MS Dhoni

మెంటర్‌గా మారిన ధోనీ

Updated By ManamTue, 09/18/2018 - 23:52

imageవన్డే జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసి చాలా కాలం అయినప్పటికీ ఆసియా కప్ మ్యాచ్‌ల సందర్భంగా జట్టు సహచరులకు మహేంద్ర సింగ్ ధోనీ సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రమే కాదు జట్టులోని మిగతా సభ్యులు కూడా ధోనీని మెంటర్‌గా (గురువుగా) భావిస్తున్నారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి లేని కారణంగా హాం కాంగ్‌తో మ్యాచ్‌కు నెట్ ప్రాక్టీస్‌లో ధోనీ మెం టర్‌గా వ్యవహరించాడు. శాస్త్రితో పాటు ఇత ర సపోర్ట్ స్టాఫ్ ఇంకా యూఏఈ చేరుకో కపోవడంతో ధోనీ ఈ బాధ్యతలు చేపట్టాడు. ఆసియా కప్‌లో భారత బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ కోసం ఇండియా-ఎ బౌలర్లు అవేశ్ ఖాన్, ఎం. ప్రసిద్ధ్ క్రిష్ణ, సిద్ధార్థ్ కౌల్, షాబాజ్ నదీమ్, మయాంక్ మార్కండేలను బీసీసీఐ యూఏఈకి పంపింది.ధోనీయే జట్టును నడిపించాలి

Updated By ManamSat, 09/15/2018 - 22:04
  • ఆసియా కప్ క్రికెట్  

భారత క్రికెట్ ప్రస్తుతం అసౌకర్యంగా ఉంది. ఇంగ్లాండ్ చేతిలో 4-1తో టెస్టు సి రీస్ ఓటమి మరక టీమిండియాను ఇప్ప ట్లో వదిలేలా లేదు. అయినప్పటికీ ఎడతెరి పిలేని షెడ్యూల్ కారణంగా అధికారులు ఓవర్‌టైమ్ వర్క్ చేయక తప్పడం లేదు. ఆసియా కప్ కోసం యువకులతో కూడిన టీమిండియా యూఏఈ వెళ్లింది. సుదీర్ఘ మూడు నెలల ఇంగ్లాండ్ పర్యటన అనం తరం లభించిన మూడ్రోజుల విశ్రాంతిని భారత క్రికెటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. మంగళవారం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఉన్నందున కోచింగ్ స్టాఫ్ ఆదివారం దు బాయ్‌కు వెళ్లనుంది. గత రెండేళ్లుగా టీ మిండియా వరుస సిరీస్‌లు ఆడుతోంది. దీంతో జట్టుకు మంచి ఆటగాళ్లను అం దించడంలో టీమ్ మేనేజ్‌మెంట్ నలిగి పోతోంది. తగినంత శిక్షణ ఇచ్చి పెద్ద టోర్నీల కోసం వారిని పరిరక్షిస్తోం ది. ప్రస్తుతం 10 మంది సెలెక్టెడ్ ప్లేయర్స్, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు చెందిన ఆరుగురు బౌలర్లు, ఫిజియో పాట్రిక్ ఫర్హార్ట్ దుబాయ్‌లో కసరత్తులు చేస్తున్నారు. 

image


కోహ్లీ లేని లోటు పాక్‌కు లాభం
రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేని లోటు ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తమకు అనుకూ లంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఆసియా కప్‌కు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ వైట్ బాల్ టోర్నీలో తన కెప్టెన్సీ ప్రతిభకు రోహిత్ శర్మ పదును పెట్టే పనిలో ఉన్నప్పటికీ అందరి దృష్టి సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై పడింది. 

ధోనీవైపు టీమ్ మేనేజ్‌మెంట్ చూపు
ఇంగ్లాండ్ పర్యటనలో విఫలమైన, రాణించలేక పోయిన వారి ఆసియా కప్‌లో నడిపించే బాధ్యత ధోనీపై పడింది. జట్టులోని సభ్యులు, టీమ్ మేనేజ్ మెంట్ కూడా ధోనీవైపే చూస్తోంది. ధోనీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని.. యావత్ జట్టు బా ధ్యత అతను చేపడతాడని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెందిన ఓ అధికారి చెప్పడం చూస్తుంటే వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో మాజీ కెప్టెన్‌పై చాలా పెద్ద బాధ్యతనే పెట్టినట్టు కని పిస్తోంది. వన్డే జట్టు కెప్టెన్సీని ధోనీ రాజీనామా చేసి 18 నెలలు గడిచినా అతని ఎత్తుగడలు, వ్యూహాల కోసం టీమ్ మేనేజ్‌మెంట్, యువ క్రికెటర్లు ఎదురు చూస్తున్నారని చెప్పక తప్పదు.

జట్టును గెలిపించే బాధ్యతను ధోనీ ఒక్కడిపై వేయడం సరైంది కాక పోయినప్పటికీ ఈ టోర్నీలో అతను మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడా? అన్న అనుమానాలూ తలెత్తు తున్నాయి. ఈ ప్రశ్నకు అవుననే చెప్పాల్సి ఉంటుం ది. లార్డ్స్‌లో టీమిండియా అహం దెబ్బతినేలా అభి మానుల వెక్కిరింతలు ధోనీ ఇంకా మర్చిపోలేదు. ధోనీ అండతో టీమిండియా స్థిరంగా రాణించే అ వకాశముంది. ఒక్కసారి అతను ఫామ్‌లోకి వచ్చా డంటే టీమిండియా ఎనలేని ఆనందాన్ని సొంతం చేసుకుంటుంది. 

నిజానికి వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా చాలానే సమయం ఉంది. అంతలోపు చాలా మ్యాచ్‌లే టీమిండియా ఆడుతుంది. అయినప్పటికీ ఆసియా కప్‌లో వరల్డ్ కప్ విన్నింగ్ కాంబినేషన్‌ను తయారు చేసుకోవాలని టీమిండి యా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ఈ కాంబి నేషన్ అంశం కూడా ధోనీ చుట్టూనే తిరుగుతోంది. ధోనీ వారసుడు దినేష్ కార్తీక్ అని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో, కీపింగ్‌లో అద్భుత ప్రతిభ కన బరిచినప్పటికీ అతడిని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్‌కు ముందు ప్రయోగా లు చేసేంత సమయం లేదని మేనేజ్‌మెంట్ భావి స్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌కు విన్నింగ్ టీమ్ ను తయారు చేసుకోవాలంటే ధోనీకి కావల్సినంత సమయం ఇవ్వాలి. అందుకు అతడు ఎక్కువ సేపు క్రీజులో ఉండాలి. అతను దేశవాళీ క్రికెట్ కూడా ఎక్కువగా ఆడలేదు. కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో సీనియర్ పోరాట యోధుడు ఈ యూఏఈ స్లో పిచ్‌లపై మళ్లీ పూర్వపు ఆటను ప్రదర్శించేందు కు, గతంలో మాదిరిగా ప్రత్యర్థులను గడగడలాడించేందుకు ఇదే మంచి సమయం.కోహ్లీ జట్టును ఇలానే నడిపించు: ధోని

Updated By ManamTue, 08/07/2018 - 22:21

imageముంబై: ఇంగ్లాండ్ గడ్డై పై తొలి టెస్టులో కెప్టెన్  కోహ్లీ జట్టుని ముందుండి నడిపించిన తీరు తనని ఆక ట్టుకుందని మాజీ కెప్టెన్ ధోనీ వెల్లడించాడు.  రెండో టెస్టు మ్యాచ్ లార్డ్స్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానుం ది. కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ గురించి తాజాగా  ధోనీ మీడి యాతో మాట్లాడుతూ ‘కోహ్లీ బెస్ట్ బ్యాట్స్ మన్. అతను ఇప్పటికే అత్యున్నత స్థాయిని అందుకున్నాడు. దిగ్గజ క్రికెటర్ హోదాకి దగ్గర్లో ఉన్నాడు.గత కొన్నేళ్లుగా విదేశీ గడ్డల పైనా కోహ్లీ అద్భుతంగారాణిస్తున్నందుకు చాలా సం తోషంగా ఉంది.తొలిటెస్టులో జట్టుని ముందు ండి నడిపించాడు. కెప్టెన్ నుంచి జట్టు ఇలాం టి ప్రదర్శననే ఆశిస్తుంది’ అని తెలిపాడు.బీసీసీఐ నవ్వుల పాలు

Updated By ManamFri, 07/20/2018 - 22:36
  • ప్రొఫైల్ పేజీలో ధోనీని కెప్టెన్‌గా పేర్కొన్న బోర్డు  

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఈ మధ్య తరచుగా వార్తల్లోకెక్కుతున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన imageవన్డే సిరీస్‌లో పేలవంగా ఆడటంతో ధోనీ భవిష్యత్తుపై అభిమానుల్లో చర్చ మొదలైంది. అయితే ధోనీ రిటైర్మెంట్ తీసుకోవడం లేదని కోచ్ రవిశాస్త్రి చెప్పడంతో పుకార్లు సద్దుమణిగాయి.

ఇప్పుడు మరో సంఘటనతో ధోనీపై సోషల్ మీడియాలో అభిమానులు స్పందించారు. ప్లేయర్ ప్రొఫైల్ పేజీలో ధోనీని బీసీసీఐ కెప్టెన్‌గా పేర్కొంది. కెప్టెన్సీని ధోనీ రాజీనామా చేసి రెండేళ్లు గడిచినా అతడిని బోర్డు ఇంకా కెప్టెన్‌గానే పేర్కొనడంతో నవ్వులపాలైంది. ఈ తప్పిదం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. చాలా మంది బీసీసీఐపై జోకులు వేశారు. 

‘ధోనీ రిటైర్మెంట్‌పై పుకార్లు వచ్చాయి.  కానీ అతనే తమ కెప్టెన్ అని బీసీసీఐ ఇప్పటికీ విశ్వసిస్తోంది’                        - పుష్కర్
‘డియర్ బీసీసీఐ! దయచేసి ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అని గుర్తు పెట్టుకోండి. మీ తప్పును సరిచేసుకోండి’    - ప్రవీణ్
‘పాత కెప్టెన్ (ఎంఎస్ ధోనీ) మళ్లీ పగ్గాలు చేపట్టాలని బీసీసీఐ భావిస్తోందా? లేక వెబ్ సైట్‌ను అప్‌డేట్ చేయడం మర్చిపోయారా? ఏది ఏమైనా ధోనీని బీసీసీఐ ఇంకా కెప్టెన్‌గానే భావిస్తున్నందుకు అతనిని అభినందిస్తున్నాను’
 - చంద్రమౌళి
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోనీ 58 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేయడంతో అతనిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ధోనీ గత రెండేళ్లుగా తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లో ఇబ్బందులు పడుతున్నాడు. అయితే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్‌కు అండగా నిలిచాడు.

image

 క్రికెట్‌కు మిస్టర్ కూల్ గుడ్‌బై?

Updated By ManamWed, 07/18/2018 - 15:22
  • ఇంగ్లాండ్ వన్డేలో సూచన

MS dhoni

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోనీ గుడ్‌బై చెప్పనున్నారంటూ తాజాగా మరోసారి ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేనే మిస్టర్ కూల్ చివరి మ్యాచంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు, పుకార్లకు కొదవేంలేదు.

ఇప్పటికి చాలాసార్లు ఇలాగే ప్రచారం జరిగినా, ఇప్పుడు మాత్రం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్‌లో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇందులో భారత ఆటగాళ్ల ప్రదర్శన అభిమానులను నిరశపరిచింది. 

ముఖ్యంగా మూడో వన్డేలో ధోనీ ఆటపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అభిమానులతో పాటు గవాస్కర్ వంటి మాజీ ఆటగాళ్లు ధోనీ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ధోనీని జట్టులో కొనసాగించడాన్నీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మూడో వన్డేలో పరుగులు చేయడంలో మిడిలార్డర్ మరోసారి విఫలం కాగా.. వికెట్లు తీయలేక బౌలర్లు చేతులెత్తేశారు. ధోనీ క్రీజులో నిలబడినా దూకుడుగా ఆడలేకపోయాడు.

పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. వేగంగా పరుగులు రాబట్టాల్సిన పరిస్థితుల్లో మందకొండిగా ఆడాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూంకు వెళ్తున్న సమయంలో ధోనీ అంపైర్ల దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకున్నాడు. దీంతో ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారంటూ రూమర్లు ప్రారంభమయ్యాయి.

సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. క్రికెట్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఆటగాళ్లు బంతినో వికెట్‌నో గుర్తుగా దాచుకోవడం సాధారణమే. గతంలో ధోనీ కూడా ఇలాగే ప్రవర్తించాడు. టెస్టుల నుంచి రిటైరయ్యే సమయంలో.. 2014లో ఆస్ట్రేలియాపై చివరి టెస్ట్ మ్యాచ్ ముగిశాక ధోనీ స్టంప్లను తనతో తీసుకెళ్లాడు. ఆ తర్వాత టెస్ట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

తాజాగా ఇంగ్లాండ్ వన్డేలో బంతిని తీసుకెళ్లడంతో త్వరలో ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మూడో వన్డే మ్యాచ్ ముగిశాక ధోనీ అంపైర్ దగ్గర్నుంచి బంతిని అడిగి తీసుకుంటున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.నా చెత్త రికార్డు గుర్తొచ్చింది

Updated By ManamTue, 07/17/2018 - 16:38
  • ధోనీ ఆటతీరుపై గవాస్కర్ చురకలు

India vs England, MS Dhoni, Gavaskar, 'Infamous' 36ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో ధోని చెత్త ప్రదర్శనపై అభిమానులతో పాటు క్రికెట్ పండితులూ విమర్శలకు దిగుతున్నారు. వేగంగా పరుగులు రాబట్టాల్సిన సమయంలో నెమ్మదిగా ఆడడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ‘ఇదే వేదికపై గతంలో నాకో చెత్త రికార్డు ఉంది.. తాజాగా ధోని ప్రదర్శన నాకు దానిని గుర్తు చేసింది’ అని ధోనికి పరోక్షంగా చురకలంటించారు. తన కెరీర్‌లోనే అదో మాయని మచ్చని గవాస్కర్ వ్యాఖ్యానించాడు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా 1975 ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ సందర్భంగా ఓ మ్యాచ్‌లో 174 బంతులు ఆడి గవాస్కర్ కేవలం 36 పరుగులు మాత్రమే చేయడంపై అప్పట్లో దుమారం రేగింది.

దీనిపై తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని గవాస్కర్ పేర్కొన్నారు. తాజాగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ ఇన్సింగ్స్ నాటి తన ప్రదర్శనను గుర్తుతెచ్చిందని వివరించారు. అదే సమయంలో ఈ ఆటతీరుకు ధోనిని విమర్శించాల్సిన అవసరంలేదంటూ సర్దిచెప్పారు. ధోని బ్యాటింగ్ వచ్చే సరికే టీమిండియా ఓటమి ఖరారైందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు దూకుడు ప్రదర్శించేంత రిస్క్ తీసుకోలేరని గవాస్కర్ వివరించారు. ఈ మ్యాచ్‌లో ధోనీ రక్షణాత్మకంగా ఆడారు. మొత్తంగా 58 బంతులు ఎదుర్కొన్న మిస్టర్ కూల్ కేవలం 37 పరుగులు మాత్రమే చేశాడు.క్రికెట్ మక్కాలో ధోనీకి అవమానం

Updated By ManamSun, 07/15/2018 - 23:17
  • స్లో బ్యాటింగ్‌పై ఫ్యాన్స్ ఫైర్.. పదివేల పరుగులు చేసిన రోజే హేళన

  • ఆలోచించి విమర్శించాలని వెనకేసుకొచ్చిన కోహ్లీ

dhoniలండన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ధోనీకి ఉన్నారు. వరల్డ్‌లోనే బెస్ట్ ఫినిషర్‌గా ధోనీకి పేరుంది. కానీ లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ చూసి అభిమానులకు కూడా విసుగొచ్చింది. ఇదే మ్యాచ్‌లో అతడు వన్డేల్లో పది వేల పరుగుల మైల్‌స్టోన్‌ను అందుకున్నా.. ఫ్యాన్స్ ఆ రికార్డును పెద్దగా పట్టించుకోలేదు. అవసరమైన సమయంలోనూ బ్యాట్‌కు పని చెప్పకుడా  నిదానంగా బ్యాటింగ్ చేసిన ధోనీని చూసి వాళ్లకు చిర్రెత్తుకొచ్చింది. 58 బాల్స్ ఆడిన ధోనీ కేవలం 37 పరుగులు చేశాడు.  చివర్లో 30 బంతుల్లో 110 పరుగులు అవసరమైన సమయంలోనూ మిహీ.. 46వ ఓవర్ తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో ఒక్కో డాట్ బాల్‌కు గ్రౌండ్‌లో ఉన్న అభిమానులు ధోనీని హేళన చేయడం ప్రారంభించారు. నాలుగు బంతులు అతడు పరుగులు చేయకపోవడంతో ప్రతి బంతికీ అలాగే అతన్ని వెక్కిరిస్తూ అరవడం కనిపించింది. ఆ ఓవర్ తర్వాత శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ డ్రింక్స్ తీసుకొచ్చి ధోనీకి ఓ సందేశం కూడా చేరవేశారు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే ధోనీ డీప్ మిడ్ వికెట్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  ధోనీని ఇలా హేళన చేసిన విషయం తనకు తెలియదని మ్యాచ్ తర్వాత టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అన్నాడు. అటు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ మాట్లాడుతూ.. ధోనీని హేళన చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు.   ఈ ఓటమి తర్వాత భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ధోని బ్యాటింగ్ తీరును కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. ‘ ప్రతీసారి ధోని సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించడం కుద రదు. ఓవరాల్‌గా చూస్తే ధోనీ అతని శైలిలో ఆడటానికి పరిస్థితులు అనుకూలించలేదు. రెండో వన్డేలో ధోనీ బాధ్యతాయతంగా బ్యాటింగ్ చేశాడు. ధోనీ బాగా ఆడితే.. బెస్ట్ ఫినిషర్ అంటూ కితాబిస్తారు. ఆడకపోతే అతనిపై పడతారు. ఒకసారి విమర్శలు చేసే ముందు కాస్త ఆలోచించండి. ధోనీ ఒక అను భవం ఉన్న ఆటగాడు. మేము 150-160 పరుగుల తేడాతో ఓడిపోవాలని కోరుకోలేదు. కడవరకూ బ్యాటింగ్ కొనసా గించాలనేది మా గేమ్ ప్లాన్. అందులో భాగంగా ధోని సమ యోచితంగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. శనివారం మాకు దుర్దినంగా చెప్పొచ్చు. ఛేజింగ్ దిగినప్పుడు ఆరంభం బాగానే ఉంది. కానీ మూడొందలకు పైగా లక్ష్యాన్ని ఛేదిం చేటప్పుడు వికెట్లు చేతిలో ఉండాలి. దూకుడుగా ఆడటం కుదరదు. సెకాండాఫ్‌లో పిచ్ బాగా నెమ్మదించింది’ అని అన్నాడు.10వేల పరుగుల క్లబ్‌కు చేరువలో ధోనీ

Updated By ManamWed, 07/11/2018 - 23:30

imageటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మరో అదురైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో 10వేల పరుగుల మైలురాయిని చేరుకొనేందుకు ధోనీ ఇంకా 33 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్ల్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో ధోనీ ఈ రికార్డును సాధించే అవకాశం ఉంది. శుక్రవారం నాట్టింగ్‌హామ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ధోనీ 33 పరుగులు చేస్తే.. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తర్వాత 10వేల పరుగుల క్లబ్‌లో చేరిన నాలుగో భారత క్రికెటర్‌గా నిలుస్తాడు. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఈ క్లబ్‌లో చేరిన 12వ క్రికెటర్‌గా ధోనీ ఘనత సాధించే అవకాశం ఉంది. ఈ క్లబ్‌లో సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నారు. సచిన్ ఆడిన అన్ని వన్డేల్లో 18,426 పరుగులు చేశారు. ఆ తర్వాత 14,234 పరుగులతో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కార, 13,704 పరుగులతో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నారు.ధోని బర్త్‌డే.. సెహ్వాగ్ ఫన్నీ విషెస్

Updated By ManamSat, 07/07/2018 - 12:50

Dhoni టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని శనివారం 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో ధోనికి శుభాకాంక్షలు తెలిపారు.

‘‘హ్యాపీ బర్త్‌డే ధోని. ఈ స్ర్టెచ్ కంటే ఎక్కువగా నీ జీవితంలో సంతోషం ఉండాలి. ఓం ఫినిశాయనమ:’’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ధోనికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేశారు. మరోవైపు క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, మహ్మద్ కైఫ్, వినోద్ కంబ్లీ, రషీద్ ఖాన్, బుమ్రా, శిఖర్ ధావన్, మహ్మద్ షమీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా ఆదివారం ధోని తన 500వ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌ను ఆడనుండటం విశేషం.ఎం.ఎస్ ధోని సీక్వెల్

Updated By ManamThu, 07/05/2018 - 01:16

imageప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘ఎం.ఎస్.ధోని’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వార్త వినిపిస్తోంది. ధోనిగా మంచి నటనను ప్రదర్శించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సీక్వెల్ కోసం చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

2011లో ప్రపంచకప్ విజయం తర్వాత ధోని జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఈ సీక్వెల్‌లో పొందుపరచనున్నారని సమాచారం. అయితే ధోని వ్యక్తిగత జీవితాన్ని కూడా తెరపై అవిష్కరించే విధంగా సీక్వెల్‌ను రూపొందించాలని సుశాంత్ భావిస్తున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. అయితే ఈ సీక్వెల్‌కు దర్శకుడెవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

Related News