tollywood news

మగవారు రెస్పాన్సిబుల్‌గా ఉండాలి

Updated By ManamSun, 07/22/2018 - 00:14

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తాము కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నామని ప్రకటించుకున్నారు. మరో వైపు కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి వంటి వారు పోరాటం చెయ్యడానికి సిద్ధమయ్యారు.

kajal


ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ ‘‘నా వరకు నేను ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ బారిన పడలేదు. అసలు ఇండస్ట్రీలో అది ఉందో లేదో కూడా నాకు తెలీదు. నిజానికి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చించుకుంటున్నారని కూడా నాకు తెలీదు. అయినప్పటికీ దీని గురించి నాకు తోచిన సలహా ఇస్తాను. కాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మాయిల్ని సేఫ్‌గా ఉండమని చెప్పేకంటే, మగవారు మరింత రెస్పాన్సిబుల్‌గా ఉండేలా చేయాలి. ఇలాంటి పనులు చేయకూడదని చిన్నప్పట్నుంచే అబ్బాయిలకు నేర్పించాలి. ఇది ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి’’ అంటోంది. మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా...

Updated By ManamSun, 07/22/2018 - 00:03

హీరోగా చేసిన టైమ్ అయిపోయింది.. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించాల్సిందే అని అందరూ అనుకుంటున్న తరుణంలో imageప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేసిన ‘పిఎస్‌వి గరుడవేగ 126.18 ఎం’ సినిమాతో సక్సెస్ సాధించారు హీరో రాజశేఖర్. సక్సెస్ తర్వాత వెంటనే సినిమాలు చేసేయకుండా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు రాజశేఖర్.

  అందులో భాగంగా దర్శకుడు ప్రశాంత్‌వర్మతో ఓ సినిమా చేయబోతున్నారు. ‘అ!’ సినిమా తర్వాత  ప్రశాంత్‌వర్మ ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజశేఖర్‌తో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చేస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. 1970 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడవుతాయి.అది ఏ రంగానికైనా వర్తిస్తుంది

Updated By ManamSat, 07/21/2018 - 01:50

imageమహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి మనం తరచూ వింటూ వుంటాం. ఈమధ్యకాలంలో సినిమా రంగంలో అలాంటి వేధింపులు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం గురించి హీరోయిన్ అమలా పాల్ మాట్లాడుతూ ‘‘సినిమా రంగంలో రాణించాలంటే మానసిక ధైర్యం చాలా అవసరం. అలా లేని వారు ఇక్కడ ఏమీ సాధించలేరు. మహిళలపై వేధింపులు అనేవి కేవలం సినిమా రంగంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పడం సరికాదు. అన్ని రంగాల్లోనూ ఏదో ఒక రూపంలో ఈ వేధింపులు ఉంటాయి. ఆ సమయంలో మహిళలు ధైర్యంగా ఉండాలి.  ముఖ్యంగా సినిమాల్లోకి రావాలనుకునే వారు ఇది గుర్తుపెట్టుకోవాలి. ధైర్యం లేకపోతే మీరు అనుకున్నది సాధించడం జరగదు. ఏ రంగంలో ఉన్నవారికైనా అది వర్తిస్తుంది.

image


అందుకే ఎప్పడూ ధైర్యాన్ని వీడిపోవద్దు. మన నిర్ణయం మీద నిలబడి ఉండడం, మన మనసులోని భావాలను నిస్సంకోచంగా చెప్పడం నేర్చుకోవాలి. అలా చేస్తే ఏ సమస్యనైనా ఎదిరించగలం, దానిపై పోరాటం చెయ్యగలం’’ అంటూ మహిళలకు ధైర్యాన్ని చెబుతోంది అమల.ఆ టైమ్‌లో కథలు వినను

Updated By ManamSat, 07/21/2018 - 01:45

‘కోహినూర్’ అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది శ్రద్ధా శ్రీనాథ్. కన్నడ చిత్రం ‘యూటర్న్’ ఆమె కెరీర్‌కి బిగ్ టర్నింగ్ పాయింట్ అయింది. ఆ తర్వాత తమిళంలో చేసిన ‘విక్రమ్ వేదా’ మరింత పేరు తెచ్చింది. మణిరత్నం దర్శకత్వంలో ‘కాట్రు వెలియిడై’ చిత్రంలోనూ అతిథి పాత్ర చేసిన శ్రద్ధాకు అరుళ్‌నిధితో రొమాన్స్ చేసే అవకాశం వచ్చింది.

image


భరత్ నీలకంఠన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో తనకు అవకాశం వచ్చిన క్రమాన్ని వివరిస్తూ ‘‘భరత్ కథా చర్చలకు బెంగళూర్ వచ్చారు. అనుకోకుండా ఒక రోజు ఆయన నుంచి నాకు ఫోన్ వచ్చింది. సాధారణంగా నేను రాత్రి సమయంలో కథలు వినను. కానీ, భరత్ బెంగళూరు వచ్చిన కారణంగా ఆ సమయంలోనే కథ వినాల్సి వచ్చింది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ దర్శకుడు కథను వినిపించారు. కథలోని ప్రతి సన్నివేశాన్ని ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్పడంతో అప్పుడే నాకు ఈ చిత్రంలో నటించాలన్న ఆసక్తి కలిగింది. ఇంటెలిజెన్సీ నేపథ్యంలో సాగే ఓ డిఫరెంట్ సినిమా ఇది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్ పోస్టరను విడుదల చేస్తారు.దీపికా పదుకొనే తర్వాత సాయేషా

Updated By ManamThu, 07/19/2018 - 00:17

imageకార్తీ హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కడైకుట్టి సింగం’ చిత్రంతో కోలీవుడ్‌లో విజయాన్ని అందుకుంది. ‘చినబాబు’ పేరుతో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. సాయేషా నటించిన తొలి చిత్రం ‘వనమగన్’ ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయితే నటిగా ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ పేరు వల్లే కడైకుట్టి సింగం చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత విజయ్ సేతుపతితో నటించిన ‘జుంగా’, ఆర్యతో జతకట్టిన ‘గజనీకాంత్’ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ఇవికాక మరో అరుదైన సినిమా చేసే అవకాశం సాయేషాకు లభించింది. ఐసరి గణేశ్ వేల్స్ ఫిలింస్, ప్రభుదేవా స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘కిళక్కు ఆఫ్రికావిల్ రాజు’ చిత్రంలో నటిస్తోందని సమాచారం. ఎంజీఆర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన ‘ఉలగం చుట్రు వాలిబన్’ చిత్రం తరువాత ఆయన దానికి సీక్వెల్ చేయాలని ఆశించారు. అయితే అందుకు సమయం అనుకూలించకపోవడంతో దాన్ని ఇప్పుడు యానిమేషన్ చిత్రంగా నిర్మిస్తున్నారు. image

అదే ‘కిళక్కు ఆఫ్రికావిల్ రాజు’. ఇందులో ఎంజీఆర్, జయలలిత పాత్రలను యానిమేషన్‌లో రూపొందిస్తున్నారు దర్శకుడు అరుళ్‌మూర్తి. అయితే కొంతమంది నటీనటులు కూడా ఇందులో నటిస్తుండడం విశేషం. అలా సాయేషా సైగల్‌కు ఈ సినిమాలో  ఓ ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. ఆమె పాత్రను రజనీకాంత్ నటించిన ‘కోచ్చడైయాన్’ చిత్రంలో దీపికా పదుకొనే పాత్రలా యానిమేషన్‌లో రూపొందిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ ఇటీవల జరిగింది.పెదవి దాటని మాటొకటుంది

Updated By ManamWed, 07/18/2018 - 23:43

imageఫిల్మ్ మాంక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘పెదవి దాటని మాటొకటుంది’. అదితి, టి.జి. కీర్తి కుమార్ నిర్మాతలు. టి.గురుప్రసాద్ దర్శకుడు. రావన్ రెడ్డి, పాయల్ వాద్వా, డా. వి.కె.నరేశ్, మొయిన్, మౌరిస్ సడిచె, నందు కుమార్, మోహన్ భగత్, ప్రియాంక శుక్ల కీలక పాత్రధారులు. ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు టి.గురుప్రసాద్  మాట్లాడుతూ ‘‘నారాయణలో గోడలు దూకి సినిమాలు చూసే మేం ముగ్గురం (హీరో, సంగీత దర్శకుడు) ఈ సినిమా చేశాం.

నేను ఏం చెప్పినా మా వాళ్లు నమ్మి మాతో ఉన్నారు. మా నిర్మాతలు నాకు అమ్మానాన్నల్లాంటివారు. 30 రోజుల్లో సక్సెస్‌ఫుల్‌గా సినిమాను పూర్తి చేశాం. 75 సీన్లు, నాలుగు పాటలుంటాయి. ఇందులో నరేశ్‌గారి పాత్ర చాలా స్పెషల్. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. హీరోయిన్ పాయల్ వాద్వా మాట్లాడుతూ ‘‘మాది ఢిల్లీ. ఈ సినిమా  యూనిట్ మొత్తం చాలా ఓపిగ్గా నాతో పనిచేయించుకున్నారు. మంచి సినిమా అవుతుంది’’ అన్నారు. హీరో రావన్ రెడ్డి మాట్లాడుతూ ‘‘దర్శకుడు మా ఫ్రెండ్ అనడం కన్నా.. తనకేం కావాలో తెలిసిన వ్యక్తి. కెమెరామేన్, ఎడిటర్... ఇలా అందరూ కలిసి ఈ సినిమా కోసం కృషి చేశారు. మా నిర్మాతలు మా కన్నా నన్ను ఎక్కువగా నమ్మారు. మేం అందరం కలిసి హిట్ సినిమాకు పనిచేశాం’’ అన్నారు.

నిర్మాత టి.జి . కీర్తి కుమార్ మాట్లాడుతూ ‘‘జెన్యూన్ టీమ్ చేసిన కృషి ఇది. ఐదేళ్లుగా మా టీమ్ అందరం కలిసి ట్రావెల్ చేస్తున్నాం. ఫాంటసీ రొమ్ కామ్ సినిమా ఇది. సేమ్ టీమ్‌తో ఇంకో సినిమా చేస్తాం. త్వరలోనే ప్రారంభిస్తాం. ఇందులో మా దర్శకుడు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు’’ అని చెప్పారు. నిర్మాత అదితి మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీలాగా అందరం కలిసి పనిచేశాం. ఏడాది కష్టపడి చేసిన సినిమా ఇది’’ అన్నారు. సంగీత దర్శకుడు మాట్లాడుతూ ‘‘హీరో, నేను, దర్శకుడు నెల్లూరు నుంచి ఫ్రెండ్స్. కలిసి ఈ సినిమా చేశాం. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. శ్రీదేవి పాత్రలో రకుల్?

Updated By ManamTue, 07/17/2018 - 23:50

మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆయన భార్య బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు. ఆమె తెలుగు సినిమాలో నటించడం ఇదే తొలిసారి. ఆమెతో పాటు ఈ సినిమాలో పలువురు నాయికలు తళుక్కుమననున్నారు. ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రిగా కీర్తి సురేశ్ నటించనున్నారని వినికిడి.

image


ఇదిలా ఉండగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో రకుల్ జాయిన్ అయిందట. అయితే రకుల్ చేయదగ్గ పాత్ర ఏంటన్నది ప్రస్తుతం సస్పెన్స్ అని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ పక్కన పలు సినిమాల్లో నటించిన శ్రీదేవి పాత్రలో రకుల్ యాక్ట్ చేస్తున్నట్టు కొందరి అనుమానం. అదే నిజమైతే శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆమె పాత్రలో నటిస్తోన్న తొలి నటి రకుల్ అవుతుంది.

క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ఆకాంక్షతో క్రిష్ స్పీడ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మణికర్ణిక’ మరోవైపు విడుదలకు సిద్ధంగా ఉంది. రెండో షెడ్యూల్‌లో ‘ముద్ర’

Updated By ManamTue, 07/17/2018 - 23:45

నిఖిల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ముద్ర’. టి.ఎన్.సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో నిఖిల్, లావణ్య త్రిపాఠిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
image
ఒక టీవీ స్టూడియోలో
షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, సత్య, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఫేక్ సర్టిఫికేట్స్‌కు సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో టచ్ చేస్తున్నారు. అంతకు మించి ఆశించను

Updated By ManamTue, 07/17/2018 - 23:45

imageమహానటి సావిత్రి పాత్రను అత్యద్భుతంగా పోషించి అందరి ప్రశంసలు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కీర్తికి ఇప్పుడు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. ఇక తమిళ చిత్ర పరిశ్రమ కీర్తిని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఈ సినిమా తర్వాత ఆమె తన పారితోషికాన్ని కూడా బాగా పెంచేసిందని తెలుస్తోంది.

 ఈ విషయంపై కీర్తి సురేష్ స్పందిస్తూ ‘‘కేవలం డబ్బు సంపాదించడానికి నేను సినిమాల్లోకి రాలేదు. నటిగా మంచి పేరు తెచ్చుకోవాలి, అందరికీ గుర్తుండిపోయే పాత్రలు చేయాలి. ఇదీ నా ఆలోచన. హీరోయిన్‌గా డిమాండ్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలి అని అంటూంటారు. కానీ, నేను దాన్ని నమ్మను. మనం చేసిన పనికి తగిన ప్రతిఫలం వస్తే చాలు. అంతకుమించి నేను ఆశించను. నటనకే ప్రాధాన్యమిస్తాను తప్ప పారితోషికానికి కాదు’’ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళ సినిమాల్లోనే ఎక్కువ నటిస్తోంది. విక్రమ్‌తో ‘స్వామి స్క్వేర్’, విజయ్‌తో ‘సర్కార్’, విశాల్‌తో ‘సండైకోళి 2’ చిత్రాలు చేస్తోంది.లేడీ డాన్ నమిత

Updated By ManamThu, 07/12/2018 - 01:40

imageవిభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడైన టి.రాజేందర్ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘ఇన్నైయ కాదల్ డా’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టి.రాజేందర్ చేపడుతున్నారు.

‘‘ఈ సినిమాలో నమిత లేడీ డాన్‌గా నటించనుంది. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. అలాగే కొంతమంది కొత్తవారిని కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. పూర్తి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటి ట్రెండ్‌కి తగినట్టుగా సినిమాలో ప్రేమ తప్ప మరో అంశం కనిపించదు. ఇలాంటి సినిమాలో లేడీ డాన్ పాత్ర ప్రాధాన్యం ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్ పిక్చర్స్ టి.ఫరూక్ వ్యవహరిస్తున్నారు.

Related News