telangana

కేసీఆర్ శుభాకాంక్షలు.. కోమటి రెడ్డి సెటైర్ 

Updated By ManamWed, 05/23/2018 - 15:18

KCR, Komati Reddy హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ లేఖ పంపారు. ‘‘మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. 

దానిపై స్పందించిన కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ సెటైర్ వేశారు. ‘‘అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపినందుకు సభ్యత్వాన్ని రద్దు చేశారు. ఈ అంశంలో కోర్టు మొట్టికాయలు వేసింది. అయినా కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. కానీ కేసీఆర్‌ మాత్రం నన్ను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. మీకు ఏమాత్రం కోర్టు మీద గౌరవం ఉన్నా ఎమ్మెల్యేగా నాకు దక్కాల్సిన అన్నీ వసతులు కల్పించండి. నన్ను వెలివేసి.. ఎమ్మెల్యేగా గుర్తించి శుభాకాంక్షలు తెలిపినా కేసీఆర్‌ గొప్పవ్యక్తి. ఓవైపు గన్‌మెన్లను తొలగించి.. మరోవైపు ఆశీర్వదిస్తున్నారు’’ అంటూ వ్యాఖ్యానించారు.మంత్రి కడియం వ్యాఖ్యలు సరికావు

Updated By ManamThu, 05/17/2018 - 10:02

kadiyam  హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలలపై ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు సరికావని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రైవేట్ పాఠశాలల అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన్సూర్ అహ్మద్ జనార్ధన్ రెడ్డి అన్నారు. వెంటనే కడియం శ్రీహరి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 40లక్షల మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నామని, సుమారు 4లక్షల ముందికి ఉపాధిని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ప్రైవేట్ బస్సులు గ్రామాల్లోకి వస్తే వాటి టైర్లలో గాలి తీయండి అంటూ కడియం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన ఆయన ప్రైవేట్ సంస్థలపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. 

 ఆర్టీసీ కార్మికులతో మంత్రుల కమిటీ భేటీ

Updated By ManamWed, 05/16/2018 - 15:16

etela  హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘం నేతలతో మంత్రుల కమిటీ సమావేశమైంది. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో మంత్రులు హరీశ్ రావు, మహేందర్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు, టీఎంయూ సంఘం నేతలు తదితరులుపాల్గొన్నారు. ఇందులో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, సమస్యలపై వారు చర్చిస్తున్నారు. అయితే వేతనాలు పెంచాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తుండగా.. వేతనాలు పెంచలేమని, పెంచితే ఆర్టీసీకి మరింత నష్టాలొస్తాయని మంత్రుల కమిటీ పేర్కొంది. దీంతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. 

 తెలంగాణలో పలు ప్రాంతాలకు వర్ష సూచన

Updated By ManamTue, 05/15/2018 - 09:24

rains  హైదరాబాద్: రాష్ట్రంలో ఉపరితల ద్రోణి ఏర్పడటంతో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య భారతం నుంచి దక్షిణ భారతానికి వీస్తున్న గాలుల ప్రవాహం వల్ల వాతావరణం చల్లబడినట్లు వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త రాజారావు తెలిపారు. దీంతో గురువారం నుంచి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కాగా మరోవైపు వానలు లేని ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది.

 హోర్డింగ్ ఎక్కిన హోంగార్డ్.. భారీ ట్రాఫిక్ జామ్

Updated By ManamMon, 05/14/2018 - 11:56

home guard హైదరాబాద్: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఖైరతాబాద్‌లో ఓ హోంగార్డు పెట్రోల్ బాటిల్ తీసుకొని హోర్డింగ్ ఎక్కాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డువైపు వెళ్లే మార్గాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ఆ వైపుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది గంటలుగా ట్రాఫిక్ ముందుకు కదలడం లేదు. మరోవైపు అతన్ని కిందికి దించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే తొమ్మిదేళ్లు ఉద్యోగం చేయించుకొని సర్వీస్ నుంచి తొలగించారని, 400మంది హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అతడు డిమాండ్ చేస్తున్నాడు.

 రైతు బంధు తాత్కాలిక ఉపశమనమే: దత్తాత్రేయ

Updated By ManamSun, 05/13/2018 - 20:13

Rythu bandhu scheme, temporary relief for farmers, Telangana, Bandaru Dattatreya హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పధకం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ఎలాంటి సాయం చేయలేదన్నారు. అర్హులైన వారందరికి పంట పెట్టుబడి సాయం అందడంలేదని పేర్కొన్నారు. నకిలీ విత్తన కంపెనీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని దత్తాత్రేయ కోరారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు 12శాతం పెరిగాయని, ప్రభుత్వం ఈ విషయంలో కఠినంగా వ్యవహారించడంలేదని దత్తాత్రేయ విమర్శించారు.సీఎం కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టిన కారు

Updated By ManamFri, 05/11/2018 - 10:50

kcr  హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌లోని ఓ వాహనాన్ని  ప్రైవేటు కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కానిస్టేబుళ్లు, ఒక ఆర్‌ఎస్‌ఐతో పాటు మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం చెంజర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో పోలీసు వాహనం వెనుకనే ఉన్న కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

 మాట్లాడుకుందామని పిలిచి.. గొంతుకోసి చంపేశాడు

Updated By ManamFri, 05/11/2018 - 09:47

kills రంగారెడ్డి: జిల్లాలోని శంకర్‌ పల్లిలో దారుణం జరిగింది. మాట్లాడుకుందాం అని పిలిచి ప్రియురాలి గొంతుకోసి చంపేశాడు ఓ ప్రేమోన్మాది. స్థానిక రిసార్ట్‌లో జరిగిన ఈ సంఘటన అక్కడ కలకలం సృష్టించింది.

వివరాల్లోకి వెళ్తే.. శిరీష, సాయి ప్రసాద్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల శిరీష మరో యువకుడితో సన్నిహితంగా మెలుగుతుండడంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు సాయి ప్రసాద్. ఈ విషయమై గత కొద్ది రోజులుగా ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తోంది. దీంతో శిరీషపై కోపం పెంచుకున్న సాయి ప్రసాద్ ఆమెను హతమార్చేందుకు పథకం పన్నాడు.

అందులో భాగంగా మాట్లాడుకుందాం రమ్మని శిరీషను రిసార్ట్‌కు పిలిపించాడు సాయి ప్రసాద్. ఆ తరువాత కాసేపు ఆమెతో ఏకాంతం గడిపాడు. మాటల మధ్యలో ఆ యువకుడి ప్రస్తావన రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ క్షణంలో శిరీష తనను మోసం చేస్తోందన్న ఆవేశంతో ఉన్న సాయి ప్రసాద్ ఆమె గొంతు కోసి పరారయ్యాడు. కాగా మరోవైపు హత్య విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు ఎదురౌతాయని భావించిన రిసార్ట్ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమాచారం ఎలాగో పోలీసులకు తెలియడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత నిందితుడు సాయి ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు.

lover kills her girl friend in ranga reddy distఅనుమానాస్పద స్థితిలో వరుడి మృతి 

Updated By ManamTue, 05/08/2018 - 12:39

Ramesh ఇబ్రహీంపట్నం: రెండు రోజుల్లో అతడి పెళ్లి. ఇంట్లో వాళ్లంతా పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో ఫోన్ వచ్చింది అని చెప్పి బయటికి వెళ్లిన పెళ్లి కొడుకు.. బంధువులకు చెందిన పొలం వద్ద కాలిన గాయాలతో శవమై పడున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల ఠాణా పరిధిలోని పటేల్‌గూడ గ్రామంలో చోటుచేసుకుంది. ఆరుట్ల గ్రామానికి చెందిన దన్నె రమేశ్‌(25) ఆటో నడుపుతూ కిరాణా దుకాణాలకు తినుబండారాలను సరఫరా చేస్తుండేవాడు. ఇతనికి ఈ నెల 9వ తేదీన దాద్‌పల్లి గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయం అయింది. పెళ్లి పనుల్లో తీరిక లేకుండా ఉన్న రమేశ్ ఆదివారం రాత్రి 9.30కు ఫోన్ వచ్చిందని బయటకు వెళ్లాడు. బయటకు వెళ్లిన అతడు ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతడి కోసం వెదికారు. ఇబ్రహీంపట్నం పటేల్‌గూడ సమీపంలోని ఓ పొలం వద్ద ఓ మృతదేహాన్ని గమనించిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో.. కుటుంబ సభ్యులు వెళ్లి అది రమేశ్ మృతదేహమేనని గుర్తించారు. ఆ పొలం కూడా తమ బంధువులదేనని చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి ఒంటిపై కాలిన గాయాలు, మృతదేహం పక్కనే మద్యం సీసా ఉన్నట్లుగా గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఎవరైనా హత్య చేశారా, లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్‌భవన్ ముట్టడి శాంపిల్ మాత్రమే

Updated By ManamMon, 05/07/2018 - 14:57

rtc హైదరాబాద్: బస్‌భవన్ ముట్టడి ఒక శాంపిల్ మాత్రమేనని ప్రగతి భవన్ ముట్టడి వరకు రానివ్వొద్దు అంటూ టీఎంయూ తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల చలవతోనే ఇప్పుడు ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా ఉన్నారని, కానీ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆర్టీసీ కార్మికులు ఎవరూ లేరని టీఎంయూ నేతలు అన్నారు.

మీ అవసరం మాకెందుందో, మా అవసరం మీకూ అంతే ఉందని, తమ డిమాండ్లను నెరవేర్చకపోతే 21 తరువాత కార్మికులు ఎప్పుడైనా సమ్మె చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక ఆత్మగౌరవంతో పనిచేసి రోజుకు రూ.13కోట్లు తెస్తే, ఆర్టీసీ నష్టాల్లో ఉందనడం దారుణమని అన్నారు. గతంలో ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని గద్దె దింపామని, ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే అదే పరిస్థితే వస్తుందని హెచ్చరించారు.

 
Related News