1st ODI

భారత్ విజయలక్ష్యం 269 పరుగులు

Updated By ManamThu, 07/12/2018 - 21:22
  • 268 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్

  • మణికట్టుతో స్పిన్ మాయాజాలం.. కుల్‌దీప్ యాదవ్ (25/6)

  • ఇంగ్లాండ్‌తో భారత్ తొలివన్డే 

1st ODI, Team India  tour, Ireland, England Team, Nottinghamనాటింగ్‌హమ్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌యాదవ్‌ తన స్పిన్ మాయాజాలంతో ఇంగ్లాండ్‌కు ముచ్చెమటలు పట్టించాడు. తొలి ఓవర్‌ నుంచే విజృంభించిత కుల్‌దీప్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఇంగ్లాండ్ ఆరు వికెట్లను తీసి జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో 49.5ఓవర్లలో ఇంగ్లాండ్‌ 268పరుగులకే ఆలౌట్‌ అయింది. దాంతో భారత్‌కు ఇంగ్లాండ్ 269 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. 

కుల్‌దీప్ స్పిన్ మాయ.. 
1st ODI, Team India  tour, Ireland, England Team, Nottinghamటాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్ (38), బెయిర్‌స్టో (38) శుభారంభం ఇచ్చారు. అయితే వీరిద్దరిని (38) పరుగులకే పెవిలియన్ పంపించిన కుల్‌దీప్.. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ను సైతం మణికట్టు మాయాజాలంతో దడపుట్టించాడు. మిడిల్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ జోస్ బట్లర్‌(53; 51బంతుల్లో 5×4), బెన్‌ స్టోక్స్(50; 103బంతుల్లో 2×4) ఇరువురు హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఇంగ్లాండ్‌ గౌరవప్రదమైన స్కోరు పూర్తి చేసింది. మిగతా ఆటగాళ్లలో ఎంఎం అలీ (24), రషీద్ (22) పరుగులకే చేతులేత్తేయగా, ప్లంకెట్ (10), కెప్టెన్ మోర్గాన్ (19) పరుగులకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో చైనామన్ బౌలర్ కులదీప్ యాదవ్ ఒక్కడే ఒంటిచేత్తో 6 వికెట్లు పడగొట్టగా, పేసర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు, యుజువేంద్ర చాహల్‌కు ఒక వికెట్ దక్కింది. 

లక్ష్య ఛేదనలో భారత్..
ఇంగ్లాండ్ నిర్దేశించిన 269 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు కోహ్లీసేన బరిలోకి దిగింది. ముందుగా భారత్ ఓపెనర్లుగా రోహిత్ శర్మ (2), శిఖర్ ధావన్ (1) పరుగుతో క్రీజులో కొనసాగుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో వుడ్ తొలి ఓవర్ అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా 1 ఓవర్ ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులతో కొనసాగుతోంది. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్

Updated By ManamThu, 07/12/2018 - 17:10
  • నాటింగ్‌హమ్ వేదికగా ఇంగ్లాండ్‌తో తొలి వన్డే 

1st ODI, India, tour of Ireland, England, Nottinghamనాటింగ్‌హమ్: మూడు మ్యూచ్‌ల వన్డేల సిరీస్‌లో భాగంగా నాటింగమ్‌ వేదికగా గురువారం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ‘‘ఇంగ్లాండ్ బ్యాటింగ్‌పై మాకు ఎలాంటి ఆందోళన లేదు. మేం పటిష్టంగా ఉన్నాం. తొలుత బౌలింగ్ చేస్తాం. మునపటి వ్యూహాలనే కొనసాగించాలనుకుంటున్నాం’’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో సిరీస్‌ను కోహ్లీసేన కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే విజయోత్సాహంతో దూకుడు మీదున్న టీమిండియా మూడు వన్డేల సిరీస్‌ను కూడా దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సొంతగడ్డపై వన్డేలకు తిరుగులేని జట్టుగా ఇంగ్లాండ్‌ టీ20సిరీస్‌ను కోల్పోయినప్పటికీ వన్డేల్లో రాణించి తమ సత్తాను చాటేందుకు తహతహలాడుతోంది.తొలివన్డేలో భారత్ పరాజయం

Updated By ManamMon, 03/12/2018 - 18:56
  • బోల్టన్ అజేయ శతకం.. 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం

Jonassen, Bolton rout Mithali, India Women, 1st ODI, Australia women team వడోదర: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలివన్డేలో భారత మహిళల క్రికెట్ జట్టు పరాజయం పాలైంది. భారత్‌ నిర్దేశించిన 201 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్‌ 32.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి (107 బంతులు మిగిలి ఉండగానే) 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా మహిళలు దీటుగా ఆడి సత్తా చాటారు. ఓపెనర్‌ బోల్టన్‌ (101 బంతుల్లో 12 ఫోర్లు) సెంచరీ‌తో అజేయంగా ఆసీస్‌కు విజయంలో కీలక పాత్ర పోషించింది. ఆసీస్ జట్టులో బోల్టన్‌కు సాయంగా అలీస్సా హేలీ(29 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) 38 పరుగులు సాధించగా, మెగ్‌ లాన్నింగ్‌(38 బంతుల్లో 5 ఫోర్లు) 33పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగింది. ఇక ఎల్సీ పెర్రీ(26 బంతుల్లో 1ఫోర్)తో 25 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచింది. దాంతో 32.1ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా (202) విజయ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది.

Jonassen, Bolton rout Mithali, India Women, 1st ODI, Australia women team ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 200 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ బౌలర్ల దాటికి భారత మహిళలు ఒకరితరువాత మరొకరు పెవిలియన్ బాటపట్టారు. భారత మహిళల్లో పూజా వస్ట్రాకర్‌(51), పూనమ్‌ రౌత్‌(37), సుష్మా వర్మ(41)లు మాత్రమే ఆకట్టుకోగా, మిగతావారంతా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో భారత జట్టు స్పల్ప స్కోరుకే చాపచుట్టేసింది. ఆసీస్‌ బౌలర్లలో జోనాసన్‌ నాలుగు వికెట్లు, వెల్లింగ్టన్‌ మూడు వికెట్లు సాధించారు.

Related News