కేరళలో మూడో కరోనా కేసు..!

Submitted by editor on Mon, 02/03/2020 - 07:21
Asaduddin Owaisi attack on Modi govt in lok sabha

చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలకు పాకింది. మరోవైపు కరోనా వైరస్ కేరళలో ముగ్గురికి సోకిందని ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. కేరళ కాసర్‌గోడ్ జిల్లాలో ఈ కేసు నమోదు కాగా.. వీరిని ప్రత్యేకంగా ఓ వార్డులో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ త్వరగా వ్యాప్తిచెందడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర క్యాబినెట్‌ సెక్రటరీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహంచారు. వైరస్‌ని ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న జాగ్రత్తల్ని సమీక్షించారు. ప్రజలు చైనా ప్రయాణాల్ని మానుకోవాలని.. అలాగే చైనా నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని నిర్ణయించారు

చైనాలో ఆదివారం ఒక్కరోజే 57 మంది మృత్యువాత పడగా.. మరణించిన వారి సంఖ్య 361కి చేరింది. మరో 17,205 మందికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్దారించారు.