andhrapradesh

మారిన ఏపీ అధికార చిహ్నం

Updated By ManamThu, 11/15/2018 - 08:59
AP Government

అమరావతి: దాదాపు ఐదున్నర దశాబ్దాల తరువాత ఆంధ్రప్రదేశ్ అధికార చిహ్నం మారింది. పాత చిహ్నంలో గవర్న్‌మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఆంగ్లంలో ఉన్న స్థానంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని తెలుగులో రాశారు. చిహ్నం రెండు వైపులా ఒకవైపు ఇంగ్లీష్‌లో, మరోవైపు హిందీలో ఆంధ్రప్రదేశ్ అని రాయించారు. అలాగే దిగువన సత్యమేవ జయతే అనే పదాన్ని తెలుగులోకి మార్చారు.

త్రిరత్నాలు(బుద్ధుడు, ధర్మం, సంఘం) పొదిగిన దండంతో ధర్మచక్రాన్ని చిహ్నంలో పెట్టారు. దీనికి అమరావతి శిల్పకళలోని ధర్మ చక్రాన్ని స్ఫూర్తిగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక పూర్ణఘటాన్ని మూడు వృత్తాల్లో వరుసగా అలంకరించారు. పూర్ణఘటిక కింద జాతీయ చిహ్నమైన అశోక స్థంభాన్ని పెట్టారు. ఇక ఈ చిహ్నాన్ని మూడు రకాలుగా ముద్రించుకోవచ్చునని ఏపీ సీఎస్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.గజ తుఫాను: తమిళనాడులో హై అలర్ట్

Updated By ManamWed, 11/14/2018 - 09:20

Gaja Cycloneచెన్నై: బంగాళాఖాతంలో గజ తుపాను ప్రభావం కొనసాగుతోంది. ఈ తుపాను గురువారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో తమిళనాడులో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కడలూరు, రామనాథపురం, పుదుకొట్టై, తూత్తుకుడి, తంజావూరు, తిరువాయూరులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక కడలూరుకు ఇప్పటికే 11 ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. మరోవైపు మత్స్యకారులెవ్వరు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే అక్కడ 130 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు గజ తుఫానుతో ఏపీలోనూ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Updated By ManamTue, 11/13/2018 - 11:26

Tempearatureహైదరాబాద్: కార్తీక మాసం రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో 14.8డిగ్రీలకు పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్‌లో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదేనని ఆ శాఖ వెల్లడించింది. అలాగే ఆదిలాబాద్‌లో 9డిగ్రీలు, రామగుండంలో 16డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది.

మరోవైపు ఏపీలోని విశాఖ ఏజెన్సీలో చలి చంపుతోంది. జి.మాడుగుల, జీకే వీధి, లంబసింగిలో ఉష్ణోగ్రతలు ఏకంగా 7డిగ్రీలకు పడిపోయాయి. వీటితో పాటు చింతపల్లిలో 9డిగ్రీలు, మినుములూరులో 10డిగ్రీలు, పాడేరులో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.మంత్రులుగా ఫరూక్, శ్రవణ్ ప్రమాణం

Updated By ManamSun, 11/11/2018 - 12:28

Farook, Sravanఅమరావతి: కేబినెట్ విస్తరణలో భాగం ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి మరో ఇద్దరు మంత్రులు చేరారు. ఫరూక్, కిడారి శ్రవణ్‌లు కొత్త మంత్రలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో వీరి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఎన్టీఆర్ హయాంలో మైనార్టీ మంత్రిగా పనిచేసిన ఫరూక్.. 14ఏళ్ల తరువాత తిరిగి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాగా నక్సల్స్ జరిపిన దాడిలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు  చనిపోవడంతో ఆయన కుమారుడు శ్రవణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.జగన్‌ను ప్రజలే కాపాడుకుంటున్నారు: వైఎస్ విజయమ్మ

Updated By ManamSun, 11/11/2018 - 10:47

YS Vijayammaహైదరాబాద్: రాష్ట్ర ప్రజల్ని వైఎస్ తన కుటుంబ సభ్యుల్లా చూశారని, కత్తి దాడి నుంచి జగన్ కోలుకోవడం ఆయనకు పునర్జన్మ అని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. రాష్ట్ర సమస్యలపై జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారని, జగన్‌ను ప్రజలే కాపాడుకుంటున్నారని తెలిపారు. తమపై నిరాధార ఆరోపణలను మౌనంగా భరిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. కేసులు, విచారణల పేరుతో జగన్‌ను చాలా ఇబ్బంది పెట్టారని.. ఎన్ని సమస్యలున్నా, కష్టాలున్నా తన కుమారుడు చలించలేదని విజయమ్మ వెల్లడించారు. జైల్లో ఉన్న 16 నెలలు తప్ప మిగిలిన అన్ని రోజులు జగన్, జనం మధ్యనే ఉన్నారని ఆమె అన్నారు.

ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుందని, జగన్‌పై దాడి కేసులో తూతూ మంత్రంగా విచారణ జరుగుతోందని విమర్శించారు. చిన్న గాయం, విచారణ అక్కర్లేదని ఎలా చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. పరిటాల హత్య జరిగినప్పుడు వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశించారని విజయమ్మ గుర్తు చేశారు. ప్రతిపక్షనేతకే భద్రత కల్పించలేని ప్రభుత్వం ఎందుకని, జనం లేని చోట జగన్‌పై దాడి చేయాలని భావిస్తున్నారని ఆమె విమర్శించారు. తమ కుటుంబసభ్యుల్లో మహిళలను కూడా తిడుతున్నారని ఆమె అన్నారు. దాడి చేసింది అభిమానే అయినా.. విచారణ జరిపించాల్సిన బాధ్యత లేదా అంటూ ఆమె మండిపడ్డారు. జగన్‌పై దాడి కేసులో నిస్పక్షపాతంగా విచారణ జరగాలని ఆమె అన్నారు.మంత్రులపై అభ్యంతరకర పోస్టులు.. మహేశ్‌బాబు అరెస్ట్

Updated By ManamThu, 11/08/2018 - 09:28

Ministersకడప: సోషల్ మీడియా రోజురోజుకు విస్తరిస్తున్న ఈ హైటెక్ కాలంలో పలువురు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ప్రముఖులపై అభ్యంతరకర పోస్టులు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో తాజాగా ఏపీ మంత్రులపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని కడప పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు మహేశ్ బాబు కడప జిల్లా సింహాద్రిపురం మండలం చెర్లోపల్లికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. మంత్రులు ఆదినారాయణ రెడ్డి, లోకేశ్‌లపై మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్టులు చేయగా.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని.. కోర్టు ముందు హాజరుపరిచారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు చెప్పారు.ఏపీలో వర్షాలు పడే అవకాశం

Updated By ManamThu, 11/01/2018 - 11:52

Rainsవిశాఖపట్నం: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ కోస్తాకు ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీని ప్రభావంతో తమిళనాడు, దక్షిణకోస్తా, రాయలసీమ, కర్ణాటకల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.ఢిల్లీకి బయల్దేరనున్న చంద్రబాబు

Updated By ManamThu, 11/01/2018 - 09:28

Chandrababu Naiduఅమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాసేపట్లో ఢిల్లీకి బయల్దేరనున్నారు. ‘సేవ్ నేషన్’ నినాదంతో నాన్ బీజేపీ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు హస్తిన టూర్ సాగనుంది. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు కీలక భేటీ అవ్వనున్నారు. అలాగే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, తేజస్వి యాదవ్‌తోనూ చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. ఈ టూర్‌లో మంత్రులు కళా వెంకట్రావు, యనమల కూడా చంద్రబాబు వెంట వెళ్లనున్నారు.మరింత విషమంగా ప్రతిభా భారతి ఆరోగ్యం

Updated By ManamMon, 10/29/2018 - 12:04

Prathibha Bharathiఅమరావతి: గత మూడు రోజుల క్రితం గుండెపోటుతో విశాఖపట్టణంలోని పినాకిల్ ఆసుపత్రిలో చేరిన టీడీపీ పొలిట్ బ్యూరో, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి ఆరోగ్యం మరింత విషమించింది. చికిత్సకు ఆమె శరీరం స్పందించడం లేదని వైద్యులు తెలిపారు. ఆమె శరీరంలో ప్లేట్‌లైట్లు పడిపోయాయని, కర్తం ఎక్కిస్తుంటే ఇన్ఫెక్షన్లు వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించనున్నారు. మరోవైపు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతిభా భారతి తండ్రి జస్టిస్ డాక్టర్ పున్నయ్య ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.గుంటూరులో ఐటీ దాడులు

Updated By ManamMon, 10/29/2018 - 11:46

IT Raidsఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులు తనిఖీలు మొదలుపెట్టారు. టీడీపీ నేత, ఎల్‌వీఆర్ క్లబ్ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఏపీలో పలువురు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అందులో ఎక్కువగా టీడీపీ పార్టీకి చెందిన వారు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

Related News