trailer

నేనేం చెయ్యలేదు సర్

Updated By ManamFri, 08/17/2018 - 15:07

U Turnసమంత అక్కినేని ప్రధానపాత్రలో పవన్ తెరకెక్కించిన చిత్రం ‘యూటర్న్’. కన్నడలో విజయం సాధించిన యూటర్న్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఇందులో రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి, భూమిక చావ్లా ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీనివాస చిత్తురీ, రాంబాబు బండారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించగా.. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.మహేశ్ చేతుల మీదుగా ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్

Updated By ManamWed, 08/01/2018 - 14:35

Srinivasa Kalyanamనితిన్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సతీశ్ వేగెష్న తెరకెక్కించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఆగష్టు 2న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఇక ఈ ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయడం విశేషం. గురువారం సాయంత్రం 5.30గంటలకు ఈ చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. పెళ్లి విశిష్టత ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. శతమానం భవతి చిత్రం తరువాత సతీశ్ వేగెష్న దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.సోనీ నిర్వాకం..ఏకంగా సినిమానే ..

Updated By ManamWed, 07/04/2018 - 16:41
Sony uploading an entire movie to ...

కోట్లు ఖర్చు చేసి తీసే సినిమాలను విడుదల చేసేముందు ప్రేక్షకులను థియేటర్ల దాకా రప్పించేందుకు సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో విడుదల చేయడం తెలిసిందే. ఎలక్ట్రానికి మీడియాతో పాటు సామాజిక మాధ్యామాలలోనూ ఈ ట్రైలర్లను విడుదల చేస్తుంటారు. మరోవైపు సినిమాలను పైరసీ చేసి వాటి విడుదలకు ముందే నెట్‌లో పెట్టేసే ప్రబుద్ధులు కూడా ఉంటారు. దీనివల్ల నిర్మాతలకు తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పక్కర్లేదు.

అయితే, ప్రఖ్యాత సోనీ సంస్థ మాత్రం తన గోతిని తనే తవ్వేసుకున్నట్లు వ్యవహరించింది. కొత్త సినిమా ట్రైలర్‌ను నెట్‌లో విడుదల చేసేందుకు బదులు మరో సినిమా మొత్తాన్నీ యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసేసింది. రెడ్ బ్యాండ్ ట్రైలర్‌కు బదులు ‘ఖలి ది కిల్లర్‘ సినిమా లింకును యూట్యూబ్‌లో పెట్టేసింది. ఈ తతంగమంతా పొరపాటున జరిగినా.. నెటిజన్లు మాత్రం దొరికిందే చాన్సంటూ హాయిగా సినిమాను డౌన్‌లోడ్ చేసుకుని చూసేశారు. 

ఈ వ్యవహారాన్ని తొలుత సీబీఆర్ డాట్ కామ్ అనే ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ చానల్ గుర్తించి సోని సంస్థ నోటీసుకు తీసుకెళ్లింది. దాంతో స్పందించిన సోనీ అధికారులు ఆ లింక్‌లను తొలగించారు. అప్పటికే దాదాపు ఎనిమిది గంటలకు పైగా సినిమా లింక్‌లు పని చేశాయి. చాలా మంది ఈ సినిమాను డౌన్‌లోడ్ చేసుకున్నారు. మంచి సినిమాను కాణీ ఖర్చులేకుండా చూసే అవకాశం కల్పించినందుకు సోనీ కంపెనీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్లు కూడా చేశారు. ఈ అవకాశాన్ని మిస్ అయిన వారికి సోనీ కంపెనీ డిజిటల్ పర్చేస్ కింద అందుబాటులో ఉంచింది.జాన్వీ మూవీ ట్రైలర్ వచ్చేస్తోంది

Updated By ManamSun, 06/10/2018 - 13:56

dhadak అతిలోక సుందరి శ్రీదేవి జాన్వీ కపూర్ ‘ధడక్’ అనే చిత్రంలో నటిస్తోంది. షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కత్తర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహిస్తున్నాడు. మరాఠీ సూపర్ హిట్ చిత్రం ‘సైరాట్’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఈ నెల 11న మధ్యాహ్నం విడుదల కానుంది. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఇక జూలై 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ‘ఈ నగరానికి ఏమైంది?’ ట్రైలర్ టాక్

Updated By ManamSun, 06/10/2018 - 10:43

Ee Nagaraniki Emaindi  ‘పెళ్లిచూపులు’ ఫేం తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈ నగరానికి ఏమైంది. విశ్వసేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతమ్, వెంకటేశ్ కకుమాను ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఆద్యంతం కామెడీతో నిండిన ఈ ట్రైలర్ అందరి చేత నవ్వులు పూయిస్తోంది. ఇక ఈ చిత్రంలో అనీషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌పై సురేశ్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఆకట్టుకుంటున్న ‘రాజీ’ ట్రైలర్

Updated By ManamTue, 04/10/2018 - 13:29
Raazi

అలియా భట్ ప్రధాన పాత్రలో మేఘనా గుల్జార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజీ’. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అలియా భట్ స్పైగా నటించగా.. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది. ‘‘దేశం కోసం త్యాగం చేసిన చాలామంది పేర్లు, వారి మొహాలు బయటకు రాకపోవచ్చు, అందరికీ తెలియకపోవచ్చు. కానీ దేశం కోసం వారు చేసిన త్యాగం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అనే డైలాగ్‌తో వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక  థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినీత్ జైన్, కరణ్ జోహార్, హిరో యష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మించగా.. మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 అమ్మో.. అనుష్క శర్మ

Updated By ManamThu, 02/15/2018 - 12:26

Pari అనుష్క శర్మ ప్రధానపాత్రలో నటిస్తున్న హారర్ చిత్రం 'పరీ'. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్‌లోనే అందరినీ భయపెట్టిన అనుష్క శర్మ ట్రైలర్‌లో మరింత భయపెడుతోంది. ట్రైలర్ మొత్తం హారర్ కథాంశంతో సాగగా.. బ్యాక్‌గ్రౌండ్ మరింత ఆకర్షణగా నిలిచింది. ఇక ప్రోసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

 మహేశ్ బాబు స్పైడర్ సినిమా ట్రైలర్ విడుదల

Updated By ManamFri, 09/15/2017 - 15:52

మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మహేశ్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పైడర్ చిత్ర ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఇప్పటికే 2మిలియన్ వ్యూస్ సాధించిన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిభరితంగా సాగింది. మురుగదాస్ మేకింగ్, మహేశ్ బాబు యాక్టింగ్‌ కలిస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. నా పేరు శివ అంటూ మహేశ్ బాబు చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ సాగింది. ఈ ట్రైలర్‌లో విలన్‌కు, హీరోకు మధ్య వచ్చే సీన్స్, విలన్ సృష్టించే విధ్వంసం, హీరోహీరోయిన్ల మధ్య కొన్ని సంభాషణలను కనిపిస్తాయి. పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శికి మంచి పాత్ర లభించినట్లు ట్రైలర్‌ను చూస్తే తెలిసిపోతుంది. మొత్తం మీద తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో.. సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.

స్పైడర్ ట్రైలర్ కోసం క్లిక్ చేయండి 

 

ఇదిలా ఉంటే తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌లో ఒక తేడా స్పష్టంగా కనిపిస్తోంది. తమిళ భాషలో ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషిస్తున్న ప్రేమిస్తే భరత్‌ షాట్‌ను ఉంచారు. తెలుగు ట్రైలర్‌‌లో భరత్ కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు స్పైడర్‌లో భరత్ ఉన్నాడా, లేడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ శిల్ప కళావేదికలో ఈ సాయంత్రం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మహేశ్, నమ్రతా పిల్లలతో కలిసి రానున్నట్లు సమాచారం. మురుగదాస్, రకుల్, చిత్ర నిర్మాతలతో పాటు మరికొందరు టాలీవుడ్ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఆడియో వేడుకను చెన్నైలో నిర్వహించిన స్పైడర్ టీం మహేశ్ అభిమానుల కోసం హైదరాబాద్‌లో ఈ వేడుకను నిర్వహిస్తోంది. 120 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన స్పైడర్ సినిమా ఈ నెల 27న విడుదల కాబోతోంది.

Related News