fire

23కు చేరిన కాలిఫోర్నియా మృతులు

Updated By ManamSun, 11/11/2018 - 23:24

fire ప్యారడైజ్:  కాలిఫోర్నియాలో చెలరేగుతున్న కార్చిచ్చు విశ్వరూపం చూపుతోంది. మంటలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. దీంతో ఒక ఊరు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 23కి చేరింది. శుక్రవారం చెలరేగిన కార్చిచ్చు ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికితీస్తున్నారు. ఈ ప్రమాదం ధాటికి సుమారు లక్ష ఎకరాల అడవి అగ్నికి ఆహుతైంది. ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే దాదాపు 15వేల ఎకరాల మేర అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.‘ బలమైన గాలి వీస్తుండటం కారణంగా కార్చిచ్చు మరింత వ్యాపించింది. 3,200మంది సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. 6,700 భవనాల వరకు మంటల్లో చిక్కుకున్నాయి. పరిస్థితి చక్కబడటానికి సుమారు మూడు వారాలు పట్టవచ్చు. కార్చిచ్చు రేగిన ప్రాంతంలో ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా ఆపేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది’ అని ఓ అధికారి తెలిపారు.అవెురికా బార్‌లో కాల్పులు

Updated By ManamFri, 11/09/2018 - 01:40
  • పొగబాంబు వేసి హ్యాండ్‌గన్‌తో కాల్పులు

  • 13 మంది మృతి... పలువురికి గాయాలు

  • క్షతగాత్రులలో పోలీసు.. ఆస్పత్రికి తరలింపు

america-fireథౌజండ్ ఓక్స్ (అవెురికా): అవెురికాలో మరోసారి తుపాకి సంస్కృతి రెచ్చిపోయింది. దక్షిణ కాలిఫోర్నియాలో జనంతో కిటకిటలాడుతున్న ఓ బార్‌లో నిందితుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మరణించారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో కాల్పులు జరిపిన దుండగుడు కూడా మరణించాడు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు సైతం మరణించినట్లు వెంచురా కౌంటీ షెరిఫ్ ఆఫీసు కెప్టెన్ కురెడ్జైన్ తెలిపారు. అవెురికా కాలమానం ప్రకారం రాత్రి 11.20 గంటల సమయంలో థౌజండ్ ఓక్స్ నగరంలోని బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్‌లో కాల్పులు మొదలైనట్లు తెలిసిందన్నారు. ఈ నగరం లాస్ ఏంజెలిస్‌కు పశ్చిమంగా 40 మైళ్ల దూరంలో ఉంటుంది. పోలీసులకు విషయం తెలిసి అక్కడకు వెళ్లేసరికి ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో కాల్పులు జరిపిన దుండగుడు సహా 13 మంది మరణించగా ఇంకా చాలామందికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముందుగా పొగబాంబులు విసిరిన నిందితుడు.. ఆ తర్వాత హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు ఏబీసీ న్యూస్‌కు తెలిపారు. కనీసం 30 రౌండ్లు అతడు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. బార్ వద్ద ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ వాళ్లంతా ఒక పార్టీ ఏర్పాటుచేసుకోవడంతో ఎక్కువ సంఖ్యలో యువతీ యువకులే అక్కడకు చేరుకున్నట్లు స్థానిక మీడియా వర్గాల ద్వారా తెలుస్తోందికోహ్లీపై మండిపడుతున్న నెటిజన్లు

Updated By ManamThu, 11/08/2018 - 12:23

Virat Kohliటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇందుకు అతడు ఇటీవల మాట్లాడిన మాటలే కారణం అయ్యాయి. కోహ్లీ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అతడి పేరు మీద ఉన్న ఓ యాప్‌ను ఇటీవల విడుదల అయ్యింది. అందులో తన అభిమానుల నుంచి వచ్చిన సందేశాలను చదువుతున్న కోహ్లీ వాటికి సమాధానం ఇచ్చాడు.

అందులో ఓ నెటిజన్.. ‘‘ఓవర్ రేటెడ్ బ్యాట్స్‌మన్.. అతడి బ్యాటింగ్‌లో నేనేం కొత్తదనం చూడలేదు. భారత ఆటగాళ్ల కంటే ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్‌ను నేను బాగా ఇష్టపడతా’’ అంటూ కోహ్లీని ఉద్దేశించి కామెంట్ పెట్టాడు. దానికి కోహ్లీ స్పందిస్తూ.. ‘‘నువ్వు ఇండియాలో నివసించేందుకు అనర్హుడవని భావిస్తున్నా. నువ్వు ఎక్కడికైనా వెళ్లు. మన దేశంలో ఉంటూ పక్కవాళ్లను ఇష్టపడుతున్నావు. నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేనేం బాధపడను. ఇతర దేశాలను అభిమానించేటప్పుడు నువ్వు మన దేశంలో ఉండాల్సిన అవసరం లేదు’’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలు ఆ తరువాత వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు.

‘‘ఇండియన్‌ టీమ్‌కు కెప్టెన్ అయినంత మాత్రాన సాటి ఇండియన్ దేశం వెళ్లిపొమ్మనే అధికారం కోహ్లీకి లేదు’’.., ‘‘కోహ్లీ దూకుడును తగ్గించుకో’’.. ‘‘కోహ్లీ నీ నుంచి ఇలాంటి సమాధానం ఊహించలేదు’’.. ‘‘అభిమానించాల్సిన బాధ్యత నీ మీద ఉందని మర్చిపోకు’’ అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై హీరో సిద్ధార్థ్ కూడా స్పందించాడు. ‘‘నువ్వు ఎప్పటికీ కింగ్ కోహ్లీ లాగే ఉండాలనుకుంటే కాలం నీకు ఏదో విధంగా సమాధానం చెప్తుంది. భవిష్యత్‌లో ఎలా మాట్లాడాలి? అన్న విషయంపై ద్రవిడ్ ఏం చెప్పాడు అని నువ్వు ఆలోచించేలా చేస్తుంది. ఒక భారత కెప్టెన్‌ను నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం’’ అంటూ కామెంట్ పెట్టాడు.భార్య, ఆమె ప్రియుడికి నిప్పంటించిన భర్త

Updated By ManamWed, 07/04/2018 - 15:05
man lighting house on fire

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని జీర్ణించుకోలేని భర్త ...వారిద్దరు కలిసి ఉండగా నిప్పు అంటించాడు. ఈ ఘటనలో భార్య, ఆమె ప్రియుడు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన ముత్తుకూరు మండలం కోళ్లమిట్టలో జరిగింది. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...కోళ్లమిట్టకు చెందిన హరిబాబుకు అయిదేళ్ల క్రితం కవితతో వివాహం జరిగింది. అయితే మరోవ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆమెను భర్త మందలించాడు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి.

ఇదే విషయమై హరిబాబు... పెద్దల మద్య పంచాయితీ పెట్టినా కవిత తీరులో మార్పు రాలేదు. ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. హరిబాబు లేని సమయంలో ప్రియుడు ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని పసిగట్టిన అతడు  బయట నుంచి గొళ్లెం పెట్టి, పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో కవితో పాటు ఆమె ప్రియుడు సజీవదహనం అయ్యారు.అది వారి తరం కాదు: చంద్రబాబు

Updated By ManamFri, 05/11/2018 - 13:02

Babu అమరావతి: ఈ సారి టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజకీయ అంశాలు, పాలనా వ్యవహారంపై నేతలకు దిశా నిర్దేశం చేసిన చంద్రబాబు.. తనతో సహా ప్రతి ఒక్కరూ పనితీరును సమీక్షించుకోవాలని అన్నారు. ఇప్పటికీ కొందరు అధికారుల తీరు ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. 

పాలనలో అధికారులు పొరపాట్లు చేస్తే పోయేదేమీ ఉండదని కానీ మనకు మాత్రం ఐదేళ్లకోసారి పరీక్ష ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఇక 15 ఏళ్ల తరువాత బీజేపీ నేతలు ఏదో చేసేస్తామని చెబుతున్నారని, టీడీపీని కేంద్రం, బీజేపీ ఏమీ చెయ్యలేవని, అది వారి తరం కాదు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 ‘అల్లా హు అక్బర్’ అని అరుస్తూ ప్రజలపై కాల్పులు

Updated By ManamFri, 03/23/2018 - 18:23

fireఫ్రాన్స్, మార్చి 23: ఫ్రాన్స్‌‌లోని ఓ సూపర్‌మార్కెట్‌లో ఉగ్రవాది ‘అల్లా హు అక్బర్.. మిమ్మల్ని నేను చంపేస్తానని’ బిగ్గరగా కేకలు వేస్తూ జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. దాదాపు 10మందికి పైగా గాయపడ్డారు. కార్కసోన్‌లోసి సూపర్‌మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఊహించని ఈ ఉగ్ర దాడితో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ వ్యక్తి 11.15నిమిషాలకు సూపర్‌మార్కెట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లండన్ వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ సెంటర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఫ్రెంచ్ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ ఫిలిప్ దీన్ని ఉగ్రదాడిగా ప్రకటించారు.పవన్.. కాపులకు ద్రోహం చేయొద్దు..!

Updated By ManamWed, 03/21/2018 - 08:54

పవన్.. కాపులకు ద్రోహం చేయొద్దు..!

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై ఇప్పటికే ఓ వైపు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్‌‌పై ఏపీ కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వర్‌ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన..పవన్ కల్యాణ్ ఈ క్రింది విజ్ఞప్తి చేశారు. "బీజేపీ హామీలు మరచిన విధానం చూడగానే తెలుగువారికి ఒళ్లు కంపరం పుడుతున్న దశలో..బీజేపీ భావాలకు వకాల్తా పుచ్చుకుని కాపు సామాజిక వర్గానికి ద్రోహం తలపెట్టవద్దు. ఇప్పటికే కాపు సామాజిక వర్గం సినీ నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి చేతుల్లో తీవ్ర నష్టాలకు గురైంది. పవన్‌ కల్యాణ్‌ రూపంలో మరో చిరంజీవి నాటి పరిస్థితులకు కాపు సామాజిక వర్గం గురైతే, సభ్య సమాజంలో మరో పాతికేళ్ల వరకూ తలెత్తుకు తిరగలేని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తోంది. ఈ దుస్థితిని కాపు సామాజిక వర్గానికి కల్పించవద్దు" అని పవన్‌ కల్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబుకు కృతజ్ఞతలు..!
ఏపీ హక్కుల సాధనకు పోరాటం చేస్తోన్న సీఎం చంద్రబాబు నాయుడికి ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు పోరాటాన్ని బలహీనపరిచే ఏ చర్య అయినా..కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని గట్టిగా భావిస్తున్నామని ఆయనస్పష్టంచేశారు.చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచవలసిన తరుణంలో పవన్‌ కల్యాణ్‌ వ్యవహార శైలి కాపులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని వెల్లడించారు.టాలీవుడ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ ఫైర్

Updated By ManamTue, 03/20/2018 - 14:33

TDP MLC Rajendra Prasad Fire On Tollywood Over AP Special Status

అమరావతి: టాలీవుడ్‌‌పై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ఎందుకు ఇవ్వరు? అంటూ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమిళ నటుల్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలంటూ టాలీవుడ్‌పై నిప్పులు చెరిగారు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళ నటులే అన్న సంగతి మీకు తెలుసా? తెలియదా? అంటూ ఆయన సూటి ప్రశ్న సంధించారు. ఏసీ రూముల్లో ఉంటూ ప్రజల సమస్యలను పట్టించుకోరా? అంటూ మండిపడ్డారు ఎమ్మెల్సీ. మీరు హాలీవుడ్ స్థాయి నటులు కాదని.. హీరోయిన్ వెంటపడే క్యారెక్టర్లకే పనికొస్తారని రాజేంద్రప్రసాద్ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఏజ్ బార్ అయిన నటులూ.. మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆయన మాటల్లోనే..
"టాలీవుడ్‌కు చెందినటువంటి ఆంధ్రా కళాకారులు రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకు పాల్గొనడం లేదు. జల్లికట్టు ఉద్యమాన్ని నడిపింది తమిళ నటులు.. అగ్ర హీరోలు కాదా?.. మరి టాలీవుడ్ నటులకు ఏమైంది?. టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏమైంది..? ఏం మాయరోగం దాపరించింది?. చావ చచ్చిపోయిందా?. మేం టికెట్ల రూపంలో చెల్లించే వందల కోట్ల రూపాయిల కనక వర్షం మత్తులో మీరు మునిగిపోయారా? ఆ మత్తులో నుంచి మీరు బయటికి రారా?. చివరికి పక్కరాష్ట్రంలోని మన సోదర రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కుటుంబం అంతా మద్దతు పలికారు. మీరు కూడా అదే తెలంగాణలోనే ఉన్నారు కదా.? అక్కడే బానిస బతుకులు బతుకుతున్నారు?" అని రాజేంద్రప్రసాద్ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.

తన్ని తరిమేస్తారని భయమా?
మా ఆంధ్రోళ్లకు మద్దతు పలికితే మీ ఆస్తులు లాక్కుని తన్ని తరిమేస్తారని మీకు భయమా? భయముందా?. సీఎం కేసీఆరే మద్దతి పలికారు కదా అలాంటప్పుడు మీకు ఆ భయమెందుకు?. మీ సినిమాల టికెట్లు కొనడానికి.. కోట్ల రూపాయిలు కురిపించడానికి.. అవార్డులివ్వడానికేనా?. ఎవరికైనా అవార్డులు రాకపోతే లొల్లి.. లొల్లిపెట్టేస్తారు అదేదో భూమి, ఆకాశం బద్ధలైపోయినట్లు ట్వీట్స్.. రిట్వీట్స్.. ఫేస్‌బుక్ పోస్ట్‌లు, ఇంటర్వ్యూలు.. తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లిబుచ్చితారే.. మన ఆంధ్రకు రివార్డులు, నిధులు రావట్లేదు అవన్నీ మీ చెవులకు ఎక్కట్లేదా?. మీ కళ్లకు కనపడట్లేదా?. మీరు ఏసీ రూముల్లో కులుకుతూ కూర్చుంటారా?. ఇంతకంటే ఇంకా కఠినంగా మాట్లాడగలను కాకపోతే సంస్కారం నాకు అడ్డొస్తోంది" అని తీవ్ర ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇప్పటికైనా బయటికి రండి..
"ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు.. బయటికి వచ్చి ఆంధ్రా ప్రజల తరఫున మీ గళం విప్పండి. మీరు మాట్లాడకపోతే మా ఐదు కోట్ల ఆంధ్రా ప్రజలు మీ సినీ పరిశ్రమ కళాకారుల్ని వెలివేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇందులో నో డౌట్!." అని ఆయన చెప్పుకొచ్చారు.అర్ధరాత్రి మావోల బీభత్సం

Updated By ManamTue, 03/06/2018 - 08:04

Busఛత్తీస్‌గఢ్‌: ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా డోర్నపాల్ మండలం కుత్తిలో ఆర్టీసీ బస్సుతో పాటు ఓ ప్రైవేట్ బస్సు, టిప్పర్, ట్రాక్టర్‌ను మావోయిస్టులు తగలబెట్టారు. అయితే అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ క్యాంపుకు తరలించారు.భారీ అగ్ని ప్రమాదం.. దగ్ధమైన బైక్‌‌లు

Updated By ManamSun, 02/11/2018 - 12:32

fire accident in nampally showroomహైదరాబాద్: నాంపల్లి బజార్‌ఘా‌ట్లోని హోండా షోరూంలో భారీ అగ్రిప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ఒక్కసారిగా షోరూం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ భారీ మంటలకు షోరూంలోని పలు బైక్‌లు దగ్ధమయ్యాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలు ఆర్పారు. అయితే అప్పటికే పలు వాహనాలు దగ్ధమైపోయాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని యజమాని చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News