MLA SV Mohan Reddy

టికెట్ ఒప్పందం ముందే జరిగింది..!

Updated By ManamWed, 07/11/2018 - 17:09

sv mohan reddy reveals Secret While joining in Tdp

కర్నూలు: జిల్లాలో తెలుగు తమ్ముళ్లు మధ్య సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ చిచ్చు పెట్టిన సంగతి తెలిసిందే.! దీంతో ఇప్పటికే బద్ధశత్రువులుగా ఉన్న టీజీ వెంకటేశ్- ఎస్వీ మోహన్‌రెడ్డిల మధ్య అగ్గిరాజేసినంత పనైంది. కర్నూలు ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌‌రెడ్డిని అభ్యర్థులుగా టీడీపీ తరఫున బరిలోకి దింపుతున్నట్లు నారా లోకేశ్‌ జిల్లాలో పర్యటనలో చెప్పిన విషయం విదితమే. మంత్రి ప్రకటనతో టీజీ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. అసలు పార్టీలో ఉండాలా.. వద్దా..? అనే డైలామాలో టీజీ వర్గీయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తన కుమారుడ్ని కర్నూలు నుంచి పోటీ చేయించాలని ఎన్నోరోజులుగా టీజీ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే లోకేశ్ ప్రకటనతో టీజీ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా టీజీ భరత్ కర్నూలు నుంచి పోటీ చేస్తారని.. గతంలో టీజీ వర్గీయులు మీడియా ముందుకొచ్చి స్పష్టంగా చెప్పిన విషయం విదితమే. 

నాకు ముందే ఒప్పందం జరిగింది!
నారా లోకేశ్ ప్రకటనపై ఇటు టీజీ.. అటు ఎస్వీ మోహన్ రెడ్డి ఇరువురూ స్పందించారు. తాజాగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. టీజీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ అభ్యర్థులను ప్రకటించారన్నారు. టీజీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ తనకు ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మొత్తానికి టికెట్ హామీ మేరకే టీడీపీ కండువా కప్పుకున్నానని ఎస్వీ తన నోటితోనే మీడియా ముందు నిజం ఒప్పుకున్నారన్న మాట.

నాకంత అవసరం లేదు..!
అభ్యర్థులను ముందు ప్రకటించడం మంచి సంప్రదాయమని మంత్రిని ఆయన మెచ్చుకున్నారు. లోకేశ్‌ను హిప్నటైజ్ చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. రాజకీయాల్లో లోకేష్ కొత్త పంథాను అనుసరిస్తున్నారని... పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయన ప్రకటించారని చెప్పారు. చంద్రబాబాబు చెప్పనదాన్నే లోకేష్ ప్రకటించారని ఈ సందర్భంగా ఎస్వీ చెప్పుకొచ్చారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానంతో పాటు.. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డిని కూడా లోకేష్ ప్రకటించినట్టు తెలిపారు. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల అభ్యర్థుల గెలుపు అవకాశాలు పెరుగుతాయన్నారు. పార్టీ గెలుపు కోసం తాను ఎవరితోనైనా కలిసి పని చేస్తానని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఎస్వీ వ్యాఖ్యలపై టీజీ వెంకటేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఒక్క వీడియో క్లిప్ చూపిస్తే రాజీనామా చేస్తా!

Updated By ManamTue, 03/13/2018 - 14:08

MLA SV Mohan Reddy Challange

అమరావతి: అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు లోపలికి వెళ్లి కాళ్లు పట్టుకొని.. భయటికొచ్చి విరోచితాలు పలుకుతారా?. అంటూ ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. మోదీకి వ్యతిరేకంగా జగన్ ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదంటూ ఎస్వీ సూటి ప్రశ్న సంధించారు. మోదీని హోదా అడిగినట్లు ఒకే ఒక్క క్లిప్పింగ్ చూపిస్తే శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.

" కేంద్రం ప్రభుత్వం ఏపీకిచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేదు. కేంద్రంలో వైసీపీతో లాలూచి పడిందా?. ప్రత్యేక హోదా మీద వైసీపీ ధర్నాలు చేసింది.. నేతలు అసెంబ్లీలో మాట్లాడారు.. ప్రతీరోజు పాదయాత్రలో హోదాపై జగన్ మాట్లాడుతున్నారు.. ఒక్కరోజైనా ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడారా?. మోదీని జగన్ ఎందుకు విమర్శించరు?. ప్రత్యేక హోదా తేవాల్సిన బాధ్యత చంద్రబాబుదే అని జగన్ అంటున్నారు.. అసలు హోదా ఇచ్చేది ప్రధానమంత్రా..? లేదా సీఎం చంద్రబాబు నాయుడా?. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా?. ప్రధానిని విమర్శించడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు?. ప్రత్యేక హోదా కావాలని జగన్ ఎందుకు అడగలేకపోతున్నారు. కేసులకు భయపడి జగన్ అడగలేకపోతున్నారా?. రాష్ట్రపతికి మద్దతిచ్చినప్పుడు హోదా ఇవ్వాలని లేకుంటే మద్దతివ్వమని భేషరతుగా ఎందుకు చెప్పలేకపోయారు?. ప్రధానికి సలాం కొట్టి.. చంద్రబాబును విమర్శించడం పద్ధతి కాదు. జగన్ ఇంకా రాజకీయాల్లో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఢిల్లీకి 29 సార్లు వెళ్లారు" అని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.సీఎంపై ఎస్వీ మోహన్ రెడ్డి పొగడ్తల వర్షం..

Updated By ManamTue, 03/13/2018 - 13:25

MLA SV Mohan Reddy On CM Chandrababuఅమరావతి: బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. సర్వేజన సుఖినో భవతు అన్నట్లుగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషం అన్నారు. ఇవాళ ఏపీకి ఇంత పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయంటే దానికి కారణం సీఎం చంద్రబాబేనన్నారు. కేవలం 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతినిచ్చే సింగిల్ విండో విధానం తీసుకురావడంతో ఏపీకి  పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై ఎస్వీ మోహన్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపించారు.

"కంపెనీలకు కావాల్సిన పొలాలు ఎన్ని ఎకరాలు కావాలో.. అన్ని ఎకరాలను వారి అనువుగా ఉండే రేట్లకే ఇవ్వడం జరిగింది. క్విడ్ ప్రోకోవిధానం లేకుండా పొలాలివ్వడం జరిగింది. వేల ఎకరాలు ఇచ్చినప్పటికీ ఎక్కడా ఎలాంటి క్విడ్ ప్రో జరగలేదనే విమర్శకు సీఎం చంద్రబాబు తావివ్వలేదు. రాష్ట్రం విడిపోయి ఐదేళ్లయితే.. వైసీపీ అధినేత జగన్ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి ఐదేళ్లు పట్టింది. 20 టేబుళ్లు, నాలుగు కుర్చీలు పెట్టే వైసీపీ ఆఫీస్ పెట్టడానికి అంత సమయం పడితే.. రాష్ట్రంలో పరిశ్రమలు రాత్రి రాత్రికి వస్తాయా!?. అమరావతి కట్టాలంటే తొందరగా అవుద్దా?. అప్పటికీ  190 రోజుల్లో అసెంబ్లీ, ఏడాదిలో సెక్రటరీ కట్టి అధికారులను ఇక్కడికితీసుకొచ్చి పరిపాలన సాగిస్తున్నారు. హైదరాబాద్‌‌లో ఐటీ ఈ స్థాయిలో ఉందంటే కేవలం సీఎం చంద్రబాబు వల్లే నని మంత్రి కేటీఆర్ మెచ్చుకున్నారు" అని ఎస్వీ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

Related News