమ్ అవుట్‌ను తీసుకున్నాడు. తర్వాత పొట్రో చెమటోడ్చి నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంతో నిలిచాడు. 

మరోవైపు నాదల్ మోకాలి గాయంతో సతమతమవుతున్నాడు. మరోసారి నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పొట్రో 5-2తో నిలిచాడు. రెండో సెట్‌లో గెలుపుకు పొట్రో దగ్గరయ్యాడు. ‘నాకు ఇష్టమైన మరో గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరతానని అనుకోలేదు. 2009లో ఈ కోర్టులో నాకు చిరస్మరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. ముందుగా రాఫాను తర్వాత ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించాను. అప్పుడు నేను పిల్లాడిని. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను’ అని పొట్రో గుర్తు చేసుకున్నాడు. 

వింబుల్డన్ చాంపియన్ జొకోవిచ్ 11వ యూఎస్ ఓపెన్ సెమీఫైనల్ ఆడాడు. నిషికొరితో 17సార్లు తలపడిన జొకోవిచ్ 15వ విజయం సాధించాడు. ఈసారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిస్తే 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలిచిన పీట్ సాంప్రాస్ రికార్డును జొకోవిచ్ సమం చేస్తాడు.అక్కడ నన్ను వదిన అంటారు: సానియా

Updated By ManamTue, 08/14/2018 - 10:30

Sania Mirzaభారత్-పాకిస్థాన్ దేశాలను కలపడానికి తాను, షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోలేదని టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తెలిపింది. భారత్-పాకిస్థాన్‌లను కలపడానికి పెళ్లి చేసుకున్నామని చాలా మంది అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదని తెలిపింది. సంవత్సరానికి ఒకసారి పాకిస్థాన్‌లోని తన అత్తగారి కుటుంబాన్ని కలవడానికి వెళతానని, వాళ్లు తనపై ఎంతో ప్రేమను చూపిస్తారని, ఆ దేశం అంతా తనను వది అని పిలుస్తారని, షోయబ్ కూడా భారత్ వచ్చినప్పుడూ ఇదే జరుగుతుందని ఆమె తెలిపింది.

కాగా ప్రస్తుతం సానియా ఎనిమిది నెలల గర్భవతి కాగా, అక్టోబర్‌లో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సందర్భంగా తాను రోజూ నాలుగైదు కిలోమీటర్లు నడుస్తున్నానని సానియా చెప్పింది. గర్భం దాలిస్తే కాలుతీసి కాలు వేయకూడదని కొందరు అనుకుంటారు. ఈ ఆలోచన సరికాదు. నేను వారానికి నాలుగుసార్లు యోగా చేస్తా. మా అమ్మ చాలా ఆందోళన పడుతుంది. ఆమెను ఎలాగోలా ఒప్పించి రోజుకు నాలుగైదు కిలోమీటర్లు కూడా నడుస్తాను. టెన్నిస్ కోర్టు ఇంట్లోనే ఉన్నా. అందులోకి వెళ్లను. అందులోకి వెళితే మా అమ్మ నన్ను చంపేస్తుంది అంటూ సానియా పేర్కొంది.ఇచ్చిన హామీ నెరవేర్చలేదు

Updated By ManamMon, 07/30/2018 - 21:59
  • ఢిల్లీ ప్రభుత్వంపై కామన్‌వెల్త్ స్టార్ మనీకా అసంతృప్తి  

imageన్యూఢిల్లీ: కామన్‌వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ మనీకా బాత్రా ఢిల్లీ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. కామన్‌వెల్త్ గేమ్స్ అయిపోయి మూడు నెలలు అయినా ఢిల్లీ ప్రభుత్వం నుంచి తనకు ఒక రూపాయి రాలేదు అని మనీకా వాపోయింది.  ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడల్లో ఢిల్లీకి చెందిన మనీకా రెండు బంగారు, ఒక రజత, కాంస్య పతకాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మనీకాకు అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వం బంగారు పతకం గెలిచినందుకు రూ.14 లక్షలు(రెండింటికి కలిపి రూ.28లక్షలు), రజతానికి రూ.10లక్షలు, కాంస్యానికి రూ.6లక్షలను  ప్రకటించింది. ఐతే, మిగత రాష్ట్రాలతో పోలిస్తే పతకాలతో వచ్చిన క్రీడాకారులకు ఢిల్లీ అందించేంది చాలా తక్కువ ఉంది. బంగారు పతకం గెలిచిన హరియాణా క్రీడాకారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.1.5కోట్లు ఇవ్వగా, తమిళనాడు రూ.50లక్షలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మనీకాబత్రాకు ప్రభుత్వం అందించే ప్రోత్సహకాల్లో మార్పులు చేయాలని సూచిస్తూ క్రీడా శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. ఒక్కో బంగారు పతకానికి రూ.50లక్షల చొప్పున కోటి రూపాయలతో పాటు, రజతానికి రూ.40లక్షలు, కాంస్యానికి రూ.30లక్షలు అంటే మొత్తం రూ.1.7కోట్లు రివార్డు ఢిల్లీ ప్రభుత్వం ఆవెుకు అందిచాల్సి ఉంది.ఫెదరర్ ఔట్

Updated By ManamThu, 07/12/2018 - 00:10
  • అల్లాడించి ఓడించిన అండర్సన్

imageలండన్ః వింబుల్డన్‌లో పెను సంచలనం నమోైదెంది.  టాప్ సీడ్, వరల్డ్ నంబర్ టూ రోజర్ ఫెదరర్‌కు ఊహించని రీతిలో ఓటమి ఎదురైంది. ద క్షిణాఫ్రికా ఆటగాడు కెవిన్ అండర్స్‌న్ చేతిలో గ్రాస్‌కోర్ట్ కింగ్ ఫెదరర్ 6-2, 7-6(7-5),5-7,4-6,11-13 చిత్తయిపోయాడు.  నువ్వానేనా అన్నట్టు  నాలుగుగంటలు పైగా  సాగిన ఈ మ్యాచ్‌లో  ఫెదరర్ తొలి సెట్‌ను సునాయాసంగానే గెలుచుకున్నా.. ఆ తర్వాత అండర్సన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది.

చివరి సెట్ వరకూ ఫెదరర్‌కు చెమటలు పట్టించిన అండర్సన్ చివరకు విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టాడు.మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో  సెర్బియా స్టార్, మాజీ చాంపియన్ నోవాక్ జకోవిచ్ వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సెమీస్‌లోకి అడుగుపెట్డాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 12వ సీడ్ జకోవిచ్ (సెర్బియా) 6-3, 3-6, 6-2, 6-2తో జపాన్‌కు చెందిన 24వ సీడ్ నిషికొరిని చిత్తుచేసి దర్జాగా సెమీస్‌కు దూసుకెళ్లాడు.మూడో రౌండ్‌లో నాదల్, జొకోవిచ్

Updated By ManamThu, 07/05/2018 - 22:59

imageవింబుల్డన్: గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీ వింబుల్డన్‌లో టాప్ సీడ్ ఆటగాళ్లు రాఫెల్ నాదల్, నోవక్ జొకోవిచ్ మూడో రౌండ్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో నాదల్ 6-4, 6-3, 6-4తో కజకిస్థాన్‌కు చెందిన మిఖాయిల్ కుకుష్కిన్‌పై సునాయాస విజయం సాధించాడు. నాదల్ తన ఫస్ట్ సర్విస్‌లో 64 శాతం పాయింట్స్ సాధించాడు. అయితే 13 బ్రేక్ పాయింట్లు ఎదుర్కొన్నాడు. మరో మ్యాచ్‌లో నోవక్ జొకోవిచ్ 6-1, 6-2, 6-3తో హొరాసియో జెబల్లోస్‌ను ఓడించాడు. జొకోవిచ్ మూడో సెట్‌లో 4-3తో ఆధిక్యంలో ఉన్నప్పుడు ట్రెయినర్‌ను పిలిపించుకుని మసాజ్ చేయించుకున్నాడు. అయితే తర్వాత సర్విస్‌ను జొకోవిచ్ సునాయాసంగా నిలబెట్టుకున్నాడు. తర్వాత మరోసారి జెబల్లోస్ సర్విస్‌ను బ్రేక్ చేశాడు.

మహిళల సింగిల్స్‌లో ఏంజెలిక్ కెర్బర్ 3-6, 6-2, 6-4తో లియును చిత్తు చేసి మూడో రౌండ్‌కు చేరుకుంది. అయితే పురుషుల విభాగంలో స్టాన్సిలా వావ్రింకా ఇంటిముఖం పట్టాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో వావ్రింకా 6-7 (9), 3-6, 6-7 (8)తో ఫాబియానో చేతిలో పోరాడి ఓడాడు. మరో మ్యాచ్‌లో మారిన్ సిలిచ్ కూడా ఓటమిపాలయ్యాడు. రెండో రౌండ్‌లో సిలిచ్‌పై 3-6, 1-6, 6-4, 7-6 (7/3), 7-5తో అర్జెంటీనాకు చెందిన గిడియో పెల్లా పోరాడి గెలిచాడు.

మహిళల విభాగంలో 2014 రన్నరప్ యుజెనీ బౌచర్డ్‌కు చుక్కెదురైంది. రెండో రౌండ్ మ్యాచ్‌లో బౌచర్డ్ 4-6, 5-7తో యాష్లే బార్టి చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలైంది. కాగా పురుషుల విభాగంలో జాన్ ఇస్నెర్ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో ఇస్నెర్ 6-1, 6-4. 6-7 (6/8), 6-7 (7/3), 7-5తో బెమెల్మన్స్‌పై పోరాడి గెలిచాడు. నంబర్ వన్ నాదల్

Updated By ManamMon, 04/02/2018 - 22:20

imageస్విట్జర్లాండ్:  స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.  సోమవారం ఏటీపీ విడుదల చేసిన అధికారిక ర్యాంకింగ్స్‌లో నాదల్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన స్విస్ స్టార్ రోజర్ ఫెడరర్ మియామి ఓపెన్‌లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్ చేతిలో ఓడిపోవడంతో రెండో ర్యాంకుకు పడిపోయాడు. దీంతో నాదల్‌కు తొలి ర్యాంకు దక్కింది.    16 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సొంతం చేసుకున్న నాదల్ తొలి సారి 2008 ఆగస్టు 18న నంబర్ వన్  ర్యాంకు అందుకున్నాడు. ప్రస్తుతం నాదల్ 8770 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా ఫెడరర్ (8670)  పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో రొమేనియా క్రీడాకారిణి హాలెప్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది.జానా నవోత్నా ఇకలేరు

Updated By ManamMon, 11/20/2017 - 20:53
  • టెన్నీస్ దిగ్గజం జానా నవోత్నా కన్నుమూత

  • 1998లో వింబుల్డన్ సింగిల్స్ ఛాంపియన్

  • 16 గ్రాండ్‌శ్లామ్ డబుల్స్ టైటిళ్ల విజేత

jana

మాజీ టెన్నీస్ దిగ్గజం, వింబుల్డన్ విజేత జానా నవోత్నా కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఆమె ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 49 సంవత్సరాలు. ఆమె మరణాన్ని ప్రపంచ టెన్నీస్ సమాఖ్య ధృవీకరించింది. 1998లో ఆమె వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచారు. తన కెరీర్‌లో 16 గ్రాండ్‌శ్లామ్ డబుల్స్ టైటిళ్లను ఆమె గెలిచారు. అంతర్జాతీయ వేదికలపై 100కు పైగా టైటిళ్లను గెలిచారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన జానా నవోత్నా మరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నీస్ క్రీడాభిమానులు శోఖసంద్రంలో మునిగిపోయారు. 

Related News