కర్ణాటక సీఎం కుమారస్వామి ఒక్కరోజు రైతుగా అవతరమెత్తారు. రైతులతో పాటు పొలంలో దిగి వరినాట్లు వేశారు.
తెలంగాణ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీనే అన్నారు.
రాజకీయాల్లో బాధ్యత కలిగిన వారే ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు స్పష్టం చేశారు.
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ శనివారం బిహార్ సీఎం నితిశ్ కుమార్‌‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముజప్ఫర్‌నగర్ షెల్టర్ నుంచి అదృశ్యమైన బాలిక ఆచూకీపై వారంలోగా చర్యలు తీసుకోవాల్సిందిగా నితీశ్‌కు అల్టిమేటం జారీ చేశారు.
టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు మరో షాక్ తగిలింది. ట్రాన్స్‌ట్రాయ్ ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయంపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (సీజీఎస్‌టీ) అధికారులు దాడులు చేశారు.
కోల్‌కతాలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా... ఓవైపు బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం, మరోవైపు తృణమూల్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తాయి.
రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాల సభ్యులు ఆందోళన నిర్వహించారు.
ట్రిపుల్ తలాక్ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ బిల్లు ప్రవేశపెట్టడం లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు


Related News